15, డిసెంబర్ 2005, గురువారం

కెరటాల కరణాలు

కెరటాల కరణం కథ వినే ఉంటారు. ఆ కరణం నోరు తెరిచి అడిగి మరీ లంచం తీసుకున్నాడు.
మన ఎంపీలు ఆయన తలదన్నిపోయారు.. వీళ్ళు నోళ్ళు తెరవాలంటేనే లంచం అడుగుతున్నారు. మనకు తెలిసినవివి..తెలియనివెన్నో..!

ఇక మండలి కూడానట
శాసనసభకు తోడు మండలి కూడా కావాలని ఆరాటపడి సాధించుకున్నారు. మరో 90 మందికి ''అవకాశాలు...''

దీనిమీద లోక్‌సభలో జరిగిన చర్చను వార్తల్లో చూసాను. అందులో ఒకాయన అంటున్నాడు.. దయచేసి తీర్మానాన్ని వ్యతిరేకించి, ఆంధ్ర ప్రజలను అవమానించకండి.. అని.

అయ్యా, మండలి కావాలని ప్రజలడగలేదు..నాయకులు తామే అడుక్కుని తామే నెరవేర్చుకుంటున్నారు. అదొస్తే మాకు ఒరిగేదీ లేదు, రాకపోతే పోయేదీ లేదు. అదొస్తే 90 మందికే "లాభం" ..రాకపోతే మిగతా తెలుగువారందరికీ లాభం. అంచేత, మీకేం కావాలో మీరు తీసేసుకోండి, పంచేసుకోండి.. మమ్మల్ని అడ్డం పెట్టుకోవాల్సిన పని లేదు.. మేమేం అనుకోం..అనుకున్నా, మేం చేసేదేమీ లేదు కదా..మరో మూడున్నరేళ్ళదాకా మేమేం చెయ్యలేమని మనందరికీ తెలిసిందేకదా. (అప్పుడైనా మేం సాధించేదేమీ లేదులే.. మహా అయితే, దెయ్యాన్ని తరిమేసి, బ్రహ్మరాక్షసిని తెచ్చిపెట్టుకుంటాం!!)

హమ్మయ్య, కాంగ్రెసు ప్రభుత్వం ప్రజలకిచ్చిన మరో వాగ్దానం తీర్చేసింది. అయ్యా రాజశేఖర రెడ్డి గారూ, గబగబా అన్ని వాగ్దానాలూ ఇలా తీర్చేయకండి.. అన్నీ అయిపోతే, కొత్త వాగ్దానాలు చెయ్యడానికి ఎన్నికలు తొందరగా పెట్టాల్సి ఉంటుందేమో..!

3 కామెంట్‌లు:

 1. మండలిని నేను కూడా మొదట్లో ఇష్టపడలేదు, ముఖ్యముగా ఈనాదు పేపరు చదివీ చదివీ
  కానీ స్వాతి లో (పేరు మర్చిపొయినాను) ఒకావిడ సలహాలు వ్రాస్తూ ఉంటారు వారు అన్నదేమిటంటే

  మండలి వస్తే కొంతమంది అయినా విద్యావంతులకు స్థానం దొరుకుతుంది అని।

  నిజమే కాబోలు అనిపిస్తుంది

  వారు ఒక ఉదాహరణగా సర్వేపల్లిగారిని సూచించినారు

  రిప్లయితొలగించండి
 2. స్వాతిలో సలహాలు ఇచ్చేవారు శ్రీమతి మాలతీ చందూర్ గారు. చూద్దాం ఆ మండలిలో ఎంతమంది విద్యావంతులు వస్తారో.

  రిప్లయితొలగించండి
 3. ‌మండలిలో విద్యావంతులకు, రాజకీయాలు తెలియని విద్యావంతులకు వారి గళాన్ని వినిపించే అవకాశం ఇస్తే మండలిని ఎందుకు వ్యతిరేకిస్తాం? మనకు తెలీదా అందులో ఎవరికి స్థానం దక్కుతుందో?
  రాజకీయం తెలిసి ఓట్లతో గెలవలేని రాజకీయనాయకుల్నే అందులో కూర్చోపెడతారు. అందులో మనకు అనుమానం ఉండాల్సిన పనే లేదు. అది రాజకీయ పునరావాస శిబిరమవుతుందే తప్ప మరింకేమీ కాదు. అసమ్మతీయుల్ని బుజ్జగించడానికో పని ముట్టు.
  -- ప్రసాద్

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు