2, నవంబర్ 2011, బుధవారం

ఆ ద్రోహులు సూర్యుడిపై ఉమ్ముతున్నారు

అబద్ధాలే పునాదిగా ఉద్యమం నిర్మించిన నాయకులు, అబద్ధాలనే ప్రచారాస్త్రాలుగా వాడుకుని ప్రజలను రెచ్చగొట్టిన నాయకులు ఎప్పుడూ అబద్ధాలే చెబుతూంటారు. చరిత్ర వాళ్లకు అనుకూలంగా లేనప్పుడు దాన్ని వక్రీకరిస్తారు, లేదా తమకు అనుకూలమైన చరిత్రను తామే తయారుచేసుకుంటారు. అందులో తెవాదులు దిట్టలు. రాజకీయ దళారులు, రాజకీయ నాయకులు, ఉద్యమం పేరుతో డబ్బులు దండుకునే నాయకులు, మేధావులు, ప్రొఫెసర్లు, పత్రికల సంపాదకులు, బూతుకవులు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, కేటుగాళ్ళు,.. అందరిదీ ఇదే పద్ధతి!

నిన్నో మొన్నో.. ఒక అసత్యవాది నమస్తే తెలంగాణ పతివూకలో (ఈ మాటకు అర్థం - ’పత్రికలో’ అని.) ఒక వ్యాసం రాసి పడేసాడంట. దాన్ని బ్లాగుల్లోనూ పెట్టి విస్తృత ప్రచారం కల్పించదలిచారు కొందరు బ్లాగరులు. అవును మరి.. అబద్ధం చెప్పేసి ఊరుకుంటే కుదరదు గదా.. దాన్ని ఊరూరా టముకు వెయ్యాలి! సరే.. ఆ వ్యాసంలోని అబద్ధాల వివరాలు చూద్దాం.

వ్యాసకర్త మొదటి దాడి అమరజీవి దీక్షమీద. పొట్టి శ్రీరాములు దీక్ష గురించి చెబుతూ.. రచయిత, "ఆయన ఏకైక డిమాండ్ ‘మదరాసు’ కోసమే" నని రాసాడు. కానీ అది అబద్ధం, చరిత్రను వక్రీకరించడం! ఆ దీక్ష గురించి స్వయంగా నెహ్రూ ఏం చెప్పాడంటే..

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 1952, అక్టోబరు 19 న పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షకు ఉపక్రమించాడు. డిసెంబరు 3 న ప్రధాని నెహ్రూ అప్పటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజగోపాలాచారికి ఇలా ఉత్తరం రాసాడు:
"ఆంధ్ర రాష్ట్రం కోసం దీక్ష లాంటిదేదో జరుగుతోంది. ఆందోళన వ్యక్తపరుస్తూ నాకు టెలిగ్రాములొస్తున్నాయి. ఇవి నన్ను ఏమాత్రం కదిలించలేవు. వీటిని ఏమాత్రం పట్టించుకోకూడదని నేను భావిస్తున్నాను"

పొట్టి శ్రీరాములు దీక్ష పట్ల నెహ్రూ కున్న అభిప్రాయం అది! నెహ్రూ ఈ ఉత్తరం రాసేనాటికి దీక్ష మొదలుపెట్టి ఆరు వారాలైంది. దీక్షకు మద్దతుగా ఒకవైపు ఆంధ్ర ప్రాంతమంతా సమ్మెలు బందులూ జరుగుతున్నాయి. ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని గమనించిన నెహ్రూ, ఆంధ్ర రాష్ట్ర డిమాండును అంగీకరించాల్సి సమయం వచ్చేసినట్టుగా సూచిస్తూ  డిసెంబరు 12 న రాజగోపాలాచారికి మరో ఉత్తరం రాసాడు. ’లేకపోతే ఆంధ్రుల్లో పూర్తి నిస్పృహ అలుముకుంటుంది. దాన్ని మనం భరించలేం’.

రెండు రోజుల తరవాత రాజాజీ ప్రధానికి ఇలా సమాధానం రాసాడు: ’మీరు స్వామి సీతారామ్ ను ఢిల్లీకి రమ్మని ఆదేశిస్తే, మరింత ఆందోళన జరక్కుండా నివారించొచ్చు. దీక్ష చేస్తున్న శ్రీరాములు పక్కనే ఉంటున్నా డతడిప్పుడు." .. "అతణ్ణి మీరు చర్చలకు ఢిల్లీకి ఆహ్వానిస్తె వాతావరణం మారి, అల్లర్లు తగ్గవచ్చు.’

కానీ అప్పటికే సమయం మించిపోయింది. డిసెంబరు 15 న 58 రోజుల నిరాహార దీక్ష తరవాత, పొట్టి శ్రీరాములు మరణించాడు.  అతడి మరణ వార్త ఆంధ్ర దేశాన్ని అట్టుడికించింది. కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. పోలీసు కాల్పుల్లో అనేకమంది ఉద్యమకారులు మరణించారు. చివరకు, పొట్టి శ్రీరాములు మరణించిన రెండు రోజుల తరువాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పటు చేస్తామని నెహ్రూ ప్రకటించాడు.

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు పట్ల చివరి వరకూ నెహ్రూ ఎంత వ్యతిరేకంగా ఉన్నాడో, రాజాజీ ఎంతలా అడ్డుపడ్డాడో వాళ్ళు రాసుకున్న ఉత్తరాలే చెబుతున్నాయి. దీన్ని బట్టి తెలుస్తున్నదేంటంటే.. పొట్టి శ్రీరాములు అమరుడయ్యేంతవరకూ భారత ప్రభుత్వం ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకోలేదన్నది సుస్పష్టం. అతడి మరణం తరవాత రెండురోజులకు గానీ ఆ నిర్ణయం వెలువడలేదు.

నెహ్రూ రాజాజీల ఉత్తరాలు ఇంత స్పష్టంగా చెబుతూంటే.., ఈ తెవాద చరిత్ర లేఖకుడికి మాత్రం ’మద్రాసే ఏకైక డిమాండు’ గా కనబడింది. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించాక కూడా దీక్ష చేసారంట! ఎన్నేసి అబద్ధాలో..!

దీనితో ఆ చవకబారు వ్యాసం ఆగలేదు, ఇంకా కొన్ని అబద్ధాలు గుప్పించాడు రచయిత.  మరికొన్ని అబద్ధాలు చూద్దాం:

"1911లో గుంటూరు పట్టణంలోని ఒక న్యాయస్థానంలో అరవ(తమిళ) వ్యక్తి జడ్జీగా ఉండేవారు. ఆ కోర్టులో ఒక చప్రాసీ (ఆంద్ర్హ భాషలో బంట్రోతు) ఉద్యోగం ఖాళీ ఉంటే తన ప్రాంతీయుడైన అరవ వ్యక్తిని జడ్జీగారు నియమించారు. ఈ సంఘటనతో కలత చెందిన ఆంధ్ర ప్రాంతీయులు మదరాసు రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రాంతాన్ని వేరు చేయాలని ఆందోళన ప్రారంభించారు."

1911 లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమం మొదలైందనడం మరొక పచ్చి అబద్ధం! నిజానికి అది అంతకు ఎన్నో యేళ్ళ ముందు మొదలైంది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలంటూ మొదటిసారి 1903 లో  యువ సాహితీ సంఘం గుంటూరులో జరిపిన సదస్సులో డిమాండు చేసింది. మద్రాసు, నైజాం, మైసూరు రాష్ట్రాల్లో (రాజ్యాల్లో)  ఉన్న తెలుగు ప్రాంతాలన్నిటినీ కలుపుతూ ఈ సదస్సు ఒక మ్యాపును కూడా తయారు చేసింది.

అంతే కాదు ఈ మేధావి అంటాడూ.. ప్రకాశం బ్యారేజీ ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక కట్టారు అని. ఇతడు దాచిపెట్టిన సంగతేంటంటే.. కాటను కట్టిన ఆనకట్ట కట్టుకుపోతే ప్రస్తుతమున్న బ్యారేజీని కట్టడం మొదలుపెట్టింది 1954 ఫిబ్రవరిలో - అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి రెండేళ్ళ ముందు. అది పూర్తైంది 1957 డిసెంబరులో -సమైక్య రాష్ట్రం ఏర్పడిన సంవత్సరానికి. ఏదో ఈళ్ళ డబ్బుల్తో దాన్ని కట్టినట్టు పోజు కొడతన్నాడు.

ఈ పైత్యపు వ్యాసాన్ని రాసిన రచయితకు ఒకటి కంటే ఎక్కువ నాలుకలున్నాయనడానికి నా దగ్గర ఇంకో దృష్టాంతం ఉంది:  మేం వెనకబడిపోయాం అంచేత రాష్ట్రాన్ని చీల్చాలి అంటూ ఉద్యమాలు చేసిన ఇతడు,  శ్రీకృష్ణ కమిటీ వేసిన కొత్తలో జరిగిన ఒక చర్చలో మాట్టాడుతూ ’అసలు తెలంగాణ రాష్ట్రం అడగడానికి వెనకబాటు తనం కారణం కాదండి, మాకు స్వయం పాలన కావాలి, మా సెంటిమెంటును గౌరవించి మాకు రాష్ట్రం ఇవ్వాలి’ అని చెప్పుకుపోయాడు. కమిటీ తరచి చూస్తే, తాము చెప్పిన వెనకబాటుతనం లెక్కల్లోని బొక్కలు బైటపడతాయని ఇతడికి తెలుసు కాబట్టి, ముందే తప్పించుకున్నాడు. ఇలాంటి వ్యక్తి చెప్పే తప్పుడు విషయాలను వాస్తవాలని కొందరు బ్లాగరులు కూడా భ్రమిస్తున్నారు.

సరే.. అబద్ధాలు చెప్పడమయ్యాక ఊరుకోలేదితడు. తెవాదులకే ప్రత్యేకించిన శైలిలో విషం కక్కాడు. అందులో కొన్ని వాక్యాలు: "తెలంగాణకేమి చేసారని ఆయన విగ్రహాలను ఇక్కడ పెట్టుకోవడం? అసలు నవంబర్ ఒకటికి పొట్టి శ్రీరాములుకు ఏమిటి సంబంధం?"

- చరిత్ర ఆంటే ఏమాత్రం గౌరవం లేని స్వార్థపరులు, నయవంచకులూ పలికే పలుకులివి.

ఆధునిక యుగంలో తెలుగువాడికి తనదంటూ ఒక ప్రత్యేక రాజ్యాన్ని మొట్టమొదటగా ఏర్పరచిన నిర్మాత పొట్టి శ్రీరాములు. ఆధునిక యుగ విద్యారణ్యస్వామి అతడు. తెలుగువారందరికీ ప్రాతఃస్మరణీయుడు. అతడి విగ్రహాలను తెలుగు గడ్డమీద ఎల్లెడలా పెట్టుకోవాలి - అందులో తెలంగాణకు మినహాయింపేమీ లేదు. ఆ మాటకొస్తే గాంధీ కూడా తెలంగాణకు స్వాతంత్ర్యం తేలేదు, మరి గాంధీ విగ్రహాలు తెలంగాణలో ఎందుకు పెట్టుకోవాలి అని అడగడం లేదే? భరతజాతి యావత్తుకూ గాంధీ చేసిన సేవకు గాను మనం చూపించుకునే గౌరవం, కృతజ్ఞతా అది. ఆ గౌరవమే తెలుగువారందరికీ సేవ చేసిన పొట్టి శ్రీరాములుకు ఇవ్వాలి. గాంధీ విగ్రహాలు తెలంగాణలో ఎందుకు పెట్టుకోవాలో పొట్టి శ్రీరాములు విగ్రహాలు కూడా అందుకే పెట్టుకోవాలి. రేపు పొరపాటున తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా - ఒకవేళ ఏర్పడితే - ఆ రాష్ట్రంలో కూడా పొట్టి శ్రీరాములు ప్రాతఃస్మరణీయుడే!

అమరజీవి పట్ల ఈ తెవాది చేసే ప్రేలాపనలు ఇతడి నేలబారు సంస్కారాన్ని సూచిస్తున్నాయి. సూర్యుడి మీద ఉమ్మేయబోయే తెలివితేటలితడివి.

ఇతడే కాదు ఈ బాపతు ద్రోహులు మరికొంతమంది కూడా మన నాయకులను అవమానిస్తూ మాట్టాడుతున్నారు. చరిత్రను వక్రీకరిస్తున్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇరవైనాలుగ్గంటలూ వాళ్లను ఇలా వంచిస్తూ, వాస్తవాలను వాళ్ళకు అందకుండా చేస్తున్నారు తెవాదులు. ఈ ద్రోహుల దివాలాకోరు ఆలోచనలను తెలంగాణ ప్రజలు తెలుసుకొనేలా, వాళ్ళు వాస్తవాలు తెలుసుకొనేలా చెయ్యాలి. అప్పుడే వేర్పాటుపై వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు.

14 కామెంట్‌లు:

  1. వీళ్ళకి నిజంగా రాష్త్రం కావాలంటే మొదట్లోనే పొట్టి శ్రీరాములుని ఆదర్శముగా తీసుకునే వారు . వీళ్ళకి ఏడవడానికి ఒకరు కావాలి అంతే. అదో తుత్తి వాళ్లకి

    రిప్లయితొలగించండి
  2. పొట్టిశ్రీరాములు విగ్రహం ఇక్కడ ఎందుకని వీరి ప్రశ్న. తెలబాన్లకు నచ్చకపోతే అది వాళ్ళ అభిమతం, కానీ ఆంధ్రులు ఆయనను గౌరవిస్తే వీరికేమిట నొప్పి? దుబాయి, బహరైన్ వంటి దేశాలలోనే హిందువులకు మందిరాలు నిర్మించుకుని పూజించుకునే స్వేచ్ఛ ఉంది. విశాలాంధ్రకు రాజధానిలో ఇంతమంది ఆంధ్రులు ఉన్నచోట వారు తమ వైతాళికులను స్మరించుకుని విగ్రహం పెట్టుకుంటే తెలంగాణా వాదులకు వచ్చిన నష్టమేమిటి? వాళ్ళనెవ్వరూ పొట్టిశ్రీరాములకు మొక్కమనో, పూజించమనో నిర్బంధించలేదే? తమ మతం, తమ అభిమతం అనుసరించే స్వేచ్ఛ భారతదేశంలో ప్రతిఒక్కడికి ఉంది. మధ్యలో వీళ్ళ పెత్తనమేమిటి?

    రిప్లయితొలగించండి
  3. నిజమే, అలాంటి చవకబారు అపద్ధాలని ప్రచారం చేసుకునే దగుల్భాజీలను ఇంకేమనాలి?

    రిప్లయితొలగించండి
  4. పొట్టిశ్రీరాములు విగ్రహం వద్దు, బిన్లాడెన్, ముల్లా ఓమర్ విగ్రహాలు కావాలేమో :D

    రిప్లయితొలగించండి
  5. బాగా రాసారండి ! ఈ అబద్దపు ప్రచారాలకి అంతూ పొంతూ లేదనుకుంటా . పైగా వీటిని జనాల బుర్రలోకి చొప్పించటానికి చానెళ్ళు , పత్రికలూ !

    రిప్లయితొలగించండి
  6. వీళ్ళు ఒక్క అమ్మకి ఒక్క అబ్బాకీ పుట్టిన రకాలు కాదు రజాకార్లకు పుట్టిన జాతి వెధవలు. వీళ్ళు మాట్లేదానికి ఒక సాక్ష్యం ఉండదు వీళ్ళ మొహాలకి సిగ్గు ఉండదు.

    రిప్లయితొలగించండి
  7. DrVvln Sastry said
    ‎Annaji Sekhar Gubbala@Uap Commandos, The issue you have risen is quite apt, but the comments made by Annaji Sekhar on a public forum is not correct. Our aim is not to degrade or abuse or through dirt on the parent hood of the people who spread Goebbels. The fact of the matter is that Amarajeevi did not do hunger strike for Madras. He has done hunger strike for the demand of Statehood based on language as a group to live in coherence for development and closeness to emerge. Unfortunately Amarajeevi was not alive when the statehood for Telugu language speaking poeple was announced after his unfortunate hunger strike death. Had he been alive whether Madras to go to Andhra or Tamilnadu might have cropped up. But When Madras Vs Tirupati (Balaji) and some acres of land in Chittoor when offered to Andhra, the then leadership was happy to accept Tirupati with Some acres of land in Chittor District. The issue of Madras was secondary at that time. Given a choice Andhrites preferred Tirupati to Madras, whereas Tamili's preferred Madras. Neverthless, the hunger strike only lead to the formation of states on the basis of language in the country.

    Mahatma Mohandas Gandhi, a durable ascetic himself, was so impressed with disciple Potti Sriramulu's ability to do without food (29 days on one occasion) that he once said: "If only I have eleven more followers like Sriramulu I will win freedom [from British rule] in a year." Last week Potti Sriramulu, in a record fast, won autonomy, within the Indian constitution, for 22 million Telugu-speaking people. It was not all that he wanted, but it cost him his life.
    http://www.facebook.com/profile.php?id=100000894689250

    రిప్లయితొలగించండి
  8. పేరు రాసుకోవడానికి కూడా భయపడే అజ్ఞానులకు అజ్నాతులకు, నీడలకు(షాడో) సమాధానం ఇవ్వాల్సివస్తున్నందుకు నాకు నేనే సిగ్గుపడుతున్నాను. మేము ఎక్కడికీ దోచుకోవడానికి రాలేదు మా రాష్ట్ర రాజధానికి వచ్చాం మా రాష్ట్రము కోసం మా తెలుగు ప్రజల కోసం మా దేశం కోసం నిద్రలేని రాత్రులతో కడుపుకట్ట్టుకొని పని చేసి తెలుగువాళ్ళు బెస్ట్ అనేలా బహుళ జాతి సంస్టలలో పనిచేసి మా ప్రతిభని తెలుగువాడి ప్రజ్నని చాతిచేపుత్న్నాం చెపుతాం. మీలాగా మాకు పదోతరగతి పాసైతే కలక్టర్ ఉద్యోగం ఇవ్వండి ఎవరినీ దేబిరించం. మా బంగారం పండే భూములు ఎకరాలు అమ్మి మీ రాళ్ళ స్తలాలు గజాల్లో కొన్నాం. మీరు మాడబ్బుతోజల్సాలు చేస్తుంటే ఆ గజాల స్తలలాలోనే మా రక్తం కరిగించి ఇల్లుకట్టుకోన్నాం. ఇపుడు ఆ స్తలాలు మీవిఎలా అవుతాయి? మా భూములన్నీ మార్కెట్ రేటుకి కొనే దమ్ము సత్తా మీ పోరంబోకు నాయకులకి గుట్కా గురివింద వెధవలకి ఉందా?

    రిప్లయితొలగించండి
  9. కెసిఆర్ ని గాని , కోదండరామ్ ని గాని నిరాహారదీక్ష చేయమనండి, హైదరాబాదు లేని తెలంగాణా (వెనుకబడిన జిల్లాలు అవే కదా మరి !) ఇస్తామని చెప్పండి , దీక్ష కొనసాగిస్తాడో లేదో చూద్దాం.

    రిప్లయితొలగించండి
  10. >> "కెసిఆర్ ని గాని , కోదండరామ్ ని గాని నిరాహారదీక్ష చేయమనండి, హైదరాబాదు లేని తెలంగాణా (వెనుకబడిన జిల్లాలు అవే కదా మరి !) ఇస్తామని చెప్పండి , దీక్ష కొనసాగిస్తాడో లేదో చూద్దాం"

    వాటికన్నా కూడా వెనకబడ్డ ప్రాంతాలు మహారాష్ట్ర, కర్నాటకల్లో కలిసిన తెలంగాణ జిల్లాల్లో ఉన్నాయి. వెనకబాటుదనమో, స్వయంపాలనో, ఇంకోటో - వీళ్లకి నిజంగా తెలంగాణపై ప్రేముంటే పొరుగు రాష్ట్రాల్లో కలిసిన నైజాము జిల్లాల్ని కలిపిన తెలంగాణ రాష్ట్రం ఇమ్మనాలి. ఆ మాటెత్తితే కన్నడిగులూ, మరాఠీలూ విరగదంతారు. అప్పనంగా దొరికింది తెలుగోళ్లే. అందుకే ఈ నాటకాలన్నీ.

    రిప్లయితొలగించండి
  11. ఆంధ్ర రాష్ట్ర సాధనకొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి,అమరజీవియైన మహాపురుషుడు,పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాత:స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీబోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.

    రిప్లయితొలగించండి
  12. పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌను, అణ్ణాపిళ్ళె వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పడమటిపాలెంగ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలోశానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. అతని జీతం వెలకు 250 రూపాయలు.
    1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోవడం జరిగింది. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు

    రిప్లయితొలగించండి
  13. మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తిఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు. చివరికి 1952 డిసెంబర్ 15అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన శవయాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు. చివరికి డిసెంబర్ 19నప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూప్రకటన చేసాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్క రోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోటానికి వీల్లేదని మరునాడే వెళ్ళిపోవాలని చక్రవర్తుల రాజగోపాలాచారి తెగేసి చెప్పాడు. అయితే కాకతీయులు పాలించిన వరంగల్లు రాజధానిగా బాగుంటుందని అంబేద్కర్సూచించారు. రాజమండ్రి కూడా మంచిదేనన్నారు. విజయవాడ కమ్యూనిస్టుల కంచు కోట కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వొప్పుకోలేదు. నెల్లూరు,చిత్తూరు నాయకులు మాకు మద్రాసు దగ్గరగా వున్న సౌకర్యం వదులుకోవాలా అని అలిగారు. కోస్తా వాళ్ళను మేము నమ్మం,రాయలసీమ లోనే రాజదాని పేట్టలి అంటే KARNUL CAPITAL ఆంద్ర రాష్ట్రం ఏర్పడింది.p

    రిప్లయితొలగించండి
  14. పొట్టి శ్రీరములు గారు వేర్పటు వాది.... అని చెప్పకనే చెబుతున్నరు... అలాంటప్పుడు సమైఖ్య వాదానికి... ఆయన పోటొ ఎందుకు పెట్టు కున్నరో... చెప్పలి మరి...?

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు