తెలుగులో పదాలను వాక్యంలో ఇమిడ్చేటపుడు అవి రూపం కోల్పోతూ ఉంటాయి. సంధి జరిగి, సమాసం ఏర్పడినపుడు, బహువచనాలైనపుడు, విభక్తులు చేరినపుడు, .. ఇలా అనేక రకాలుగా పదాల రూపు మారుతూంటుంది. క్రియా రూపాలను బట్టి మారడం సరేసరి! ఇంగ్లీషులోనూ మారతాయిగానీ, తెలుగులో మారినంత ఎక్కువగా ఆ భాషలో జరగదు. పైగా ఇంగ్లీషులో జరిగే మార్పులు కొన్ని ఖచ్చితమైన నియమాలకు లోబడి జరుగుతాయి. ఆ నియమాలు కూడా తక్కువే. తెలుగులోనూ నియమాలున్నాయి గానీ, అవి చాలా ఎక్కువ.
11, నవంబర్ 2011, శుక్రవారం
4, నవంబర్ 2011, శుక్రవారం
సీబీఐ ని విచారించిన జగన్ !
ఇవ్వాళ సీబీఐ జగన్ను పిలిచి విచారించింది. గాలి కేసులో జరిగిందీ విచారణ. ఓ రెండు గంటల విచారణ తరవాత బైటికొచ్చిన జగన్ విలేఖరులతో మాట్టాడాడు.
’నన్ను కేవలంగా సాక్షిగా మాత్రమే విచారించారు. సబితమ్మ గారిని ఏవిధంగానైతే సాక్షిగా విచారించారో అలాగే నన్నూ విచారించారు. అసలు 2002 లో ఈ భూములను (ఏ భూములో చెప్పలేదుగానీ.. టీ హీరెహాళ్ మండలంలోని భూములు అనుకుంటాను) ఓబుళాపురం మైనింగు కంపెనీకి ఇచ్చినది చంద్రబాబేననీ, ఫలానా జీవో ప్రకారం ఆ భూములను ధారాదత్తం చేసారనీ అంచేత చంద్రబాబును కూడా విచారించాలనీ సీబీఐకి చెప్పాను’, అని పత్రికల వాళ్ళకు చెప్పాడు. ఆ జీవో కాపీలను కూడా పత్రికల వాళ్లకు ప్రదర్శించాడు. ఇకనైనా చంద్రబాబును గుడ్డిగా సమర్ధించే ఎల్లో పత్రికలు బుద్ధి తెచ్చుకుని నిజాలు రాస్తారని ఆశిస్తున్నాను. అని కూడా అన్నాడు.

2, నవంబర్ 2011, బుధవారం
ఆ ద్రోహులు సూర్యుడిపై ఉమ్ముతున్నారు
అబద్ధాలే పునాదిగా ఉద్యమం నిర్మించిన నాయకులు, అబద్ధాలనే ప్రచారాస్త్రాలుగా వాడుకుని ప్రజలను రెచ్చగొట్టిన నాయకులు ఎప్పుడూ అబద్ధాలే చెబుతూంటారు. చరిత్ర వాళ్లకు అనుకూలంగా లేనప్పుడు దాన్ని వక్రీకరిస్తారు, లేదా తమకు అనుకూలమైన చరిత్రను తామే తయారుచేసుకుంటారు. అందులో తెవాదులు దిట్టలు. రాజకీయ దళారులు, రాజకీయ నాయకులు, ఉద్యమం పేరుతో డబ్బులు దండుకునే నాయకులు, మేధావులు, ప్రొఫెసర్లు, పత్రికల సంపాదకులు, బూతుకవులు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, కేటుగాళ్ళు,.. అందరిదీ ఇదే పద్ధతి!
1, నవంబర్ 2011, మంగళవారం
జయహో ఆంధ్రప్రదేశ్!
దాదాపు నూట యాభై ఏళ్ళ వియోగం తరవాత 1956 నవంబరు 1 న తెలుగుజాతి తిరిగి
ఏకమైంది. అభివృద్ధి పట్ల, జీవన పరిస్థితుల మెరుగుదల పట్లా ప్రజల్లో ఉన్న ఆకాంక్షలను తీర్చడానికై సమైక్య రాష్ట్రం ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి. మామూలుగా ప్రభుత్వాల్లో ఉండే అలసత్వం, నాయకులు, పాలకుల్లో ఉండే అవినీతి, అక్రమాల వంటి అవలక్షణాలు ఈ ప్రభుత్వాల్లోనూ ఉన్నాయి. ఈ అవకరాల గురించి చేసే విమర్శలు రోజూ మనం చదువుతూనే ఉన్నాం. వింటున్నాం. మనమూ రాస్తున్నాం. బ్లాగుల్లోను, ఇతర మీడియాలోను, ప్రజల్లోను, వివిధ వేదికల మీదా అనేక విమర్శలు వస్తున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
సంబంధిత టపాలు
loading..