తెలుగు సినిమా దశ దిశ గురించి శనివారం నాడు హెచ్చెమ్ టీవీ ఒక చర్చా కార్యక్రమం చేసింది. అనేకమంది నిర్మాతలు, దర్శకులు ఇతర సాంకేతికులూ ఈ అమావేశంలో పాల్గొని తమ గోడు వెళ్ళబోసుకున్నారు. పరిశ్రమ గురించి చర్చ పెడితే, పెద్ద నటులెవరూ రాలేదు. పెద్ద నిర్మాతలు, దర్శకులూ కూడా ఎవరూ రాలేదు. -వాళ్ళను పిలవలేదో, పిలిచినా రాలేదో, వాళ్ళకు లాభం కలిగే సంగతులు ఇక్కడ లేవో, మరింకేంటో! రామచంద్రమూర్తి మన ఉద్దేశం ఫాల్ట్ ఫైండింగు కాదు ఫ్యాక్ట్ ఫైండింగ్! అని చెప్పాడు. పాల్గొన్నవాళ్లలో కొందరు: ప్రసన్న కుమార్, సాగర్, విజయచందర్, విజేందర్ రెడ్డి, ఏవీయెస్.
27, సెప్టెంబర్ 2010, సోమవారం
18, సెప్టెంబర్ 2010, శనివారం
వంచన దినం! వంచకుల దినం!!
ఈయేడు సెప్టెంబరు 17 నాడు ఏం చేసుకోవాలో తెలీలేదు మన రాజకీయ నాయకులకు. పదిహేను రోజుల ముందుదాకా ఒక్కోడు పెద్దపెద్ద కబుర్లు చెప్పారు. వీర తెవాదులు విమోచనమన్నారు. అంత వీరులుకానివారు విలీనమన్నారు. సరే.., కొందరు మూర్ఖవాదులు విద్రోహమన్నారు - వీళ్ళని పక్కన పెట్టెయ్యొచ్చు ప్రస్తుతానికి. వీళ్ళంతా ఇట్టా పోసుకోలు కబుర్లు చెబుతూ ఉన్నప్పుడు ముస్లిములు అడ్డు చెప్పలేదు, వాగనిచ్చారు. తరవాత ఒక ఇఫ్తారు పార్టీ పెట్టారు.
15, సెప్టెంబర్ 2010, బుధవారం
పొద్దులో నేను..
ఈమధ్య మా స్నేహితుడొకణ్ణి కలిసినపుడు, పొద్దు చూసావా అని అడిగాను. వాడు నన్నోసారి వింతగా చూసి, ’నేను చూసేసరికి నడినెత్తిన ఉంటది, ఇంకేం చూస్తాను?’ అన్నాడు. అది కా దది కాదు.. పొద్దు, పొద్దు పత్రిక! చదివావా? అని అడిగాను. నన్నొక పిచ్చివాణ్ణి చూసినట్టు చూసాడు. వాడికి ముందే పత్రికలు, పుస్తకాలు, చదవడం లాంటివంటే ఎలర్జీ. చిన్నప్పుడెప్పుడో చందమామ చదివితే, ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయంట. సైన్సు పుస్తకం చదవబోతే కళ్ళు వాచిపోయినై. అప్పటినుంచీ, పుస్తకాల జోలికి వెళ్ళకుండా జాగర్తగా నెట్టుకొస్తున్నాడు. అలాంటివాణ్ణి పొద్దు చదివావా అని అడిగితే, వాడు నావంక అయోమయంగా చూడ్డూ మరి!
10, సెప్టెంబర్ 2010, శుక్రవారం
పోయినోళ్ళందరూ మంచోళ్ళే..
పోయినోళ్ళందరూ... మంచోళ్ళు! ఉన్నోళ్ళూ పోయినోళ్ళ తీపి గురుతులు!! -ఆత్రేయ చెప్పాడంట.
రాశేరె కూడా పోయాడు. కాబట్టి చాల మంచోడు!
రాశేరె కూడా పోయాడు. కాబట్టి చాల మంచోడు!
6, సెప్టెంబర్ 2010, సోమవారం
మబ్బులు చూపించి.. ముంత ఒలకబోయించి..
కొందరు తెవాదుల అకృత్యాలు ఉండేకొద్దీ వికృత రూపాన్ని తీసుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. డిసెంబరు తరవాత ’అలజడి సృష్టించడానికి’ ఇప్పటినుండే రిహార్సళ్ళు చేసుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. మొన్న ఉస్మానియాలో తెవాదులు పేపర్లు దిద్దే పంతుళ్ళను వెంటబడి మరీ దాడి చేసి కొట్టారు. అప్పుడు చేసిన తప్పును కప్పిపుచ్చే అవకాశం గ్రూప్ వన్ పరీక్షల రూపంలో ఇప్పుడు వచ్చింది. వెంటనే అవకాశాన్ని అందుకున్నారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి, వాళ్ళ మనసులను విషపూరితం చేసే ఏ అవకాశాన్నీ ఈ దుష్ట తెవాదులు ఒదులుకోరు. గ్రూప్ వన్ పరీక్షలు ఆపెయ్యాల్సిందేనంటూ గోల చేసారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
సంబంధిత టపాలు
loading..