21, జులై 2010, బుధవారం

నిష్పాక్షికతను కోరే పక్షపాతులు!

చంద్రబాబు బాబ్లి యాత్ర నేపథ్యంలో, కొందరు మీడియా మీద పడ్డారు.  మీడియా అనవసరంగా చంద్రబాబుకు ప్రాధాన్యతనిచ్చి, ఉపఎన్నికల్లో  తెరాస ఓడేందుకు పని చేస్తోంది - ఇదీ వారి ఆరోపణ. చాలా అసంబద్ధమైన ఆరోపణ అది. అసలీ నాలుగైదు రోజుల్లో బాబ్లి యాత్రకు మించిన ప్రాధాన్యత కలిగిన మరో సంఘటన లేదు, అంతకంటే పెద్ద వార్తా లేదు. అంచేత, సహజంగానే బాబ్లి యాత్ర  మీడియాలో బాగా ఫోకసైంది.  

జూలై  16 , 20 ల మధ్య చంద్రబాబు తన ఎమ్మెల్యేలు, ఎంపీలందరితో కలిసి బాబ్లి యాత్ర  చేసాడు. ఆనాటి నుండీ మీడియా దృష్టి అంతా వారిమీదే!  ఆ నాలుగైదు రోజుల్లోనూ జరిగిన అతి ముఖ్యమైన సంఘటన అది. రాష్ట్రానికి చెందిన డెబ్భై ఎనభై మంది ప్రతిపక్ష నాయకులు మహారాష్ట్రలో అరెస్టైతే, అది ప్రధాన వార్త కాకపోతే మరింకేంటి? అంతకు మించిన వార్త ఏముంది ఆ రోజుల్లో? సహజంగానే మీడియా అంతా ఈ వార్త చూట్టూతానే తిరిగింది. అయితే కొందరికి మాత్రం ఇది పక్షపాత ధోరణిలో కనిపించింది. వాళ్ళు ఇలా తీర్మానించారు:

ఈ యాత్రను, అక్కడ అరెస్టైనవారి ఇక్కట్లనూ, ఉన్నవీ లేనివీ కల్పించి,  కళ్ళక్కటినట్టుగా వర్ణించి, చూపించి  ప్రజల్లో సానుభూతి పెంచి, తద్వారా ఉపఎన్నికల్లో తెరాస ఓడేలా చేసి, తెలంగాణవాదాన్ని ఓడించాలనేది మీడియా కుతంత్రమంట. కోస్తా, సీమ వాళ్ళ అధీనంలో ఉన్న మీడియా సంస్థలన్నీ కలిసి ఆడుతున్న నాటకమంట.  అంటే, చంద్రబాబు చేసిన యాత్రకు అస లేమాత్రం  ప్రాధాన్యత లేదు, అదంతా అతడూ, మీడియా వాళ్ళూ కలిసి ఆడిన నాటకమేనని ఈ తెలంగాణావాదులు చెబుతున్నారా?

చంద్రబాబు చేపట్టిన యాత్ర ఎన్నికల కోసం చేసాడని అన్నారు. ప్రచారాన్ని తప్పించుకోవచ్చనే  నాటకమని అన్నారు. ఔన్నిజమే, ఎన్నికల ప్రచారం కోసమే చేసాడు.  అయితే తప్పేంటి? ఒక్కొహడు ఒక్కో రకంగా ప్రచారం చేసుకుంటన్నాడు. ఒహడు చర్చికెళ్ళి మైనారిటీ కార్డు వాడతాడు -మీరు మైనారిటీయే నేను మైనారిటీయే అంచేత నాకు ఓటెయ్యండి అంటూ. ఇంకొహడెళ్ళి నేను బీసీని, ఈసారి బీసీవాడు ముఖ్యమంత్రి కావాల్సిందే అంచేత నాకే ఓటెయ్యండి అంటాడు. ఇంకొహడు డిసెంబరు తరవాత తెలంగాణలో రక్తం పారిద్దాం, నన్ను గెలిపించండి అంటాడు. ఎవడి దారిన వాడు ఓట్లడుక్కుంటన్నాడు. చంద్రబాబూ ఒహదారి కనుక్కున్నాడు. మిగతావాళ్ళ దారితో పోలిస్తే, చంద్రబాబు దారి ఎంతో మెరుగు. ఎంచేతంటే, ఒక చిరకాల సమస్యకు జాతీయ స్థాయి ప్రాధాన్యత తీసుకొచ్చాడు. రాష్ట్రానికి ఎంతోకొంత ఉపయోగపడింది.

ఇహ, ప్రజల దగ్గరకు వెళ్ళలేకపోవడం - అదీ నిజమే. జనాన్ని ఆ రకంగా రెచ్చగొట్టిపెట్టారు. బాబ్లి లాంటి సమస్యల గురించి మాట్టాడితే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం అంటూ ఊదరగొట్టి వాళ్ళు నోళ్ళు మూసుకునేలా చేసారు. వినోదం సినిమాలో ననుకుంటా.., హీరో, ఆడి సత్రకాయలూ కలిసి, కోట శ్రీనివాసరావుకు తనకో కవల తమ్ముడున్నాడనే భ్రమను కల్పిస్తారు . ఆ భ్రమలో నుంచి బైటకి వస్తున్నాడనే అనుమానం రాగానే, అందరూ కమ్మేసి, అతడికి వేరే ఆలోచనలు రానివ్వకుండా, జై సుబ్బారావనో మరోటో నినాదం చేసి ఊదరగొట్టేసి, అతడికి అయోమయం వీడకుండా చేస్తారు.  ఇవ్వాళ తెలంగాణ  నాయకుల పరిస్థితి కూడా అలాగే ఐంది .  ఏ నాయకుడైనా  బాబ్లి గురించి మాట్టాడబోతే, ఠక్కున జై జై తెలంగాణ అని నినాదాలు చేసి, డిసెంబరునుంచి రక్తం పారుద్ది, ముందున్నది అంతర్యుద్ధమే.. అంటూ ఊదరగొట్టేస్తున్నారు. మరి చంద్రబాబు బాబ్లి గురించి ఆందోళన చేస్తే వాళ్ళకు కారం రాసుకున్నట్టుండదూ!!?

ఓట్లొస్తాయా రావా అనేది పక్కనుంచండి, చంద్రబాబు సరైన సమస్యనే తీసుకుని గొడవ చేసాడు, సమర్ధవంతంగా చేసాడు.  అసలు ప్రతిపక్ష నాయకుడిగా అతడు ఇంత ప్రభావవంతంగా  ఎప్పుడూ వ్యవహరించలేదని నా ఉద్దేశం.  తెదేకు ఈ ఎన్నికల్లో ఓట్లు ఎన్నొచ్చినా ఫలితంలో పెద్ద తేడా ఉండకపోవచ్చు. కానీ చంద్రబాబు సమస్యను వెలుగులోకి తెచ్చాడు. దేశం దృష్టిని అటువైపు తిప్పాడు. నాల్రోల పాటు ఇటు మన రాష్ట్రానికి,  అటు మహారాష్ట్రకీ, కొంతవరకు సోనియాకీ ఎజెండాను నిర్దేశించాడు.  రేప్పొద్దున ప్రధాని దగ్గర జరిగే అఖిలపక్ష సమావేశం కుసింత సీరియస్సుగా తీసుకోవచ్చీ సమస్యను.

అన్యాపదేశంగా చంద్రబాబు ఇంకోటి కూడా చేసాడు - కొందరు తె.వాదుల డొల్లతనాన్ని కూడా బైటపెట్టాడు.  చంద్రబాబుకు ఎక్కడ సానుభూతి వచ్చేస్తదో, ఓట్లు కొట్టెస్తాడోనని తె.వాదులు అల్లాడి పోయారు.  అతణ్ణి వదిలెయ్యగానే హమ్మయ్య ఇప్పటికైనా వదిలేసారు అని సంతోషించారంటే ఈ తె.వాదులు ఎంతలా భయపడ్డారో అర్థమౌతోంది.  ఎందుకంటే..  బాబ్లీ అనేది తెలంగాణ ప్రజల తక్షణ సమస్య అని, దానికి ప్రజల మనసులను ప్రభావితం చేసే శక్తి ఉన్నదనీ వాళ్ళకు తెలుసు.  ఇంకొందరు తెదేపా గెలవకపోయినా, ఓట్లు చీల్చేసుకుని, కాంగ్రెసు గెల్చేలా చేస్తుందేమోనని కూడా భయపడిపోయారు. 

చంద్రబాబును తిట్టారు సరే, వాళ్ళు మీడియానూ వదల్లేదు. 

ఫలానావాళ్ళు గెలవాలి, ఫలానావాళ్ళు గెలవకూడదు అనే కోరిక ఉండటం సహజం. అందుకు పనిచెయ్యడమూ తప్పేం కాదు. కానీ మీడియా అందుకు సాయపడతల్లేదని ఆడిపోసుకోవడం మాత్రం హాస్యాస్పదంగా ఉంది.  అరెస్టైన ఫోటోలు, లాఠీలతో కొట్టిన ఫొటోలూ వేసి, టీవీల్లో చూపించి, సానుభూతి వచ్చేలా చేసారని మీడియా మీద అక్కసు వెళ్ళగక్కుతున్నారు.   మీడియా నిష్పాక్షికంగా ఉంది అని నేను చెప్పడం లేదు. కానీ,  బాబ్లి యాత్రకు ప్రాధాన్యత ఉందనీ, ఈ ఐదు రోజులూ దానికి ప్రాధాన్యత  ఇవ్వకపోతేనే అది పక్షపాతమయ్యేదనీ అంటున్నాను. 2009 డిసెంబరులో ఒక్క మనిషి చేసిన నిరాహారదీక్ష మీడియా మొత్తాన్ని తనవైపుకే తిప్పుకుందన్న సంగతి వీళ్ళు మర్చిపోయారా? ఆ ఒక్క మనిషి వైపుకే కెమెరాలన్నీ నిలిపి ఉంచారనీ, కొన్ని వారాల పాటు ఆ వార్త, ఆ వాదనా తప్ప మరోటి వినబళ్ళేదనీ మనకు తెలుసు. అలాంటిది, ఇప్పుడు డెబ్బై ఎనభై మంది నాయకులు - ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు, శాసనసభలోని యావత్ ప్రధాన ప్రతిపక్షం అంతా పక్క రాష్ట్రంలో అరెస్టైతే, ఆ వార్తలు రాయడం, ఆ ఫొటోలు వెయ్యడం, ఆ వీడియోలు చూపించడం తప్పా? అది పక్షపాతమా? మన గురించి బాగా రాస్తే మన శ్రీనివాసు, లేకపోతే వేమూరి గాడు -ఇదీ వరస!  మనకు నచ్చినవి వేస్తే  నిష్పాక్షికత, లేకపోతే అబద్ధాలు, కుట్రలు!!  ఏం వింతరా నాయనా!!?


ఇహపోతే, వాళ్ళక్కడ రాజభోగాలనుభవించారు, ఏసీ గదుల్లో ఉన్నారు అంటూ చెప్పుకొస్తున్నారు, కొందరు. వీళ్ళు చెప్పే మాటలు కూడా మీడియాలో వచ్చినవే, వీళ్ళు చూసినవి కావు.  ఆ వార్తలు మాత్రం సమ్మగా ఉంటై, చంద్రబాబుకు అనుకూలంగా ఉండే వార్తలు చూస్తే మాత్రం దురదగుండాకు రాసుకున్నట్టుగా ఉంటది.  ఏఁ, మహా ఘనత వహించిన నిరాహారదీక్షాదక్షుడు సుబ్బరంగా రోజూ ఇడ్లీలు మింగేవాడనీ, ఆ గదంతా పచ్చడి వాసనొచ్చేదనీ అప్పుడు జనం చెప్పుకోలా? అవి పత్రికల్లో ఎక్కడా ప్రముఖంగా రాలేదు. ఈ నిష్పాక్షికులెవరూ అప్పుడు మాట్టాడలేదు. మనకనుకూలంగా ఉన్నప్పుడు నిష్పాక్షికత ఉన్నట్టూ, లేనప్పుడు పరమ పక్షపాతం వహిస్తున్నట్టూనా?

29 కామెంట్‌లు:

  1. good post
    చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. chandrababuku ippudu jnanodayam ayyindi.1st time oka real rajakiya nayakudu laga behave chesadu.governors,presidents,primeministers ku petitionlu ista undevadu.TDP lo thana leadership ku threat lekunda chesukunnadu. party cadre lo oka kotta utsaham tisukochhadu.created sympathy ela sustain chestado choodali.

    రిప్లయితొలగించండి
  3. ఇదంతా చెప్పి.... ఇన్నాళ్ళూ లేని యాత్ర ..ఇప్పుడే ఎందుకు చేశాడో కూడా చెప్పి ఉంటే బావుండేది... ఇది నీ పక్ష పాతం కాదా ?... తె. వాదులను విమర్శించాలనేది మాత్రమే మీ వ్యూహం లా ఉంది...

    రిప్లయితొలగించండి
  4. బాగా రాసారు . మీరు ఇంకొక విషయం మర్చిపోయారు చంద్ర బాబు పనిపాటా లేక తన స్వార్ధం కోసం మరాఠీ లకు , తెలుగు వాళ్లకు గొడవ పెట్టాడట , కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినా సరే మాట వినలేదట . ఈ సుద్దులు చెప్పే వాళ్ళు భలే కన్వీనియెంట్ తమ దారిన బతుకున్న జనాల మధ్య చిచ్చు పెట్టిన పెద్ద మనిషి సంగతి , అలాగే కేంద్రం ఒక కమిటీ వేసిన తరవాత నోటికి వచ్చిన దంతా వాగి విషాన్ని కక్కి తమ పబ్బం తాము గడుపుకునే పెద్ద మనుషుల సంగతి మాత్రం మర్చిపోతారు .

    రిప్లయితొలగించండి
  5. >> " జై సుబ్బారావనో మరోటో ...."

    మరోటే. "కార్మిక నాయకుడి సింగారం .... వర్ధిల్లాలి"

    ప్రశ్న: ఇప్పుడే ఎందుకు యాత్ర చేశాడు?
    ఎదురు ప్రశ్న: ఏం. ఇప్పుడెందుకు చెయ్యకూడదు?

    రాజకీయ నాయకుడు రాజకీయం చెయ్యక ఏం చేస్తాడు మరి.

    రిప్లయితొలగించండి
  6. మీడియా సీమోల్లది, ఆంద్రోల్లదీనా? కొన్ని నెల్ల ముందు నిరాహార దీక్షలు జరిగినప్పుడు గుర్తుకు రాలే? ఓ నిఖార్సయిన సమస్య బయటకు వచ్చినపుడు (తెచ్చినతని ఉద్దేశ్యాలు ఏమైనా ఉండనీ గాక) ఆ సమస్య గురించి ఆలోచిద్దామని కాకుండా, ఎవడు బాగుపడిపోతాడో అని అలగడం శోచనీయం. రాజాకీయం ఇంత దివాళా కోరుగా మారుతుండడం మింగుడుపడకుండా ఉంది.

    రిప్లయితొలగించండి
  7. "నిష్పాక్షికతను కోరే పక్షపాతులు"

    బాగా చెప్పారు

    మీతొ పూర్తిగా ఏకిభవిస్తున్నాను

    ఆంధ్ర వాళ్ళ నొట్లొ మట్టికొట్టినా సరె పరవాలెదు కాని రాజకియాలు చెయ్యకూడదట

    ఒక్క పెద్దమనిషి మహరాష్టలొ ఉన్న తెలుగొళ్ళ గురుంచి బాధపడిపొతున్నాడు

    మనొళ్ళని బాగా కుమ్మి వదిలిపెట్టారు కాని అడిగె దిక్కు లెదు

    రిప్లయితొలగించండి
  8. @ Chandra

    >>ఇదంతా చెప్పి.... ఇన్నాళ్ళూ లేని యాత్ర ..ఇప్పుడే ఎందుకు చేశాడో >>కూడా చెప్పి ఉంటే బావుండేది... ఇది నీ పక్ష పాతం కాదా ?... తె. >>వాదులను విమర్శించాలనేది మాత్రమే మీ వ్యూహం లా ఉంది...

    చంద్ర గారికి మీరీ టి ఆర్ ఎస్ అని అర్ధం అయింది కాని అండి
    ౧) ఇలా అంటే KCR , అన్నాళ్ళు తెలుగు దేశం లో ఉండి అప్పుడే ఎందుకు పార్టీ పెట్టాడు ?
    ౨) నాకు బాగా గుర్తు , మన తెలంగాణా విద్యార్దులను ఎగేసి అసెంబ్లీ ముట్టడి అని ఒక్క నాయకుడు కూడా బయటకు రాలేదు . ఆ రోజే నాకు టి ఆర్ ఎస్ మీద సానుబూతి పోయింది
    ౩) మన తెలంగాణా పోరాటంలో ఎంతం మంది నాయకులు ఇప్పటికి దెబ్బలు తిన్నారు . బాబ్లీ మన కోసమే కదా మరి KCR ఎందుకు వెళ్ళటం లేదు . తంతారని బయం
    ౪) ఒకటి మాత్రం నిజం , నేను చూసిన ఇప్పటి వరకు రాజకీయనాయకులలో అంత రిస్క్ చేసింది వీళ్ళే . మా జిల్లా MP నామా నాగేశ్వర రావు కి అంత గత్యంతరం ఏమిటి . అయన పార్లమెంటులోనే వేల కోట్లు ఉన్నాయని డిక్లేర్ చేసిన వాడు . ఆయనకి ఇది అవసరమా ...?

    రిప్లయితొలగించండి
  9. అవును అండీ. ఇన్నాళూ, జగన్నున్నూ, రోశయ్యానే కనిపించారు వార్తల్లో. ప్రతిపక్షం అన్న మాటే లేదు. మర్చిపోయామేమో అనుకున్న పదాలు తెర మీదికొచ్చాయి. మొన్న సోంపేట గురించీ, ఈ రోజు బాబ్లీ గురించీ చదివి బా అనిపించింది. చాన్నాళ్ళకి ప్రతిపక్షం ఏదో ఒక పనంటూ చేసి నేనూ ఉన్నానోచ్ అని అన్నట్టనిపించింది.

    రిప్లయితొలగించండి
  10. Chandra: ’ఇన్నాళ్ళూ లేని యాత్ర’ కాదండి, 2004 నుంచీ బాబ్లి మీద గోల చేస్తూంది, తెలుగు దేశం. ఈ యాత్రే మొదటిదీ కాదు వాళ్ళకి. పోతే నా పక్షపాతం సంగతి.. తె.వాదులను విమర్శించడమే - నా వ్యూహం కాదు - ఈ టపా ఉద్దేశం. నా విమర్శలో తప్పుంటే చెప్పండి.
    anu, శేఖర్ పెద్దగోపు, కోనసీమ కుర్రాడు, Sujata: నెనరులు.
    tyarakam: సరిగ్గా చెప్పారు.
    Sravya Vattikuti: ఔను!
    అబ్రకదబ్ర: డైలాగు భలే గుర్తుందే! :)
    రవి: సమస్య మనందరిదీ అని తెలిసీ, చంద్రబాబు దాన్ని తలకెత్తుకున్నాడు కాబట్టి, మనం ఆ ఆందోళనకు మద్దతివ్వకూడదు అనేది ఈ నాయకుల మనస్తత్వం. మొన్నో బ్లాగులో చూసాన్సార్.. కొమరం భీముకు రావాల్సినంత ప్రాముఖ్యత రావట్లేదని బాధపడుతూ, అల్లూరిని తక్కువ చేసి మాట్టాడారు. మనం బాగుపడకపోయినా పర్లేదు, తోటి తెలుగువాడు పెద్దవాడు కాకూడదు, మన ఖర్మ కాలిపోయినా సరే! - ఇదీ మన వెధవాయిత్వం. తట్టలో పీతల్లాంటివాళ్ళం మనం!
    khammam: "KCR , అన్నాళ్ళు తెలుగు దేశం లో ఉండి అప్పుడే ఎందుకు పార్టీ పెట్టాడు ?" - సూటి ప్రశ్న!

    రిప్లయితొలగించండి
  11. నాకు ఇలా నిఖార్సుగా నిగ్గతీసే తెలుగు వాళ్ళు కావాలి...

    రిప్లయితొలగించండి
  12. తె(లంగా)ణవాదుల్ని ఉతికి ఆఱేశారు. నెనర్లు

    రిప్లయితొలగించండి
  13. అసలు రాజకీయ నాయకులకి కావల్సింది పదవే, పదవి కాకుండా ప్రజసేవకి రాజకీయాల్లోకి యెందుకొస్తారు??
    తరువాత, ఎదో ఒక్క రోజు నిరాహారదీక్ష చేసి, ఇంక నా వల్ల కాదబ్బ, నేను ఇంటికిపోయి నిద్రపోవాలనో, నేను అర్జెంటుగా సి.యం. ఐపొవాలి నాకు ఓట్లు వేసెయ్యండనో కాకుండా, గట్టిగా చేసాడు.
    విజయశాంతి పొద్దున జైల్ కి వెళ్ళి, బెయిల్ తిసుకోను అని సాయంకాలానికి తిరిగి రాలేదు, మమత ఓ రెండు రోజులు నిరాహార దీక్ష చేసి మానేయలేదు.
    వాళ్ళే ఇది చేస్తే మొదటి రొజే బెయిల్ తీసుకోని సాయంకాలానికి ఇంటికి తిరిగొచ్చేవారు,
    గట్టిగా చేసి జనాల మనసు దోచాడు,మిగతావారు కుడా చూసి నేర్చుకుంటే మన గౌరవం అన్నా నిలబడుతుంది

    రిప్లయితొలగించండి
  14. "నిష్పాక్షికతను కోరే పక్షపాతులు!"
    శీర్షిక చాల బాగుంది..!!

    రిప్లయితొలగించండి
  15. చదువరి గారు,
    బాగా రాసారు. ఎటొచ్చి సమస్యకి సీరియస్స్‌నెస్ మాత్రమే సరిపోదు. ఎలాగు మన (అ)ముఖ్యమంత్రి గారికి చేత కాదు గాని, అఖిల పక్షంలో పరిష్కారం కూడా వచ్చేటట్టు చేస్తె ఇంకా బాగుంటది, జరిగే పని కాదు అనుకోండీ.

    >> ఏఁ, మహా ఘనత వహించిన నిరాహారదీక్షాదక్షుడు సుబ్బరంగా రోజూ ఇడ్లీలు మింగేవాడనీ, ఆ గదంతా పచ్చడి వాసనొచ్చేదనీ అప్పుడు జనం చెప్పుకోలా? >>

    అరే .. ఈ విషయం నేనెప్పుడు వినలేదే.. భలే ఫన్నీగా వుంది. హహ్హహ్హా..

    రిప్లయితొలగించండి
  16. చప్పట్లు, చప్పట్లు


    గట్టిగా

    రిప్లయితొలగించండి
  17. very crisp and meaningful narration.
    kudos to vennala raajyam for logical conclusion

    రిప్లయితొలగించండి
  18. చాలా బాగా చెప్పారు.
    నేను మీతో ఏకీభవిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  19. రాజకీయాలు చేసి జనానికి మంచి చేసేదే రాజకీయం.బాబు రాజకీయాలలో ఉండి రాజకీయం చేయకుండా ఇంకేమి చేయాలి. బాబులా రాజకీయం చేయడానికి తమకు చేతగాక పాపం నాయకులు కక్కలేక మింగలేక రాజకీయం అని అంటూ సొల్లు మాట్లాడుతున్నారు. బాబు ఒకేదెబ్బతో చాలాపిట్టల్ని కొట్టి అందరికి ఓకేసారి దిక్కులు చూపించాడు. చాలా బాగా రాసారు,మీరు ఇంకా బాగా విశ్లేషించగలరు,కంటిన్యు టపా రాయండి.

    రిప్లయితొలగించండి
  20. Nice article. It is shame that our leaders (TRS and Congress) does not have that little common sence.

    Ealier we fought for British. Now another forigner. How long???

    రిప్లయితొలగించండి
  21. well written with critical analysis.
    Babu Showed the world a new direction as opposition leader.
    Hats off to all the MLAs that braved the Marata onslaught for a great cause.
    Congress and TRS have no answer to Babu,
    instead giving lame excuses.

    రిప్లయితొలగించండి
  22. intha jarigina inkaa tamalo taame tannuku chastunna jaathi lo puttinanduku vikaaram gaa undi.

    naadi telanganaa, ikkadi raajakiya sannasula valle ee dusthithi.

    naa blog le mee refernce istaaanu.. chaala baaga rastunnaru... inkaaa emainaa cheyagalaraa.. desam kosam, telugu jaathi kosam?

    http://kkalluri.blogspot.com

    రిప్లయితొలగించండి
  23. చాలా బాగా చెప్పారండి. అసలు సమస్యనొదిలేసి ఇలా ఎదుటి వాళ్ళెక్కడ లైం లైట్లోకి వస్తారో అని గగ్గోలు పెట్టే నాయకులున్నంత కాలం ప్రజల సమస్యలలాగే ఉంటాయి. ఇలా కనీసం ఎలక్షన్లప్పుడన్నా సమస్లు గుర్తొచ్చినా చాలు. అదీ లేని సందర్భాలు చాలా ఉన్నాయి. వీళ్ళనే దాని బట్టీ ఎలక్షను లొచ్చాయని అసలు ఏపని చేయకుండా కూచోవాలా?

    ఎదురుగ్గా ప్రజల మాన ప్రాణాలు మట్టిగలుస్తున్నప్పుడే నాయకుడైనా చూసి, అచ్చచ్చో ఇది ఎలక్షనుల టైము. ఇప్పుడు మనం కాపాడబోతే మళ్ళా రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేస్తున్నాడని అంటారనుకుని వదిలేసి చక్కా పోతే అప్పుడు గతి ఏమిటి? ప్రజల సమస్యలనొదిలేసి, అధిష్టానం బాకా ఊదుకునే సీఎమ్, పిల్ల కాకి లాంటి నాయకుడిని ఎలా అణగదొక్కాలా అనుకునే అధిష్టానం కన్నా ఎన్నికల కోసమే, అవును ఎన్నికల కోసమే, రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు చేశాడనుకున్నా అంతిమంగా జరిగే లాభం మన రాష్ట్ర ప్రజలకే కానీ, మహారాష్ట్ర ప్రజలకు కాదు కదా. ఈ మాత్రం కూడా ఆలోచించలేని వారు, ప్రజలని ఏమి ఉద్ధరిస్తారు?

    మెదడు మోకాల్లోనో, అరికాల్లోనో కూడా లేని వాళ్ళందరూ రాజకీయాల్లో ఉంటే రాష్ట్ర పరిస్థితి ఇలాగే ఉంటుంది. మీరు చెప్పిన బుట్టలో పీతల సామెత అక్షర సత్యం.

    పిట్ట కథలు చెప్పుకునే నాయకులుకుతున్నంత కాలం మన రాష్ట్రానిది దౌర్భాగ్యమే. నాగరాజు పప్పు గారు బజ్జులో చెప్పింది నిజమే (నేనక్కడి నుంచే వచ్చాను), మీరు ఏదన్నా ప్రింటు పత్రికకు సంపాదకులుగా కాదు, పత్రకాధినేతగా ఉంటే బాగుణ్ణనేలా రాశారు. మీ విశ్లేషణ గొప్పగా ఉంది. మీకు అభినందనలు చెప్పే వయసు లేదు నాకు. అందుకే నమస్సులు!

    రిప్లయితొలగించండి
  24. >>>"మనకనుకూలంగా ఉన్నప్పుడు నిష్పాక్షికత ఉన్నట్టూ, లేనప్పుడు పరమ పక్షపాతం వహిస్తున్నట్టూనా"

    :)

    రిప్లయితొలగించండి
  25. ఖచ్చితంగా దొంగపడ్డ ఐదునెలలకి ఈ అఙ్ఞాత కుక్క యెందుకు మొరిగినట్టో!

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు