రాష్ట్రంలో కాంగ్రెసు నాయకులు ఎప్పుడూ కూడా అధికార కుటుంబానికి పాలేళ్ళే. ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్.. ఇలా ఎప్పుడూ ఎవరో ఒక వ్యక్తికి ఊడిగం చేస్తూ ఉంటారు. కొందరు పెద్ద పాలేళ్ళు, కొందరు ఇంట్లో పనులుచేసే చిన్న పాలేళ్ళు, కొందరు రోజుకూలీలు. ఎన్ని రకాలున్నప్పటికీ అందరూ పాలేళ్ళే. దొర కనుసన్నలలో ఉండటం కోసం నానాతంటాలు పడతారు.
28, సెప్టెంబర్ 2009, సోమవారం
12, సెప్టెంబర్ 2009, శనివారం
కంప్యూటరు ఈ యుగపు ఋక్కు
సమకాలీన తెలుగు కవుల్లో గరికపాటి నరసింహారావు ప్రసిద్ధులు. దేశవిదేశాల్లో దాదాపు 250 అవధానాలు చేసిన పండితుడాయన. టీవీల్లో కావ్యపఠనం చేస్తూ పండిత పామరులను అలరిస్తూ ఉంటారు. ఛందోబద్ధ పద్యాలను వినసొంపుగా పాడి పండిత పామరులను అలరిస్తూ ఉంటారు.
3, సెప్టెంబర్ 2009, గురువారం
రాజశేఖరరెడ్డి మరణం, ఆ తరవాత
సంచలనాల జీవితం సంచలనంగానే ముగిసింది. అరవయ్యో యేట రాజకీయాలనుండి విశ్రాంతి తీసుకుందామనుకున్నా, అలా జరగలేదు. ప్రతి మనిషికీ తన జీవితంలో చేసిన పనులను, తను సాధించినవిజయాలను నెమరు వేసుకుని, తన తప్పొప్పులను సమీక్షించుకునే అవకాశం బహుశా వానప్రస్థంలో కలుగుతుంది. కానీ వై.ఎస్‌కు ఆ అవకాశం లేకపోయింది. ముఖ్యమంత్రిగా తీరుబడిలేని జీవితం గడుపుతూండగానే అర్థంతరంగా జీవిత ప్రయాణం ముగిసింది. ఈ దుర్ఘటనలో మరణించిన ఐదుగురి కుటుంబసభ్యులకూ నా సానుభూతి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
సంబంధిత టపాలు
loading..