29, జనవరి 2009, గురువారం

అది "శ్రీరామ సేన" కాకుండా మరోటేదైనా అయ్యుంటే..

మంగళూరు పబ్బు దాడి చేసినది "శ్రీరామ సేన" కాకుండా మరోటేదైనా అయ్యుంటే.. ఏ పీపుల్ ఫర్ రేషనల్, ఎథికల్, మెథొడికల్ లివింగో, డెమోక్రటిక్ సెక్యులర్ లిబర్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియానో, జెనెక్స్ ఇండియానో, ఇలాంటి ఇంగ్లీషు పేర్లు - హిందూ వాసన లేని పేర్లు - పెట్టుకున్న మరో సంస్థ ఏదైనానో చేసుంటే మన మహిళల పబ్బు హక్కుల కార్యకర్తలు ఒక్ఖరైనా నోరు మెదిపేవారా? పేపర్లలో అసలు వార్తలొచ్చేవా? దాడిని ఖండిస్తూ ప్రకటనలుండేవా? బ్లాగుల్లో వ్యాఖ్యలుండేవా? అసలు టపాలుండేవా? -ఇవేవీ ఉండేవి కావు. 


ఇంకా రంగంలోకి దిగలేదుగానీ, కొందరుంటారు -హిందువుగానో, మరోలాగానో పుట్టినందుకు తలదించుకునేవాళ్ళు, లేదా సిగ్గుతో సగమో పూర్తిగానో చచ్చిపోయేవాళ్ళు. (భలే ఉంటార్లే వీళ్ళు.. ఎప్పుడు సిగ్గుతో తలొంచుకుందామా, సిగ్గుతో చద్దామా అని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారనుకుంటా!)

ఈ నిరసనలు, విమర్శలూ... ఇదంతా హిందువులపై కొందరు తమ మనసుల్లో పెంచి పోషిస్తున్న ద్వేషాన్ని, తమ కోరల్లోని (కరాళ దంష్ట్రలవి) విషాన్ని సమాజంలోకి ఒలకబోసే ప్రయత్నంలో భాగమే! ఇప్పుడు దాడి చేసినది శ్రీరామసేన అనే పేరుతో ఉన్న సంస్థ కదా, ఇక వెనకా ముందూ చూసుకోనక్కర్లా.. విమర్శలు చేసి పారెయ్యొచ్చు. అంచేతే విరుచుకుపడిపోతున్నారు.
--------------------------------------------------------------------------
దాడి చేసి కొట్టడం తప్పే కావచ్చు..  మరి, పబ్బుల్లో మగాళ్ళతో కలిసి తాగి తందనాలాట్టం, ఎకిలేషాలెయ్యడం తప్పు కాదా? సభ్యత మరచి ఇలా తాగి, తుళ్ళుతూ, తిరుగుతూ ఉంటే అది సామాజికంగా అభ్యంతరకరం. అంచేత ఆ ఆడవాళ్ళు పబ్బులకెళ్ళడం తప్పు దాన్ని ఖండించాలి, ముందు.

44 కామెంట్‌లు:

  1. ఎప్పుడు సిగ్గుతో తలొంచుకుందామా, సిగ్గుతో చద్దామా అని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారనుకుంటా!:))))!

    రిప్లయితొలగించండి
  2. సంస్థ పేరు ఏదున్నా జరిగిన ఘటనని మానవత్వం ఉన్న ప్రతిఒక్కరూ ఖచ్చితంగా ఖండించి ఉండేవారు. ఇందులో నాకు ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ సమస్య మహిళలు పబ్బుకెళ్ళొచ్చా? తాగొచ్చా? కాదు. ఒకవేళ వెళ్ళినా త్రాగినా,గుంపుగా దాడిచేసి వాళ్ళని కొట్టచ్చా? అనేది.

    మీఉద్దేశంలో మహిళలు పబ్బుకెళ్ళడం భారతీయ సంస్కృతి ప్రకారం తప్పయితే దాన్ని చట్టపరంగా శిక్షార్హం చేసే ఉద్యమాన్ని చేపట్టండి. lawful గా ఒక సార్వజనిక ప్రదేశంలో personal time ని గడుపుతున్న కొందరు private వ్యక్తుల్ని చట్టవ్యతిరేకంగా చెయ్యిచేసుకోవడం అనాగరికం,అమానుషం,చట్టవ్యతిరేకం. ఇక మీరు చెప్పుకొస్తున్న భారతీయ సంస్కృతికి పూర్తి విరుద్ధం. అన్యాయంగా నైనా (మీరు లేదా మరొకరు నమ్మిన)న్యాయాన్ని అమలు చేస్తాననడం మూర్ఖత్వం.

    http://parnashaala.blogspot.com/2009/01/blog-post_26.html

    రిప్లయితొలగించండి
  3. భలే ఉంటార్లే వీళ్ళు.. ఎప్పుడు సిగ్గుతో తలొంచుకుందామా, సిగ్గుతో చద్దామా అని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారనుకుంటా!

    హ హ భలే చెప్పారు. "హిందు" అన్న మాట కనిపిస్తే గంగ వెర్రులెత్తిపోతారు కొందరు "హిందువులు(???)"

    రిప్లయితొలగించండి
  4. "ఎప్పుడు సిగ్గుతో తలొంచుకుందామా, సిగ్గుతో చద్దామా అని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారనుకుంటా!"

    బాగా చెప్పారు! నాకైతే అలాంటి వాళ్ళని చూస్తే వాడు నాతోటి పౌరుడు అని చెప్పుకోడానికి సిగ్గుతో చచ్చిపోవాల్సివస్తుంది...

    ఆ మంగులూరు టివి వాళ్ళని, ఎన్ డి టి వి లాంటి ఇంగ్లీషు చానెళ్ళ వాళ్ళు అడిగి తీసుకున్నారంట, అదీ రిపబ్లిక్ రోజున రచ్చ చేసి జనాల మూడ్ని పోగొట్టడం తప్పితే వాళ్ళు సాధించింది ఏమీ లేదు... ఆ వార్త ఆరోజు వెయ్యకపోయినా నష్టం లేదు, తరవాత వేసుకోవచ్చు కదా!

    అది ఇస్లాం మతానికి సంభందించిన సంస్థ అయినా సరే ఇంత హడావుడి జరిగి ఉండదండీ బాబు! అప్పుడు మనకి కనపడిన రాతలు లాంటివి కనపడవు... ఇలాంటి "రామ సేవకులందరికీ, మత రక్షకులందరికీ, సాంస్కృతిక పరిరక్షకులందరికీ జేజేలు." డైలాగులు అసలు పడేవే కాదు!

    రిప్లయితొలగించండి
  5. మీ ఉద్దేశం ఆడాళ్ళు పబ్బులకెళ్ళడం తప్పనా,లేక మగాళ్ళతో కలిసి వెళ్ళడం తప్పనా??
    ఫోనీ "ఆడవాళ్ళకు మాత్రమే " అని ప్రత్యేకంగా పబ్బులు ఏర్పాటు చేస్తే మీకు ఓకే నా??
    ఇది వ్యంగంగా రాసింది కాదండి. నాకు నిజంగా మీ stance అర్ధం కాలేదు.

    రిప్లయితొలగించండి
  6. కేవలం మతాన్ని విమర్శించాలన్నది నా ఇన్టెన్షన్ కాదు. పబ్ పై స్త్రీవాదులు దాడి చేస్తే బాగుండేది కానీ స్త్రీవాదాన్ని వ్యతిరేకించే ఆర్.ఎస్.ఎస్. లాంటి సంస్థల వాళ్ళకి దాడులు చేసే అర్హత లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశం.

    రిప్లయితొలగించండి
  7. చదువరి గారు, ఆడవాళ్ళు పబ్ కి వెళ్ళటం తప్పు అని నేను అనుకోవట్లేదు..but there are very strict guidelines about the behavior in pubs..It is not a 'private' place where people can do whatever they want to. కాని, అది వీళ్ళెవరూ పాటించట్లేదు, మానిటర్ చెయ్యల్సిన యంత్రాంగానికి అంత తీరిక దొరకట్లేదు.. లంచాలు బొక్కటానికే వాళ్ళకు 24 గంటలు చాలట్లేదు.

    ఇలా 'హిందూ ' అని కనపడగానే చిందులేసే వాళ్ళు, పబ్స్ లో వాళ్ళెంత lawful(laughful) గా ప్రవర్తిస్తున్నారో కూడా తెలుసుకోవాలి. అలా సలహ ఇచ్చేవాళ్ళు guidelines ని ఫాలో అవ్వాలని వారు కూడా ఉద్యమించాలని నా సూచన.

    రిప్లయితొలగించండి
  8. "మహిళా పబ్బు హక్కులు" అని మొదటిసారి వినగానే నాలో నేను పగలబడి నవ్వుకున్నాను. దీనికీ, మద్యపాన హక్కులు, ధూమపాన హక్కులు, గట్రా రకరకాల హక్కులకీ తేడా నాకైతే పెద్దగా కనబడలేదు. పైకి నవ్వితే మాకు పబ్బులకి వెళ్లే హక్కు ఉంది, అది తప్పు కాదు, కానీ నీకు నవ్వే హక్కు లేదు అంటూ ఎవరు (ముఖ్యంగా తాగి తందనాలాడినప్పుడు, వెఱ్ఱి వేషాలేసినప్పుడు గుర్తురాకుండా అలా పెంటపనులు చేస్తావేమని తనని హిందూ సైనికుడిగా చెప్పుకునేవాడు ఒక్కటి పీకినప్పుడే హిందూత్వం గుర్తొచ్చే నామమాత్రపు హిందువులు) ఎక్కడ నామీద విరుచుకుపడతారో అని ఊరుకున్నాను!

    నిజమే, ఈ పని చేసింది శ్రీరామసేన కాకుండా ఉంటే (ఉదాహరణకి ఏ ఫత్వానో జారీ ఐతే) కచ్చితంగా ఇప్పుడు ఇచ్చినంత ప్రాముఖ్యత మన "లౌకిక మీడియా" ఇచ్చేది కాదేమో! నా భారతదేశం వెలిగిపోతోంది!

    రిప్లయితొలగించండి
  9. పైగా ఆ శ్రీరామసేన వాళ్లు ఆడవాళ్ల జోలికి పోకుండా మగవాళ్లని మాత్రమే తన్ని ఊరుకున్నా ఇంత గొడవ అయ్యేదే కాదు.

    రిప్లయితొలగించండి
  10. బప్ఫా.
    (మనం చెప్పబోతున్న దాన్ని వేరే వాళ్ళు చెప్తే బప్ఫా అనాలని మా పిల్లలు చెప్పిన ఇస్కూలు జార్గన్.)
    @raghava "నిజమే, ఈ పని చేసింది శ్రీరామసేన కాకుండా ఉంటే (ఉదాహరణకి ఏ ఫత్వానో జారీ ఐతే) కచ్చితంగా ఇప్పుడు ఇచ్చినంత ప్రాముఖ్యత మన "లౌకిక మీడియా" ఇచ్చేది కాదేమో! నా భారతదేశం వెలిగిపోతోంది!"
    కాదు మండిపోతోంది.

    రిప్లయితొలగించండి
  11. @సత్య: పబ్బుల్లో ప్రవర్తించే నియమావళి ఎక్కడుందో కాస్త చెబుతారా?

    రిప్లయితొలగించండి
  12. పబ్బులు ఆమోదయోగ్యం అయితే వ్యభిచారం కూడా ఆమోదయోగ్యమే. వాస్తవం చెప్పాలంటే పబ్బుల్లో జరుగుతున్నది వ్యభిరించడానికి పూర్వరంగం. అయితే అది పబ్బు బయట జరుగుతుంది కనుక అందుకోసం పబ్బు చేస్తున్న దోహదం మన దృష్టికి రాదు. అక్కడ కావలసినవాళ్ళు కావాల్సినవాళ్ళని సెటప్ చేసుకొని వెళతారు.

    ఒకడు చేస్తే అది వాడి వ్యక్తిగత తిక్క. అదే పదిమందో, వందమందో, వెయ్యిమందో చేస్తే, దానికి కొంత వ్యవస్థా, మద్దతుదారుల సమర్థనా తయారయితే అది ఒక సాంఘిక దురాచారం. ఆ రకంగా ఈ పబ్బులు అనేవి ఒక సాంఘిక దురాచారం. ఒకప్పుడు ఆడవాళ్ళు ఇష్టపూర్వకంగా ఒప్పుకొని దిగినవన్నీ కాలక్రమంలో వాళ్ళని అణగదొక్కిపారేసే సాధనాలుగా మారాయి. (జోగినీ, దేవదాసీ వ్యవస్థల్లాంటివి) పబ్బులు మరో రకంగా పరిణమిస్తాయని నేననుకోను.

    ఇవే పబ్బుల్లో రేపు ఆడవాళ్ళ మీద వాళ్ళ బాయ్ ఫ్రెండ్లు యాసిడ్డో అలాంటి ఇంకో దుర్మార్గ సాధనాన్నో తీసుకొని దాడి చేస్తే అప్పుడు అందుకుంటారు పల్లవి "పబ్బుల్ని నిషేధించా"లంటూ !

    రిప్లయితొలగించండి
  13. ఈ విషయములో కొందరు మేధావులు వ్యక్తిగత స్వేఛ్చ అని వాపోవటము వింతగావున్నది.ఒకడు వ్యక్తిగత స్వేఛ్చాని తనకొంపకు తాను నిప్పెట్టుకుంటే ఊరుకుంటామా? అది గాలివాటున మనకొంపలకు కూడా తాకుతుంది కదా?.ఇంతకీ తాగటము తప్పనిగానీ,అదీ భారత రిపబ్లిక్్ ఉత్సవాలరోజున,మరీ నీఛముగా స్త్రీలను దిగజార్చే ఈ సంస్కృతి తప్పని గాని అనిపించని మేధావులకు ఏమి చెప్పినా, నైతికతవిలువలేంటో తెలియనివారికి వాటిగురించి బోధించినా ప్రయోజనము లేదు.నిన్నొకాయన అంటున్నాడు హిందువుగా తలదించుకుంటున్నానని,అటువంటివారిని హిందువు అని పిలిస్తే ఈధర్మాన్ని అవమాన పరిచినట్లే.నేనేదో ఆడవాల్లని కొట్టమని చెప్పటము లేదు.వీళ్ళభావాల వాస్తవరూపం గురించి ప్రశ్నిస్తున్నాను. మరొక విషయమేమిటంటే మొన్న హైదరాబాద్ లో ఒక పత్రిక ఎడిటర్ మీద దాడి జరిగినప్పుడు,గాని తస్లీమా నస్రీన్ మీద దాడి జరిగినప్పుడు కానీ వీళ్లకు హక్కులు గుర్తుకు రాలేదు ఎందుకని? పాపం సదరు మేధావుల గొంతులు అప్పుడు ఈచోట వినిపించలేదు ఎందుకని? ఇటువంటి స్వేచ్చ పిచ్చోడిచేతిలో రాయి వంటిదే.అలాగని దాడి చేసినవారేమీ ఖచ్చితమయిన మార్గాన్నే అనుసరిస్తున్నారనటము లేదు. మేమూ పౌరుషవంతులమే అనే నమ్మకమెక్కడో వుండి అప్పుడప్పుడు బయటపడుతున్న బాపతు. మనకు స్వేచ్చ చలా ఎక్కువైనట్లున్నది.ఇంతస్వేచ్చను ఈ దేశము భరించలేదు కనుక తగ్గితేనే మంచిదనేరోజులు రానున్నాయి. ఈరోజు ఆంధ్రజ్యోతిలో కథనాన్ని చూడండి.ఎలా విస్తరిస్తున్నదో మాయాజాలం.అందులో భాగమే ననుకుంటా,ఈ మేధావి వర్గము కూడా.

    రిప్లయితొలగించండి
  14. మీరు హిందు తాలిబన్ సభ్యులై ఉంటారు. కనుకనే స్త్రీల పట్ల చులకన భావం. మగాడు తాగి పబ్ లొ గెంతగా లేని సభ్యత స్త్రీ విషయంలొ కనిపించిందా. లేదా పబ్ లు మగవారికి మాత్రమేనా. పబ్ లొ జరిగే అభ్యంతరకర చిందులు, వెకిలి ప్రవర్తనా అడ్డుకొవటానికి "శ్రీరామసేన" లొ స్త్రీ సభ్యులు లేర. లేక "శ్రీరామసేన" స్త్రీ సభ్యులను తీసుకొదా.

    రిప్లయితొలగించండి
  15. .... దాడి చేసినది శ్రీరామ సేన కాకుండా మరోటి ఏదైనా అయ్యుంటే .........

    అసలు అంశాన్ని పక్కదోవ పట్టించే ఈ ధోరణి ఇటీవల ఎక్కువైపోతోంది .

    అప్పట్లో అజహరుద్దీన్ కూడా తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇట్లాగే మైనారిటీ కార్డు ప్రయోగించాడు .

    ఒక లంచగొండి ఎస్ సి అధికారి మీద చర్య తీసుకుంటే అతనూ తాను ఎస్ సి అయినందునే కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారు అంటూ గగ్గోలు పెడతాడు .

    తమ వోట్లు ఎక్కడ దెబ్బ తింటాయో అని పాలక పార్టీలు బెంబేలు పడిపోతాయి. న్యాయం సమాధి అవుతుంది.

    మీరు కూడా ఆడవాళ్ళ మీద మగ వాళ్లు చేయి చేసుకోవడం అనే దుర్మార్గాన్ని వదిలేసి ఈ రామ బాణాన్ని ప్రయోగించడం బాధాకరంగా అనిపించింది.

    రిప్లయితొలగించండి
  16. 1. ఏ పేరు పెట్టుకొని చేసినా ఇటివంటి చర్యలు నీచమైనవీ, హేయమైనవీ - కాబట్టి, ఎలా ఖండించినా అది సరైనదే.
    2. మీరు ఏవేవో రకరకాల పేర్లు సూచించి, ఆ పేర్లుంటే, లౌకికవాదుల స్పందనలు ఎలా ఉండేవో ఊహాగానాలు చేసారు. మరి ఒకవేళ ఈ సేన పేరు "రావణ సేన" అనో 'ధుర్యోధన సేన" అయ్యుంటే, తలెత్తుకొని సగర్వంగా హిందువులం అనుకొనేవాళ్ళు ఏం చేసుండేవారో కూడా చెప్పండి! వీళ్ళని సంహరించడానికి రాముడో, కృష్ణుడో కావాలని సందడి చేసుండేవారా?

    రిప్లయితొలగించండి
  17. @కత్తి
    మీ ద్రుష్టి లో మానవత్వం అంటె ఎమిటి? భారతీయ సంస్కృతి అంటె ఏమిటి? ఇది ఎక్కడైనా రాసి వుందా? తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
  18. @ మహేష్,
    ముందుగా మీరనుకునేట్లు పబ్బులలో విచ్చలవిడిగా ప్రవర్తించొచ్చు అని ఎక్కడ తెలుసుకున్నారో చెప్తారా? బహిరంగ ప్రదేశాలలో అశ్లీల ప్రవర్తన, డ్రెస్ కోడ్ పై ఉన్న నిబంధనలు పబ్స్ కి కూడా వర్తిస్తాయని మీకు తెలీదనుకోను.

    చదువరి గారు,.. నా ముందు కామెంటులో స్త్రీలు పబ్బులకి వెళ్ళటం తప్పు కాదన్నది కేవలం అది చట్ట ప్రకారం ఆమోదయోగ్యమైంది కావటం చేత.

    @సుధీర్, FYI, వాళ్ళు అందరిపైనా దాడి చేశారు. కాబట్టి "సభ్యత స్త్రీల విషయం లోనే నా" అనే మీ వాదన కరక్టు కాదు.

    రిప్లయితొలగించండి
  19. కొంతమంది ( 24 X 7 గంటల వాళు) మానవత్వ మా కాదా అని అరుచుకుంటూ, చర్చించుకుంటూ మహాను భావులు అవుదామను కొంటారు. వారి భావాలు ఇంట్లొ పెళ్ళాము కూడా నచ్చదు.కావలంటె వారి బ్లొగ్ లోనె మీకు దొరుకుంది సమాధానం. అందువలన వినేవారు లేరని బ్లొగ్ పెట్టుకొని మరీ రాస్తుంటారు చెత్తని. మొదట వాళ్ళ కి తెలిసిన భారతీయ సంస్కృతి ఎమిటో చెప్తే తరువత అది మీరు (చదువరి గారు) చెప్పిన భారతీయ సంస్కృతి కి విరుద్ధం మా కాదా అని చర్చించవచ్చు. ఇటువంటి వారిని ఎమైనా అంటె వాళని వాళ్ళు అభ్యుదయ వాదులా అనుకొని ఫిలౌతారు. చదువరి గారు మీరు ఇలా ఒక బ్లొగ్ కి ప్రతిస్పందనగా రాయడం వారికి ఇండై రెక్ట్ గా సహాయము చెసినట్లూ గా వుంటుంది.

    రిప్లయితొలగించండి
  20. There were several attacks on women in our State on that particular day. But no national news agency has taken note of it. Their lenses are on the states ruled by non-congress governments and they wish the govts to resign even if a road accident takes place.
    who is there to save the nation from thes pseudo secularists?

    రిప్లయితొలగించండి
  21. "దాడి చేసి కొట్టడం తప్పే కావచ్చు.. మరి, పబ్బుల్లో మగాళ్ళతో కలిసి తాగి తందనాలాట్టం, ఎకిలేషాలెయ్యడం తప్పు కాదా? "- ఈ వ్యాసంలో స్త్రీలపై అమానుష ప్రవర్తన ఖండించటం జరగలేదు. ఆడవారు పబ్ కు వెళ్లటము చట్టసమ్మతము. రామసేన లు మహిళలతో వ్యవహరించిన విధానము ఏ విధముగా సమర్ధిస్తాము?

    రిప్లయితొలగించండి
  22. @సత్య: పబ్బుల్లో ప్రవర్తించే నియమావళి చట్టంలో ప్రస్తుతానికి లేదు. ఉన్నదల్లా public places లో చెయ్యకూడని indecent exposure గురించి మాత్రమే.

    ఒకవేళ పబ్బులో జరిగిన విషయంలో ఎవరికైనా అభ్యంతరం ఉంటే అది పబ్లో ఉన్నవాళ్ళకుండాలి. అంతేగానీ పబ్బుల్లో ఏంజరుగుతుందో కేవలం ఊహల్లో మాత్రమే తెలిసినవాళ్ళకు కాదు. మీరెప్పుడైనా పబ్బుకెళ్ళి అక్కడి చర్యలు అభ్యంతరకరమైతే పోలీసులకి కంప్లెయింట్ ఇవ్వండి. మీ కంప్లెయింట్ ఆధారంగా పబ్ లైసెన్స్ క్యాన్సిల్ చెయ్యబడుతుంది. అంతేతప్ప ఏదో జరుగుతోందనేఆపోహ లేక అనుమానంతో నిర్ణయాలు తీసుకోవడం, జడ్జిమెంటు పాస్ చెయ్యడం అనవసరం.

    ఇక దాడి చెయ్యడం అనేది ఇంకా పెద్ద cognizable offense. "Public nuisance. - A person is guilty of a public nuisance, who does any act, or is guilty of an illegal omission, which causes any common injury, danger, or annoyance to the public or to the people in general who dwell or occupy property in the vicinity or which must necessarily cause injury, obstruction, danger, or annoyance to persons who may have occasion to use any public right."

    రిప్లయితొలగించండి
  23. Quoting a huge corpus of legalisms won't solve any problem. In this country they are not cared a hoot by anybody outside the majestic portals of courts, much less the people who are being adored for being able to live beyond middle class morality.

    రిప్లయితొలగించండి
  24. >> కరాళ దంష్ట్రాలవి

    ఒక్క మాటతో టపా మొత్తానికీ కాష్మోరా ఎఫెక్ట్ తీసుకొచ్చారు :-)

    రిప్లయితొలగించండి
  25. వ్యాఖ్యాతలందరికీ నెనరులు.

    నిజానికి ఈ సంఘటన చాలా చిన్నది. రేపులు హత్యలు, యాసిడ్ల ఘటనల కంటే పెద్దదేం కాదు. నేనసలిక్కడ రాయకనే పోదును.. దీనిపై వచ్చిన కొన్ని స్పందనల్లోని అతి చూసాక, అనుచితమైన స్పందన చూసాక రాసానేగాని, మరోటి కాదు.

    మహేష్: "కొందరు private వ్యక్తుల్ని చట్టవ్యతిరేకంగా చెయ్యిచేసుకోవడం అనాగరికం,అమానుషం,చట్టవ్యతిరేకం." -నిజం! కానీ ఓ ఘటనను ఘటనగా చూడాలి గానీ, దాని స్థాయిని పెంచి, పెద్దది చేసి, గంగవెర్రులెత్తిపోవడం అంతకంటే అమానుషం. జీడిపప్పు గారి వ్యాఖ్య చూడండి. :)

    జీడిపప్పు: బాగా చెప్పారు! అంతేకాదండి, నాబోటిగాడెవరైనా విమర్శిస్తే కూడా గంగవెర్రులెత్తిపోతారు!! :)

    సందీప్: ఆడవాళ్ళు పబ్బులకెళ్ళడం తప్పని నా ఉద్దేశం.

    Marthanda: స్త్రీలకు పబ్బులకెళ్ళి తాగే హక్కులున్నాయా? - ఇది చెప్పండి ముందు.

    సుధీర్: ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి. కొత్త సంవత్సరం (2009 కాదు, రెండేళ్ళ కిందట) సందర్భంగా ముంబైలో నడివీధిలో, అర్థరాత్రి, వేలాది మంది మధ్య, ఆడవాళ్ళ గుడ్డలు లాగేసిన బీభత్సం గురించి మీరు వినే ఉంటారు. ఇలాంటి సంఘటనలు నాకు తెలిసి రెండేళ్ళు జరిగాయి. తాగి తందనాలాడే గుంపు లోకి, ఆడవాళ్ళు, తాము కూడా తాగి వస్తే అలాంటి సంఘటనలు జరక్కుండా ఉంటాయా? సంస్కారం అనేది అందరికీ ఒకటే -కాదన్ను. కానీ, కుసంస్కారం కారణంగా, అసభ్యత కారణంగా చివరికి నష్టం కలిగిందెవరికి? క్రికెట్ ఆటలకోసమని ఆడే వాళ్ళను తెచ్చి ప్రేక్షకులకు విందు చెయ్యబోయారు. ప్రేక్షకులు మాతో అసభ్యంగా ప్రవర్తించారని వాళ్ళు గోలెట్టారట. ప్రేక్షకులు వాళ్ళమీద చేతులెయ్యడం తప్పే.. కానీ వాళ్ళు రెండు పీలికలడ్డం పెట్టుకుని గంతులేస్తే గదా అది జరిగింది! ఈ ముక్క చెప్పినదానికి నేను తాలిబన్‌నా? వాళ్ళు స్త్రీలు కాబట్టి వాళ్ళను స్త్రీల చేత కొట్టించాలి, అన్నారు, అలా చేస్తే తప్పు కాదా?

    ప్రభాకర్ మందార: ఆడవాళ్ల మీద మగవాళ్ళు చెయ్యిచేసుకోవడమే కాదండి.. ఓ మనిషి మీద మరో మనిషి దౌర్జన్యం చెయ్యడమిది. ఖండించాల్సిందే! కానీ ఖండించేదానికి హిందూ సంస్థలనగానే అంత చురుకెందుకు? అనేది నా ప్రశ్న. అంశాన్ని పక్కదోవ పట్టించడం లేదండి.

    సిముర్గ్: 1. సూరి బావ కళ్ళలో వెలుగు చూసేందుకు పరిటాల రవిని చంపాను అని మొద్దు శీను అన్నప్పుడు సూరి బావను, మొద్దు శీనును విమర్శిస్తే ఓకే! మొత్తం ప్రపంచంలోని బావలందరినీ, శీను అనే పేరుగల వాళ్ళందరినీ విమర్శించకూడదు.
    2. ఆయా సేనలు ఇప్పుడూ ఉన్నాయి. కాకపోతే వాటికి వేరే పేర్లున్నాయి. హిందువునేనని - సగర్వంగా అక్కర్లేదు - సిగ్గుపడకుండా అనుకుని తలెత్తుకుని చూస్తే చాలు, కనిపిస్తాయి.

    cbrao: ఏ విధముగానూ సమర్ధించము

    రిప్లయితొలగించండి
  26. ంఅర్థంద: "స్త్రీలకు పబ్బులకెళ్ళి తాగే హక్కులున్నాయా?" ప్రశ్న సరిగా వెయ్యలేదు.. సరైన ప్రశ్న ఇది - "స్త్రీలు పబ్బులకెళ్ళి తాగడాన్ని మీరు సమర్ధిస్తారా?" -

    రిప్లయితొలగించండి
  27. స్త్రీలకి పబ్ లకి వెళ్ళే హక్కు ఉందని నేను అనడం లేదు. పబ్ ల వల్ల స్త్రీ-పురుషుల సమానత్వం రాదు.పబ్ లలో పరాయి ఆడవాళ్ళతో డాన్స్ చేసే మగవాడు కూడా పతివ్రతనే పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. పెళ్ళికి ముందు పరాయి మగ వాళ్ళతో తిరిగిన స్త్రీని కోరి పెళ్ళి చేసుకునే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. వాళ్ళు ఆడవాళ్ళకి ఒక నీతి, మగవాళ్ళకి ఇంకొక నీతి ఉండాలనుకుంటారు. నీతి విషయంలో స్త్రీ-పురుషుల సమానత్వం రాకపోతే ఈ తిరుగుళ్ళకి స్త్రీ స్వేఛ్ఛ అనే టాగ్ తగిలించడం అనవసరం.

    రిప్లయితొలగించండి
  28. పబ్బులో ఉన్న వాళ్ళందరినీ (ఆడా మగా చూడకుండా) నాలుగు తన్ని తగలేసి ఉంటే మహిళా సంఘాలు అంత బాధపడేవి కావేమో! (నాలాంటి వాళ్లు వ్యక్తిగత స్వేఛ్ఛ అని సనుగుతారనుకోండి) మగాళ్లకు పబ్బుకెళ్లే హక్కు ఉన్నప్పుడు ఆడళ్లకు ఎందుకుండకూడదు? ఈ సదరు శ్రీరామసేన హిందువులందరి మీద బురదజల్లడం తప్ప సాధించిందేఁవీ లేదు. అక్కడికి పబ్బులో పురుషపుంగవులు ఎకిలేషాలెయ్యనట్టు సమర్ధించుకు రావటం బాఁవోలేదు.

    రిప్లయితొలగించండి
  29. "...ఒకవేళ పబ్బులో జరిగిన విషయంలో ఎవరికైనా అభ్యంతరం ఉంటే అది పబ్లో ఉన్నవాళ్ళకుండాలి. "

    ఓహొ! అలా అయితే, పబ్బులో ఎవరో ఎవర్నో కొడితే మనకొచ్చిన అభ్యంతరం ఏమిటి? మనమెందుకు స్పందించటం? బ్లాగులు వ్రాయటం? కొట్టిన వాళ్ళు, కొట్టిచ్చుకున్న వాళ్ళు, వాళ్ళ వాళ్ళ అభ్యంతరాలని పోలీసులకో, కోర్టులోనో చెప్పుకుంటారు. మన స్పందన తీరు ఇది, దాడి చేసిన వారి తీరు అది.. దాని పర్యవసానాలకి వాళ్ళు బాధ్యత వహిస్తారు. వాళ్ళు పబ్ సంస్కృతి ని వ్యతిరేకిస్తూనే దాడి కి క్షమాపణ చెప్పారు. ఇది సంతోషించదగ్గ విషయమేగా. రామసేన కొంతైనా విలువలు చూపించింది. చట్టాన్ని కాపాడాల్సిన MLAలు పాత్రికేయ సమావేశం లో ఉన్న మహిళపై మీరనే పైచాచికం గా దాడి చేసిన ఘటన లో ఏమైన పశ్త్చాతాపం చూపారా?
    ఇంక మీరు అనుకునేట్లు ప్రైవేటు ప్రదేశం లో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించచ్చు అనేది చట్ట ప్రకారం తప్పు. సొంత భవనం లో అశ్లీల నృత్యాలు తిలకిస్తూ పట్టుబడ్డ రోశయ్య గారి అల్లుడి వ్యవహారం గుర్తులేదా?

    అయినా, పబ్బులో అంతా మంచిగా జరుగుతుంది అనుకునే ఊహల్లో మీరు ఉన్నట్లున్నారు..

    రిప్లయితొలగించండి
  30. కొందరు నాస్తిక బ్లాగర్లని విమర్శించడానికే ఈ టపా వ్రాయడం జరిగిందని నాకు అనుమానంగా ఉంది. మాది సంప్రదాయ కుటుంబం అని చెప్పుకుంటూ సీక్రెట్ గా బార్లు, బ్రోతల్ హౌస్ లు, పబ్ లకి వెళ్ళే సో కాల్డ్ మత భక్తుల సంగతి ఏమిటి? వీళ్ళ కంటే నాస్తికులకే ఎక్కువ నిజాయితీ ఉంటుంది. మాకు తెలిసిన ఒక కుర్రాడు నాస్తికులకి నీతినియమాలు ఉండవు అంటూ నన్ను వెక్కిరించే వాడు. అతను నా ఆఫీస్ లో ఒక సారి సీక్రెట్ గా సెక్స్ వెబ్ సైట్లు చూస్తుండగా గమనించి నేను అతన్ని బయటకి గెంటేశాను. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి బోగం పనులు.

    రిప్లయితొలగించండి
  31. @ మార్తండ గారు,
    సంప్రదాయ కుటుంబం వాళ్లు సెక్స్ వెబ్ సైట్లు చూడ కుదదా? మీరు నాస్తికుడైన డా|| సమరాన్ని అడిగి తెలుసుకొండి.
    సెక్స్ is a bological need and it is personal. నీతినియమాల కి సెక్స్ కి లింకు ఎమిటి?

    రిప్లయితొలగించండి
  32. సమరం గారి పేరు చెప్పి నాస్తికులందరినీ విమర్శించడం మీ ఇంటెన్షన్ లాగ ఉంది. సీక్రెట్ గా సమరం గారి సెక్స్ సలహాలు చదివే వాళ్ళలో కూడా చాలా మంది మత భక్తులు ఉన్నారు. నిజాయితీ లేని వాళ్ళకి నీతిలేని పనులు చెయ్యడంలో ఏ మత నియమాలు అడ్డురావు. మత భక్తి ఎక్కువగా ఉన్న మన దేశంలో నేరాలు కూడా ఎక్కువగా జరుగుతుండడానికి కారణం ఇదే.

    రిప్లయితొలగించండి
  33. పిచ్చి నాకొడుకులకి పని పాట లేదనుకుంటా. లేకపోతె... ఆ సమయాని వేరే ఇంకేదైనా అందరకి పనికి వచ్చే మంచి పని చేయ వచ్చు కదా. పబ్లిసిటీ కోసమే ఈ తతంగమంతా.

    రిప్లయితొలగించండి
  34. @ మార్తండ గారు,
    నేను నాస్తికుడైన డా|| సమరాన్ని అడిగి తెలుసు కొమ్మన్నది మీరు నాస్తిక బ్లొగెర్స్ ని విమర్శించటానికి ఈ టపా రాశారు అన్నారు కాబటి అదేకాక సెక్స్ మనిషి ప్రాధమిక అవసరం దానిని ఎవ్వరు నిబందనల తో అదుపు చేయలేరు. అదే కాక ఈ రోజులలో చదువు కున్న వాళ్లు యుక్త వయస్సులో చదువు లో పడి సహజమైన కొరికలను చాలా రోజులు వాయదాలు వేస్తున్నారు. మీరు చెప్పిన మార్గాల ద్వారా ఎదో స్వయంత్రుప్తిని పొందుతున్నారు దానిని కూడా మీరు సహించలేరా? మీ దృష్టి లో నిజాయితీ గా వున్న వాళ్ల పేర్లు రాయండి? నాకు మీ ద్రుష్టి లో నుంచి నిజాయితీ అంటే ఎమిటో తెలుసు కొనే అవకాసం కలుగుతుంది.

    రిప్లయితొలగించండి
  35. అసలు పెళ్ళే చేసుకోకుండా బ్రహ్మచారులుగా ఉండిపోయేవాళ్ళ గురించి మీరెప్పుడైనా విన్నారా? మనిషికి సెక్స్ ఒక్కటే ప్రధానం కాదు. అది లేకపోయినా మనిషి బతకగలడు.

    రిప్లయితొలగించండి
  36. "మనిషికి సెక్స్ ఒక్కటే ప్రధానం కాదు. అది లేకపోయినా మనిషి బతకగలడు."
    నేపాలో ఒకడు ముక్కు మూసుకొని తింది లేక కూచున్నాడు అందరు వాడిని అనుకరిదామా మరి ? http://en.wikipedia.org/wiki/Ram_Bomjon సమ సామజ స్తాపనకొరకు. మీరు రాసెది భారత జనానికి కాదు గదా ప్రపంచంలో ఎవ్వరికి అవసరం లేదు.రషాలో నే ఎన్నొ రొజుల లెనిన్ విగ్రహాన్ని తీసి అవతల పారేశారు. మీరు మిగిలిన పుస్తకాలు పాట్టు కొని వచ్చి అనాలిసిస్ చేస్తు బ్లొగ్స్ రాస్తునారు. కమ్యునిస్మ్ అనేది ముసేసిన కంపేని లాంటిది మీరు cost effective అని దాని బ్లొగ్ బ్రాంచ్ పబ్లిక్ రిలేషన్ శాఖ మొదలు పేట్టరు. అదీ మీవర్గ శత్రువు అమెరికా వాళ్లు అభి వృద్దిచేసిన ఇంటెర్నెట్ మీదా. There are lot of concepts in the world try to look things as it is without any concepts so that you will know what is really good and bad.

    రిప్లయితొలగించండి
  37. ఇంటర్నెట్ ని ఇంగ్లాండ్ వాళ్ళు అభివృద్ధి చేసారు, అమెరికా కాదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి పెద్దగా తెలియకపోయినా గ్లోబలైజేషన్ పేరుతో అమెరికా మీద ఎక్కువ ఆధారపడ్డారు. సామ్రాజ్యవాద దేశాలలో ఆర్థిక సంఓభం వచ్చినప్పుడు ఆ ప్రభావం ఆ దేశాల మీద ఆధారపడే పేద దేశాల మీద కూడా పడుతుంది.

    రిప్లయితొలగించండి
  38. మనిషికి సెక్సే ప్రధానం అనుకుంటే పెళ్ళి సంబంధాలు దొరక్క పెళ్ళి కాని వాళ్ళందరూ రేప్స్, వ్యభిచారం చేసుకుంటూ బతకాలి. నాకు కూడా వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల నాకు పిల్లని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. సెక్స్ లేకపోతే బాధ అనుకుని నేను కూడా రేపులు, వ్యభిచారం చేసుకుంటూ బతకాలా?

    రిప్లయితొలగించండి
  39. ee vartha evaraina chadivaraa? enduku deeniki anta popularity raledu?

    http://www.mumbaimirror.com/article/2/20090119200901190252246906371d0fc/Pak-girl-beaten-up-for-sporting-tattoo-in-Urdu

    రిప్లయితొలగించండి
  40. హిందూ దేశంలో ఇస్లాంని కించపరిచే పని చేస్తే జనం పెద్దగా పట్టించుకోరు. అదో పెద్ద విచిత్రమా? ఇక్కడ జనం పబ్ కల్చర్ ని సమర్థించడం లేదు. మత ఘర్షనలు సృష్టించే సామర్థ్యం ఉన్న హిందూత్వవాదులు చేసే దాడులని మాత్రమే వ్యతిరేకిస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  41. marthanda:
    మత ఘర్షనలు సృష్టించే సామర్థ్యం ఉన్న హిందూత్వవాదులు చేసే దాడులని మాత్రమే వ్యతిరేకిస్తున్నారు.

    వివరించగలరు

    రిప్లయితొలగించండి
  42. >> కరాళ దంష్ట్రాలవి

    ఒక్క మాటతో టపా మొత్తానికీ కాష్మోరా ఎఫెక్ట్ తీసుకొచ్చారు :-)

    Superb One ... Laughed at Peaks .. Sorry out of topic..

    చెప్పకుండా ఉండలేకపోయా ...

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు