14, నవంబర్ 2008, శుక్రవారం

వంశ గర్జన

యువగర్జన అంటూ తెదేపా మంచి హడావుడే చేసింది. బహిరంగ సభలకు, రోడ్డు షోలకు జనం రావడమే బలానికి కొలబద్దైతే తమ బలాన్ని బహు చక్కగా ప్రదర్శన చేసింది. ఇతర పార్టీల్లో తమ పట్ల విశ్వాసాన్ని, తమ శక్తియుక్తుల పట్ల గౌరవాన్నీ కలిగించేలా బలనిరూపణ చేసుకుంది. అయితే, ఆ వేదిక మీద బాలకృష్ణ చెప్పిందేమిటి?


అతడి ప్రసంగం నేను కొంతే విన్నాను. ఏ ధోరణిలో అది ఉంటుందని అనుకున్నానో అలాగే ఉందది. రామారావు గురించీ, ఆయన చేసిన పనుల గురించీ చెప్పుకుంటే బాధేం లేదు. మా నాన్న, మా వంశం, లాటి వెగటు కలిగించే మాటలే ఉన్నాయా ప్రసంగంలో -అదేదో మనల్నేలడానికే వీళ్ళ వంశం ఉన్నట్టు, మనం వీళ్ళ ఏలుబడిలో పడుండే సత్రకాయలమైనట్టు! ఎవడిక్కావాలి వీళ్ళ వంశం, వంశగౌరవం? చిరాకొస్తది ఈ కబుర్లు వింటుంటే. వీటికి తోడు తన సినిమా డైలాగులు కాసిని! తన అభిమానుల కోసం చెప్పుకున్న సొంత డబ్బా ఆ ప్రసంగం! ఎటొచ్చీ తన సొంత డైలాగులు కాక, ఎవరో రాసిచ్చిన డైలాగులు చెప్పాడు కాబట్టి, ప్రసంగం ఒక పద్ధతిలో నడిచిపోయింది. అతడు కూడా ఆ ప్రసంగానికి తగు మసాలా జోడించి రక్తి కట్టించాడు.

సహజంగానే చిరంజీవితో పోలిక వస్తుంది.. డైలాగుల వరకు చిరంజీవి డవిలాగులే బాగున్నాయి, బాలకృష్ణ డవిలాగులు మరీ సినిమాటిగ్గా, (కొన్ని తన సినిమాల నుండి ఎత్తి తెచ్చినవే) స్వోత్కర్షతో కూడి, వెగటు కలిగించాయి. అయితే డైలాగు డెలివరీలో మాత్రం బాలకృష్ణ చిరంజీవి కంటే చాలా నయం! చిరంజీవి మరీ కొత్త నటుడిలాగా చెప్పాడా డైలాగులు. మరొక్క తేడా ఉంది.. బాలకృష్ణ ముక్కుసూటిగా ఉన్నట్టుగాను, మనసులో ఉన్నదే చెబుతున్నట్టుగాను అనిపిస్తాడు. చిరంజీవిలో అతివినయం కనిపిస్తుంది. అతడిది బైటికి కనబడని తత్వం. పైకి కనబడేది ఒక ముసుగుగాను, లోపల మరో మనిషి ఉన్నాడనీ అనిపిస్తుంది.
 ---------------------------

ఆపేముందు: నిన్న హై.లో జరిగిన సభలో అద్వానీ ప్రసంగించాడు. అందులో చిరంజీవి తనను ఆశీర్వదించమని కోరాడని చెప్పుకున్నాడట. ఇప్పుడు అర్జంటుగా దాన్ని ఖండించాల్సిన అగత్యం ఏర్పడింది చిరంజీవికి. (రాజకీయాల్లో కొందరిచేత తిట్టించుకుంటేనే విలువ మరి.)

33 కామెంట్‌లు:

  1. యువగర్జనకు మందలను దోలి, పేదరికపు
    పరిమార్జనకు అందలములు గోరి, వోటరులనే
    మార్చెందుకు పందులవలె పోరి, తాతనేతుల
    కధనేర్పేందుకు నందమూరులు చేరె, అధోగతులన్

    రిప్లయితొలగించండి
  2. బాలయ్య తొరగా ఫుల్ టైమ్ రాజకీయాల్లో చేరిపోతే బాగుణ్ణు. ఆయన భీకరమైన విగ్గులు, గెటప్పులతో కూడిన సినిమాలు చూసే బాధ తప్పుద్ది.

    చిరంజీవి అతివినయం విషయంలో మీ అభిప్రాయమే నాదీనూ.

    రిప్లయితొలగించండి
  3. రామారావనే చెట్టుపేరుచెప్పి కాయలమ్మకపోతే ఈ వంశోధారకులకు పదవులూ,సినిమాలూ ఎక్కడివి? అందుకే ఆమాత్రం చెప్పుకోకపోతే ఉనికి మిగలదు. రామారావు పేరుచెప్పిన ప్రతిసారీ ఊగిపోయిన ప్రేక్షకులే అందుకు సాక్ష్యం.

    చిరంజీవికీ బాలకృష్ణకీ పోలిక సహజమే! ఈ పోలిక ఇప్పటిది కాదుకదా. గత దశాబ్దమంతా సినిమాల్లో జరిగింది. ఇప్పుడు రాజకీయాల్లో జరుగుతుంది.బాలకృష్ణకన్నా చిరంజీవి నటనలో కొంత మెరుగు, అందుకనే కొంత సిన్సియారిటీ నటించగలడు.

    ఇక బీజేపీతో పొత్తుగురించి ఎన్నికలముందే మాట్లాడితే,కొన్నివర్గాల ఓట్లు పోతాయి. ఆ రిస్కు అవసరమా! అని చిరంజీవి ఉద్దేశం కావచ్చు. సహజమే కదా.

    రిప్లయితొలగించండి
  4. అదో అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు.ఇప్పటికే బాగా అరిగిపోయిన రికార్డు విరిగిపోయే దశకు చేరుకుంది.

    చిరంజీవి ప్రవర్తన కృతకంగానే ఉంది మీరన్నట్టు. అయితే అది ధూర్తలక్షణం అన్నది పూర్తిగా నిజం కాదనిపిస్తుంది. అంటే, దాని వెనుక స్వార్థం, నీచమైన స్వభావం ఉన్నాయని రూఢిగా చెప్పలేం.

    రిప్లయితొలగించండి
  5. orey mee ru enta sepoooo lopaalu, bokkalu, vetakadam tappa eaminaa peekagalaraaa, ledu
    anduku siggupadandi , worst fellows

    రిప్లయితొలగించండి
  6. ఇప్పుడు బాబు అంట, బాబు తరవాత బాలయ్య అంట.. ఇంకొకడు డిసైడ్ చేస్తాడు . అక్కడికేదో ఈ రాష్ట్రం వాళ్ళ తాతయ్య జాగీరు ఐనట్టు..

    రిప్లయితొలగించండి
  7. @ Sudheer - meeru ikkda comments raase badu edina peeki undalsindi kada.
    Don't you know how to comment. What is the wrong you found in the blog is it biased or something against current situation in Andhra Pradesh. If you have any problem you can present in a respectful manner.

    రిప్లయితొలగించండి
  8. అదే నాకూ మండిపోయేది! వీళ్ళ వంశం వల్ల దేశం సంగతలా ఉంచి వాళ్ళ వంశంలో కూడా ఎవరికీ ఏమీ ఒరిగినట్టు కనపడదు. ఫామిలీ లో ఒకడు గా ఇంకా సరిగ్గా గుర్తింపు పొందని ఆ జూనియర్ పిల్లకాయ కూడా "మా వంశం, నేను తొడగొడతాను" అంటాడు, వంశాలూ, ఆ తర్వాతవీ వీళ్లకే ఉన్నట్టు. అసలీ వంశం కాన్సెప్టు ఏమిటో అర్థం కాక ఎంత జుట్టు పీక్కున్నా ...ఊహూ!

    రవి గారు, అంత ఆశపడకండి, విరిగిపోయే లోపుగా రికార్డుని కాపీ చేయించుకుంటారు!

    అన్నట్టు, ఒరెమూనా గారిని బలపరుస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  9. అబ్రకదబ్ర గారు మీరు పేరుతోనే భయపెడుతున్నారని మేము మీ గోడు లు ఆలకించకున్నమా ):

    రిప్లయితొలగించండి
  10. http://www.eenadu.net/archives/archive-6-11-2008/panelhtml.asp?qrystr=htm/panel7.htm

    ee link choodandi idi aaroju tana prasanga poorthi paatam. ekkadaa vamsam gurinchi cheppaledu tanu. ippati varakoo telugu desam tarapuna pani cesina c.m lu NTR & BABU. vaallu em chesaaro tanu cheppaadu. prasthutam unna lopaalu cheppaadu. vaallu chesaarani tanu cheppina vaatillo meeku abhyantaramunte vaati meeda comment cheyyandi. ante kaanee poorthi gaa choodani/chadavani kaaraya kramam meeda avaakulu chavaakulu raaste baagundademo.
    andunaa balakrishna vishayam lo ilaantivi cheyyatam chaalaa maamolu ayipoyindi.
    @katthi: ramaaraavane chettu konta varake needanivva galadu, taruvaata swayam pratibha untene raanincedi. mari krishna pedda kumaarudu ramesh enduku nilabadaleka poyaada. tana venakaala krishna ane vata vruksham unnaa?
    @abraka dabra: anta baadha padutoo tana cinemaalu choodanela?



    @ aatreya: alaage manshyalani pandulatho polchatam e samskruthi. kaneesam pettukunna kalam perukannaa vilava ivvandi

    రిప్లయితొలగించండి
  11. చిట్టచివరి అజ్ఞాత: మీరిచ్చిన ఈనాడు లింకులోనిది ప్రసంగ పూర్తి పాఠం కాదు..

    రిప్లయితొలగించండి
  12. mee daggara poorti prasanga paatam unte link ivvandi. tappakundaa naa tappulemainaa unte sari chesukuntaanu.
    naaku telisi akkada ivvandi tanu muginchetappudu cheppina oka cine dialogue adi koodaa kulaala gurinchi. (oka magadu movie lodi). aa roju tana cesina ati alla tanu toda kottatam. adi okkate ebbettugaa undi tappa migilinadedi anta ebbettugaa ledu.

    konni samvatsaraalugaa mee blogs chaduvuthunnaanu. chaalaa varaku mee blogs nu abhimanichaanu. kaanee manushulni pandulato polchina comments ni meeru anumatinchina taruvaata nenu vaakhyalu cheyyavalasi vacchindi.

    రిప్లయితొలగించండి
  13. కాసు రెడ్డి గారన్నట్టు, డాక్టరు గారి అమ్మాయి డాక్టరు కావచ్చు, ఇంజినీరు గారి అబ్బాయి ఇంజినీరు కావచ్చు, హీరో కొడుకు హీరో కావచ్చు, ఎన్.టీ వోడి కొడుకు నటుడు కావొచ్చు,రాజకీయవాది కొడుకు రాజకీయవేత్తా కావచ్చు, కదా? మరి నందమూరి వంశాకురం ఆ మార్గం పడితే తప్పేముంది? పులి కడుపున పులి బిడ్డే కదా పుడుతుంది?

    ఎన్ టీ వోడికి, చిరంజీవికి పోలికా? లేక చిరంజీవికి బాలయ్యకి పోలిక? ఎదో తేడాగా ఉందిక్కడ?

    నాగర్జున గచ్చిబౌలీలో వందల ఎకరాలు కొన్నాడంట! బెటర్ ఫాల్ ఇన్ లైన్ అన్నారు, "రాజివశేఖరుడీ" అంతగొప్పవాడులేడని అనడంలే.

    అందరూ, అందరే.

    పార్లమెంటులో కింగ్ ఫిషర్ లేదా, రాజ్యసభలో సీట్‌ని రిలయన్స్ కొనుక్కోలేదా?

    వారి అస్తులని కాపాడుకోవడానికి కాకపోతే, ఎవరికోసం ఈ అంకితాలు? ఎవరండీ కృతకంగా లేనిది? వోటరు సజావుగా ఉన్నాడా?

    రిప్లయితొలగించండి
  14. @Balla sudheer, If you don't like express your openion in structured way. How can you write like this ? It seems your parents and Ishunu priya school didn't teach any manners and you meglomaniac think you know everything at the age of 23. What is there to pluck? Why should we ashamed? Whats wrong with us. One person married twice as per my knowledge and second wife's son is more talented than any one in their clan but he did not attend the meeting. Balakrishna is no more big star in Telugu films. You know about exCM and how he came into power. Tell me what is so great about them and their clan?

    రిప్లయితొలగించండి
  15. dear agnaatha ,

    i dont know why u r shouting on me but my school and my parants taught me only one thing that is stright forword ness, may be my language is a little absive,but i dont afraid to reveal my feelings and my emotion and anger on false honour ,

    here i want to tell one thing to u ,why u r critisizing balaiah,and his clan ,may be he is not a great orator but he has a burdan of encouraging those who respect his clan and his family backgroung , i my self attended that yuva garjana i do also expect that menarisms from balaiah,

    dont didgrade u r self by critisizing the stright forword ness

    రిప్లయితొలగించండి
  16. dear agnaatha ,

    who told u balaiah is not a big star then who is the big star chiranjeecvi(he did not get even a hit after choodaalani vundi ),all his movies are remakes or masaalas

    pavan kalayan can't be treated as an actor atleast

    allu arjun is some what better,(only after making 18 surgeries to his face)

    charan is with maadaa face and his first movie has runned on maa t.c propaganda

    రిప్లయితొలగించండి
  17. ఇకపై వ్యాఖ్యలను పరిశీలించాకే ప్రచురిస్తాను

    రిప్లయితొలగించండి
  18. నెటిజన్ వ్యాఖ్య మూలంగానా, చదువరిగారు, మీ ఈ కొత్త నిర్ణయం?!

    రిప్లయితొలగించండి
  19. వంశ ప్రశక్తి ఇప్పుడు, అదిన్నూ తే.దే.పా విషయం లో రావటం చాలా చిత్రం గా ఉంది.
    కేవలం ఓ అఫిడవిట్ వల్ల, వందల ఏళ్లు ఓ కుటుంబం పేరు చెప్పి వేలమంది ఓట్లడిగారే ...

    రిప్లయితొలగించండి
  20. @ballasudheer or అజ్ఞాత // November 15, 2008:20

    Not only here I saw sudheer comments in other blog also. He used abusive words like bastard
    here he used Orey,worst fellows etc ., Will any body think the way Sudheer wrote was stright forwordness certainly not as far as I am concerned. I never saw any where in blogs people are using abusinve words like this.At the age 23, sitting in Bangalore you are commenting such a way that expressing our views also wrong.

    2. I used read this blog quite some time, I never felt this blog writer had some personal agenda to blame others intentionally.

    3. Everybody knows telugu films quality which is low compared to other languages. If you have any doubts visit Navatarang website. Read other languages how they are making different types of movies. Telugu industry people assess hero range by based on commercial hits. There is nothing wrong acting
    remake or masala movies to make money. Infact all telugu movies are masala movies only. At the same time Bala krishna movies are not very new he started acting all his father's old ovies. Bale vadivi baasu (Adavi Ramudu), Samara simha reddy (Driver Ramudu+ Asembly rowdy + 3,4 new shots).
    Baabu I don't know about you, I saw 175 NTR films out of 300.

    " dont didgrade u r self by critisizing the stright forword ness"
    First thing you do not know what is stright forwordness, If you know that you don't write in this fashion. You should think 2 times before writing, This blog is not a gossiping blog, some people who wrote these blogs have extrodinary knowledge.We must proud of these people knowledge. Rignht now telugu weekly books are not up to standards. Blogs are the only place telugu people expressing themselves. This bog is is not like "yet another telugu guy" blog that you should know. Hope by now you understand what is your mistake.

    రిప్లయితొలగించండి
  21. నేను బాలకృష్ణ ప్రసంగం పూర్తిగా విన్నాను.బాలకృష్ణ మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు ఆవేశంగా సినేమా డైలాగులు చెప్తాడేమో, వంశం గురించి మాట్లాడతాడేమో అని ఎట్టా రామా భరించేది?.. అనుకున్నాను.కానీ నా అంచనాలు తప్పయ్యాయి, నా అంచనాలే కాదు, చాలా మంది అంచనాలు తప్పయ్యాయి... తను చాలా చక్కగా అప్పటి తెలుగుదేశం, పాలన ఇప్పటి కాంగ్రెస్ పాలన గురించి పోల్చుతూ చాలా విషయలాని తన ప్రసంగం లో ధాటిగానే ప్రస్తావించాడు. అంతర్జాలంలో ఆ విషయాల గురించి మనం మాట్లాడుకునేదే! అతని నోట వింటున్నప్పుడు, నాకు బానే అనిపించింది...

    ఇకపోతే, చిరంజీవి పార్టీ ప్రారంభ సభ అనగానే చాలా మంది, అతను పార్టీ ఎందుకు పెడుతున్నాడో, ఏం చెయ్యాలనుకుంటున్నాడో ధాటిగా ప్రసంగిస్తాడని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తన గురించిన స్వోత్కర్ష బానె చేసాడు, అది ఎవరూ ఆశించలేదు. పైగా పార్టీ పేరు, జెండా విడుదల ఇవన్నీ సినెమా ఫక్కీలో, వీడియో తియ్యడానికన్నట్టు చెప్పేస్తున్నా... చెప్పేస్తున్నా అంటూ పాపం జనం అంతమంది నుంచున్నారు, త్వరగా కానిచ్చేద్దాము అన్న స్పృహ లేకుండా ప్రవర్తించాడు. అసలు ప్రసంగానికొచ్చేసరికి, ప్రసంగాన్ని చూసి చదివాడు. అంత సేపు జనాన్ని నిలబెట్టి, టి వి ల ముందు కుర్చోబెట్టి చివరకి ఏ మాత్రం జీవం లేకుండా అసలు ప్రసంగాన్ని, నాది కాదు అన్నట్టు చదివి వినిపించేసాడు... అదంతా చూసినప్పుడు నాకు ఒక సినెమా నటుడు ఒక 100 రోజుల సభకి వచ్చిన జనాన్ని చూసుకుని మురిసిపోతూ జనాలని ఊరిస్తున్నట్టు కనబడిందే కానీ, సమయాన్ని,చూసే జనాన్ని గౌరవించకుండా, ఒక నాయకుడిగా ఎదగాలనకునే వ్యక్తి కనబడలేదు.. ఇంక చిరంజీవి అతి వినయం గురించి అందరికీ తెలిసిందే! తనని తాను ఎక్కువగా కూడా చిత్రీకరించుకుంటున్నాడు, బహుసా ఎన్ టి ఆర్ తరహాలో, కాలం మారింది అని కూడా పట్టించుకోకుండా, తనని తనంతట "larger than life" గా చూపించుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. అది కూడా వెగుటు పుట్టిస్తుంది...

    ఇంక బాలకృష్ణ, రామారావు ( వాళ్ళ నాన్న) గురించి చెప్పుకోవడం లో తప్పేమీ లేదు. ఆ విషయాలు తెలుగుదేశం పార్టీవి కూడా... ఇప్పుడు అన్ని పార్టీలు ఆయన జపం చేస్తున్నాయి. మరపు లేని జనం కూడా ఆయన్ని గుర్తుపెట్టుకున్నారు. అంతే కాదు, కొంచెం సేపు తన, తమ పార్టి నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడాడు. ఇంక మీరన్నట్టు తన ప్రసంగంలో మా వంశం అని ఎక్కడ అన్నాడో, మా వంశమే మిమ్మల్ని ఉద్దరిస్తుంది అనే ఉద్దేశంలో(కనీసం మనం అలా అర్ధం చేసుకునేట్టు) తనూ ఏమి మాటలు మాట్లాడాడో ఒకసారి దయచేసి ఇక్కడ రాయండి. ఎందుకంటే వాటిని తను తలచుకున్నపుడు విమర్శిస్తే అర్ధం ఉంది, తలచుకోనప్పుడు కూడా ఎప్పుడో అన్న మాటలని ఇప్పుడు గుర్తు చేసుకుని అతని ప్రసంగాన్ని జడ్జ్ చెయ్యడం సరైనదిగా అనిపించడం లేదు.

    కొన్ని సినెమా డైలాగులు పడ్డాయి, అవి తనకి తప్పదు. మీరు గమనిస్తే, తన ప్రసంగం సినెమా డైలాగులకే ప్రాముఖ్యత ఇస్తున్నట్టు అనిపించదు... మొత్తం దాదాపుగా 21 నిముషాలు సాగిన అతని ప్రసంగంలొ ఒక్క నిముషం మాత్రమే పొడవునా, ప్రసంగం చివరలో రెండు డైలాగులు కలిసేట్టు చెప్పాడు.. తన అభిమానుల కోసం మధ్యలో ఇరికించాడు. ఆ ఒక్క నిముషంలో 30 సెకనుల డైలాగు సొంత డబ్బాలాగా ఉంటుంది. వాటినే పట్టుకుని తను మాట్లాడిన జనానికి ఉపయోగపడే (పోనీ ఉపయోగపడతాయి అని తను అనుకుని మాట్లాడిన) విషయాలని ప్రస్తావించకపోవడం అంతర్జాలంలో పని గట్టుకుని చాలా మంది చేసే విమర్శకి మీ విమర్శకి తేడా కనిపించకుండా పోతుంది...మొత్తంలో ఎక్కువ భాగం తెలుగు దేశం ప్రభుత్వ హయాములో విధానాలు, పాలనకి ఇప్పటి పాలనని పోల్చడానికి తీసుకున్నాడు.

    అదలా ఉంటే, ఇందాకే వరంగల్కి చెందిన నా సహచరుడు వాళ్ళ ఊళ్ళో తనకి పరిచయం ఉన్న ఒక అతని గురించి చెప్పాడు. అతను పై చదువులు చదువుకుని, విదేశాల్లో కొన్నాళ్ళు ఉద్యోగం చేసి వచ్చి, ఇప్పుడు పూర్తి కాలం రాజకీయాల్లో చేరిపోయాడంట. తను ప్రజారాజ్యం తరపున, ప్రయత్నిస్తే 5 కోట్లు అడిగారంట. తను ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కోసం ప్రయత్నిస్తున్నాడంట! ఇలా ఇది మొదటి సారి కాదు వినడం..! అన్ని ప్రాంతాల వాళ్ళు అంటున్నారు. అతను 5 కోట్లు వాళ్ళకిచ్చి, ఎన్నికల్లో అథమ పక్షం 1 కోటి ఖర్చు, గెలిచేసాడనుకోండి... 5 సంవత్సరాలలో ఎలా సంపాదిస్తాడు, ఎంత సంపాదిస్తాడు??

    మరి చిరంజీవి తెచ్చే మార్పు ఏంటి? ఇలాంటివి పరిచయమైన వ్యక్తుల దగ్గర నుండి విన్నప్పుడు, మనకు అనిపించిన విషయాన్ని పోల్చుకున్నప్పుడు, చిరు చూపించే అతి వినయం ఒక ముసుగు మాత్రమే అనిపిస్తుంది... పైన ఎవరో సామెత చెప్పినట్టు అతివినయం ధూర్త లక్షణం...

    మొదటి సారి మీరు పూర్తిగా అధ్యయనం చెయ్యకుండా రాసినట్టుంది... ప్రసంగం పూర్తిగా వినలేదు అంటూనే, "వంశ గర్జన" అనే శీర్షిక పెట్టెయ్యడం న్యాయంగా అనిపించలేదు.అనవసరంగా వాళ్ళ వంశం గురించి విమర్శలని ఆహ్వానించినట్టుంది...

    పాపం బాల కృష్ణ!

    P.S: ఇంత నిరుపయోగకరమైన అంశం గురించి అంతలా శ్రద్ధ వహించాల్సినంత అవసరం లేదు అని మీరు అనుకోవచ్చు. నేనైతే అంత శ్రద్ధ అవసరం లేదనే అనుకుంటాను. ఎందుకంటే రాజకీయాల్లో సినెమా వాళ్ళ జోక్యం నాకు ఇష్టం లేదు కాబట్టి. కానీ, బేరీజు వేసుకోవాల్సి వచ్చినప్పుడు, అలా చేసేప్పుడు మీరు మిగిలిన టపాల్లో ఎంత శ్రద్ధ వహిస్తారో, ఇలాంటి టపాకి కూడా అంతే శ్రద్ధ వహించాలని కోరుకుంటాను.

    రిప్లయితొలగించండి
  22. నేటి ఆంధ్రజ్యోతి, నవ్యలో, మీ బ్లాగుని తాడేపల్లివారు పరిచయంచేసారు. పరిచయం బాగుంది. బ్లాగు కర్తగా మీమీద మరింత భాధ్యత పడింది. అభినందనలు. చక్కటి పరిచయం అందించిన తాడేపల్లి వారికి, ప్రచురించిన ఆంధ్రజ్యోతి కి నెనర్లు.

    రిప్లయితొలగించండి
  23. బాటసారి గారి అభిప్రాయమే నాదీనూ. ఈ దిగువ ఇచ్చిన లింక్ లో మీరు ప్రసంగ పూర్తి పాఠం వినగలరని మనవి.

    http://telugudesam.org/yuvagarjana/

    స్వతహాగా నేను బాలక్రిష్ణ అభిమానిని కాకపోయిననూ(నిజానికి సినిమాల పరంగా వ్యతిరేకిని కూడా) ఈ విషయంలో అతనిని తప్పు పట్టలేను. ఎక్కడా కుల/వంశ ప్రస్తావనే తెలేదు. ఆనక ప్రసంగం అన్నతర్వాత, ఒకింత ఆవేశం ప్రదర్శించటం సహజం. ఏ పార్టీ ఐనా దాని founder గురించి చెప్పుకోవటం జరుగుతుంది. కాకపొతే ఇక్కడ తన తండ్రి అవ్వటం వల్లే ఈ ఇబ్బంది అంతా. లోపల వేరే ఒపినియన్ తో వుండి వుండొచ్చెమో కాని ప్రసంగం లొ ఎక్కడా అతి దొర్లకుండా జాగర్త పడ్డారు.

    ఇక చిరు తో పోల్చిచూసినప్పుడు నాకు చిరు ప్రసంగమే కొంత పేలవం గా ఉన్నట్లు తోచింది. మొదటగా నాకు నచ్చనిది తనెనేదో దేవుడు మనకోసం పంపినట్లు వాళ్ళకి వారే చెప్పుకోవటం. మీరు రమ్మంటేనే వచ్చా అని పదే పదే ప్రతీచోటా చెప్పటం, (ఇది రాజశెఖర రెడ్డి ని వందిమాగాధులు దేవుడు అని పొగిడే దానికి ఏమాత్రం వేరుగా లేదు) సామాజిక న్యాయం, మార్పు అనే buzz words తో స్పస్టత లేని ప్రసంగం చెయ్యటం, ఇక కొంచెం జాగ్రత్తగా వినేవారికి భరించలేని అతి వినయం, తను మంచివాణ్ణి అని ఓవర్ యాక్టింగ్ (ఇది కొత్తగా వచ్చిన లక్షణం) చెయ్యటం. నిజానికి గతం లో చూసినా Chiru is a very good spokes person than balayya. కాని ఏమో, అభిమానిని అయ్యుండి, ఇక్కడ తన మీద నమ్మకం కుదరటం లేదు.

    రిప్లయితొలగించండి
  24. సుజాత గారు,

    మీరు విమర్శించిన పాయింట్ 100% నిజమే కానీ అది ఇక్కడ కాంటెస్ట్ లోకి రాదు. సినిమాలకి, రాజకీయాలకి తేడా ఉంటుందన్న విషయం బానే గుర్తించి చేసిన ప్రసంగమే అది. ఇకపోతే వంశం అని ఊగులాడటానికి అది అచ్చంగా వారి తప్పే కాదు, ఫాలో అయ్యే అభిమానుల్లో ఎక్కువ ఆ టైపే మరి.

    "అతడి ప్రసంగం నేను కొంతే విన్నాను. ఏ ధోరణిలో అది ఉంటుందని అనుకున్నానో అలాగే ఉందది. రామారావు గురించీ, ఆయన చేసిన పనుల గురించీ చెప్పుకుంటే బాధేం లేదు. మా నాన్న, మా వంశం, లాటి వెగటు కలిగించే మాటలే ఉన్నాయా ప్రసంగంలో"

    చదువరి గారు,

    దీనిని బలపరుస్తూ లింక్ ఇవ్వగలరని మనవి.

    నాన్న ని అలా పిలవక ఇంకెలా సంభోధించగలరు, పాపం బాలయ్య!!


    చిరు మాత్రం తను చిన్ననాడు పడ్డ సినిమా కష్టాలని ఏకరువు పెట్టలేదా? బెంజి, గంజి అంటూ సినీ డైలాగులు చెప్పలేదా? నేను ఎంతో అభిమానించే మీ బ్లాగులో ఒకింత కన్విన్సింగ్ గా లేని టపా! btw, నేను balayya అభిమానిని ఎంతమాత్రం కాదండోయ్..

    రిప్లయితొలగించండి
  25. "మరి నందమూరి వంశాకురం ఆ మార్గం పడితే తప్పేముంది? పులి కడుపున పులి బిడ్డే కదా పుడుతుంది? "

    నెటిజన్ గారు,

    పులిబిడ్డ లాంటి నిర్వచనాలు వద్దులేండి. గమ్యం సినిమాలో డైలాగ్ గుర్తుండే వుంటుంది. పొగడబోయి అవమాంచినవాళ్ళు అవుతారు.

    -Vijay

    రిప్లయితొలగించండి
  26. బాటసారి గారూ చాలా బాగా చెప్పారు , నెను ఇక్కద విమర్సలకు గురి అయ్యింది కెవలం వీరి ద్వంద విలువలను విమర్సించినందుకు మాత్రమె , అయ్యా నా వయసు కెవలం 23 కావచ్చు, కానీ ఇక్కద మాత్లడె వాల్లు మెధావులు కావచ్చు, కానీ నాకు మంచికి , చెడ్డ్కి తెడా తెలుసు కొనె వయస్సు కూడా , చిరంజీవి మీద నాకు వ్యతిరెకథ , కానీ బలయ్య మీద అభిమానం కానీ లెదు , కానీ బాలయ్య ప్రసంగం చాలా బాగుంది , అథను ఎక్కదకూడా తన వంసం గురించి కానీ , పౌరుషం గురించి కానీ మాత్లాదలెదు , చిరంజీవి లా గంజి తాగాను , బంజి లొ తిరిగాను అని సెల్ఫ్ దబ్బా కొట్టుకొలెదు , కనీసం తన కుతుంబ నెపద్యం గురించి కూదా చెప్పుకొలెదు , నెను మొదత్త్లొ కొంచం ఉద్రెక పడిన మాట వాస్టవం అందుకు , నెట్ జెన్ లను క్షమాపనలు కొరుకుంతున్నను , కానీ అయ్యా చదువరి గారు మీరు ఇలా వాస్తవాలను మార్చి రాసి మీ మీద మాకున్న గౌరవాన్ని తగ్గించుకొవద్దు , ప్లీస్ , బాలయ్య ను అతని చినెమా లను తిట్టడం నెడు చాలా ఫాషన్ అయ్యింది , ఉదాహరనకు , చాలా మంది నీవు మనిషివా బాల క్రిష్న వా అని తిదు తున్నారు , కాబత్తి దయచెసి , మీ చెత్తలొ కామెంట్లు ఆపండి ,

    రిప్లయితొలగించండి
  27. సుధీర్ గారూ మీ భాష కొంచం మార్చు కొండి దయచెసి , కానీ మీ అభి ప్రాయాలు బాగున్నాయి , మీరు చెప్పింది నిజం , ఆ రొజు బాలయ్య అసలు తన వంశం గురించి మాట్లాదలెదు , చిరంజీవి లా అతివినయం ప్రదర్సించ్లెదు , అప్పటికి చిరంజీవి ఎదొ దైవాంశ సంభూతుడన్నట్లు ఆయన రాజ కీయాల్లొకి రావడం మన పూర్వ జన్మ సుక్రుతం అన్నట్లు ఫ్రవెర్తించాడు ,అతని ప్రవర్థన చాలా చాలా నాటకీయం గా వుంది .తాను అక్కడెదొ సినిమా ఇండస్త్రీ కి పెత్తం దారు ఆయినట్లు , తన కొదుకుని చినిమా ల్లొ కి తీసుకొచ్చి తన స్తానాన్నిచ్చి తాను సిమ్హాసనం వదిలి ప్రజకు సెవ చెయదం కొసం రావడం చాలా ఇరిటేటింగ్ గా వుంది

    రిప్లయితొలగించండి
  28. అందరికీ నెనరులు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోనే వేదికగా మారకుండా ఉండేందుకే వ్యాఖ్యల పరిశీలన పెట్టాను.

    ఇకపోతే వంశ ప్రసక్తి.. పూర్తి పాఠం వీడియోల్లో చూసి చెబుతాను. ఆరోజు టీవీల్లో చూసే రాసానది.

    రిప్లయితొలగించండి
  29. goppa vamse charithra vunte tappaka cheppukovachhu,repu chiranjeevi c.m. ayithe vaari pillalu,manumallu vaari vamsam gurinchi cheppukora,prajarajyam,telugudesam vamsapalananu,bandhupreetini vimarsinche congress party nehru, gandhila vamsacharithra gurinchi cheppukovatamleda,?ayya netijanlu anavasara charcha maani,mundu mee votu hakkuni viniyoginchukondi,sabyathva namodu chesukondi,votu veyyandi..endukante netijanski99%mandiki q lo nunchuni vote chese vopika vundadu kada,idot boxlo views rayatam tappa..idi..pachhi..nizam

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు