13, జూన్ 2008, శుక్రవారం

దశావతారం

ఆ పేరేంటి? దశమావతారమన్నా అనాలి లేదా దశావతారాలు అనన్నా అనాలి. దశావతారం అనొచ్చా? "పది అవతారం" !!!

11 కామెంట్‌లు:

  1. తమిళంలో అంతేనేమో!

    రిప్లయితొలగించండి
  2. సంస్కృతంలో అవతారానికి బహువచనం తెలిసినవారు ఈ ప్రశ్నకు జవాబు చెప్పగలరు.

    రిప్లయితొలగించండి
  3. నాకూ మొదటినుంచీ అదే అభ్యంతరంగా ఉంది

    రిప్లయితొలగించండి
  4. మీరు మరీనండి చదువరిగారు,
    గజిని = సూర్య
    శివాజి = రజనికాంత్
    దశావతారం =కమల్ హసన్
    అది సినిమా నిఘంటువు

    రిప్లయితొలగించండి
  5. మరీ వ్యాకరణం పట్టుబడితే తప్ప సాధారణ వాడుకలో అంత తప్పేం కాదనుకుంటా. కూచిపూడి సాంప్రదాయంలో దశావతారం పాట అనే అంటారు, అలాగే గీతగోవిందంలో ప్రళయ పయోధి జలే కూడా.

    రిప్లయితొలగించండి
  6. సంస్కృతంలో చూసినా ‘దశావతారం’ కరెక్టే అనుకుంటా, ఏకవచనాన్ని ‘అవతార:’ అంటే బహువచనాన్ని ‘అవతారం’ అన్నాలి కాబోలు.

    రామ:,రమౌ,రామేణ,రామాభ్యాం,రామేభ్య: అని కాసేపు అనుకుంటే సమాధానం దొరుకుతుందేమో!
    అయినా ఈ సినిమాకి స్క్రిప్టుకూడా కమల్ కాబట్టి సరిగానే ఉండాలి.

    రిప్లయితొలగించండి
  7. 'సంఖ్యావాచకం కదా' అని చాదస్తానికి పోతే "దశావతారాహ్" అనాలి. తెలుగు వ్యాకరణానుసారంగా చూస్తే 'దశావతారమ్' సాధురూపం కాదు. కాని సంస్కృత వ్యాకరణానుసారం మటుకు సాధువే. సమాహార ద్వంద్వసమాసాల్లో ఇలాంటివి అనుమతాలే (permissible).

    సమాహారద్వంద్వమంటే గుంపుగా పరిగణించి సమాసం చెయ్యడం. అప్పుడు సదరు గుంపులో ఎన్ని పదాలూ, వస్తువులూ, మనుషులూ ఉన్నా అది ఏకవచనమే అవుతుంది. అది ఏకవచనంగానే అంతమౌతుంది

    ఉదా:-

    ఆంధ్రాశ్చ కర్ణాటకాశ్చ = ఆంధ్ర కర్ణాటకమ్
    గంగా చ యమునా చ = గంగాయమునమ్
    కుశాశ్చ కాశాశ్చ = కుశకాశమ్
    (గడ్డీ, గాదం అని అర్థం)

    రిప్లయితొలగించండి
  8. నాకూ ఈ సందేహమొచ్చింది కానీ నేనెవర్నీ అడగలేదు. అడిగినందుకు మీకు, చెప్పినందుకు తాడేపల్లిగారికీ నెనర్లు.

    రిప్లయితొలగించండి
  9. తాడేపల్లి గారూ, వివరణనిచ్చినందుకు నెనరులు. వ్యాఖ్యాతలందరికీ కూడా నెనరులు.
    రాజేంద్ర గారూ, మీరన్నది నిజమే.., నేనూ అనుకున్నాను, సినిమా పేర్లకు అర్థాలు వెదకడమేంటీ అని :) అయితే, తాడేపల్లి గారి ద్వారా విషయజ్ఞానం దొరికింది కాబట్టి, ప్రశ్న సార్థకమయింది.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు