2, ఫిబ్రవరి 2008, శనివారం

జోగయ్యా, ఇదేం గోలయ్యా?

అసలు చిరంజీవి పార్టీ పెడతాడో లేదో, పెట్టినా జోగయ్యనందులో చేర్చుకుంటాడో లేదో గానీ ఈయన మాత్రం ఇంకా పెట్టని ఆ పార్టీలోకి జొరబడి పోయాడు.

కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలికి ఉత్తరం రాసి, ఆమెను నిదర లేపుదామనుకోవడంలో తప్పులేదు. కానీ ఆ ఉత్తరాన్ని కాపీ టు సీయెమ్, కాపీ టు పీయెమ్ లాగా ప్రతీ వాడికీ ఇవ్వటంతో , ఆయన అసలు ఉద్దేశం చిరంజీవికి దగ్గరవడం తప్ప పార్టీ శ్రేయస్సేమీ కాదని తేలిపోయింది.

ఈ అత్యుత్సాహంలో చిరంజీవి కూతురి పెళ్ళి సంగతి కూడా తెచ్చి, పుండును మళ్ళీ రేగగొడుతున్నాడు. ఆమె "నన్నీ గొడవల్లోకి లాగొద్ద"ని అంటోంది. అటూ ఇటూ చేసి, చిరంజీవిక్కూడా కోపం తెప్పించి, రెంటికీ చెడేట్టున్నాడు జోగయ్య.

9 కామెంట్‌లు:

  1. pani pata leni vaaru ilanti kaburule chebutaru kevalam pracharam kosam matrame

    రిప్లయితొలగించండి
  2. జో గ య్య గారు ఈగోల ఏమిటి. మీరు చెవిలో జోరీగలా తయారయ్యారు.ఈ వయసులో మీకు ఎందుకు ఈ గోల.
    కర్రి శ్రీనివాస్

    రిప్లయితొలగించండి
  3. ఊళ్ళో పెళ్ళి కి కుక్కల గోల అంటే ఇదే.

    రిప్లయితొలగించండి
  4. ఈలాంటి ఏధవాల్ని పాథిలొనుచి భయటకు గేంటీవేయాలీ

    రిప్లయితొలగించండి
  5. క్రమశిక్షణ అంటే అర్ధం తెలియని పార్టీ అది. దాంట్లోనుంచి గెంటేసినా, లాక్కున్నా జనాలకు పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఆ మాట కొస్తే మధు యాష్కీ ఇంతకంటే చెత్తగా పార్టీని కంపు చేస్తున్నాడు. ఎవరి స్వార్ధం వారిది. ఎవరి భయాలు వారివి. వారి భయం మన ప్రజల సెంటిమెంటుగా బాకా వూదుతారు. అదీ సంగతి

    రిప్లయితొలగించండి
  6. రాజకీయాలకి రావటానికి కొన్నన్నా తప్పనిసరి అర్హతలు, అలాగే 58 సంవత్సరాలకి తప్పనిసరి పదవీవిరమణ ఉండేలా మనకి చట్టం వచ్చే వరకు మనకీ నరకం తప్పదు.

    రిప్లయితొలగించండి
  7. Friends,

    I think Lok Satta Party will save us from this murky political culture.

    I have visited the party website, www.loksatta.org. It indeed ushers in a New Political Culture.

    The party is about the common man and it aims to make politics and revolve around the citizen.

    Please also visit

    www.jayaprakashnarayan.blogspot.com
    www.loksattaparty.blogspot.com

    Do check out and tell your frieds

    Regards
    Amar

    రిప్లయితొలగించండి
  8. Yes Amar. Agree with your remarks on Loksatta here.
    Whether jogayya's remarks have some truth in them or not, the reaction from his own party is pathetic. YSR doesnt have any answer except terrorise politicians/media/anyone who criticize his corrupt government.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు