25, మే 2008, ఆదివారం

నేను లోక్‌సత్తాకు వోటెందుకేస్తానంటే..

కాంగ్రెసూ, తెలుగుదేశం, భాజపా, తెరాస, అదీ, ఇదీ - అన్నీ పాలించడంలో విఫలమయ్యాయి.
  • సభను రాజకీయాలమయం చేసారు: ఒకరిపై మరొకరు నిందారోపణలు చేసుకోవడం, ఎత్తులూ పైయెత్తులు వేసుకోవడం తప్ప, సభలో అర్థవంతమైన చర్చ జరపరు.
  • రాజకీయాలను నేరమయం చేసారు: తుపాకులతో పోలింగు కేంద్రాలకెళ్ళి బెదిరించేవాడొకడు, దొంగ బిల్లులు పుట్టించి డబ్బులు కొట్టెయ్యబోయేదొకడు, వాణ్ణి రక్షించేందుకు జీవోలే పుట్టించేసే ప్రభుత్వాధినేతలు, క్షమాపణ పేరుతో హత్యానేరాల్లో శిక్ష అనుభవిస్తున్న తమ అనుంగు అనుచరులను విడిపించేవాడొకడు, కాసిని డబ్బులకోసం ఎవత్తికో మొగుడుగా నటించి విదేశాలకు చేరవేసే త్రాష్టులు, డబ్బులు తీసుకుని సభలో ప్రశ్నలడిగే ముష్టి వెధవలు.. అంతే లేని జాబితా ఇది.
  • పరిపాలనను అవినీతిమయం చేసారు: అవినీతి, అక్రమార్జన పరిశ్రమలుగా మారిపోయాయి. రాష్ట్రంలోని మొదటి పాతిక అవినీతి పందికొక్కులను పట్టి వాళ్ళ బొక్కసాలను వెలికితీస్తే దొరికే మన డబ్బుతో జలయజ్ఞపు ప్రాజెక్టులు కట్టెయ్యొచ్చు. ఇది అతిశయోక్తి కాదు, నా నమ్మకం.
  • ఎన్నికలను డబ్బు మయం చేసారు: డబ్బు పంచి, సారా పోయించి వోట్లు కొంటున్నారు. తరువాతి కాలంలో తమ సంపాదనకు అదే వారి పెట్టుబడి (ఇటీవల జరిగిన ఎన్నికలలో - 2004 లోను, ఆ తరువాత కరీంనగరు ఉప ఎన్నికలోనూ - పోలీసులు డబ్బుకట్టలను పట్టుకున్నారన్న సంగతి నాకింకా గుర్తుంది). ఎన్నికవగానే ఆ ఖర్చును పూడ్చేందుకు సంపాదన మొదలు.
  • ప్రజాజీవితాన్ని తిట్లమయం చేసారు: తిట్లూ, ఆరోపణలు - ఇవే వాళ్ళ దినచర్య. ప్రజాసమస్యల గురించి ఆలోచించడం మానేసి చాలా ఏళ్ళైంది. వాళ్ళకు మన వోట్లు కావాలి గానీ మన పాట్లు పట్టవు.
ఇన్నాళ్ళూ ఇలాంటి వెధవలకు ప్రత్యామ్నాయం లేదు కాబట్టి వాళ్ళకే వోటేసా, తప్పలేదు. కానీ ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయం ఉంది. అది లోక్‌సత్తా పార్టీ. అవినీతిని నిర్మూలించాలన్న, రాజకీయాలను బాగుచెయ్యాలన్న నిబద్ధత కలిగిన పార్టీ. ప్రజలను రాజకీయాల్లో - ముఖ్యంగా ఎన్నికల్లో - చురుగ్గా పాల్గొనాలని కోరుతూ అందుకు ఉద్యమిస్తున్న పార్టీ.

  1. లోక్‌సత్తాకు నేను వోటేసినంత మాత్రాన అది గెలుస్తుందా, అధికారంలోకి వస్తుందా?
  2. జయప్రకాశ్ నారాయణకు ప్రజాకర్షణ లేదుగదా, వోట్లెలా సంపాదిస్తాడు?
  3. తానొక్కడూ మంచివాడైతే చాలా, చుట్టూ ఉన్నవాళ్ళు వెధవలైతే ఒక్కడే ఏం చెయ్యగలడు?
  4. ఇప్పుడిలాగే కబుర్లు చెబుతాడు, రేపు తానూ సైతానే, ఆ తానులోని ముక్కే.. ఈ మాత్రానికి వోటెందుకెయ్యడం?
  5. ...
- ఇలాంటి ప్రశ్నలు నన్నాపలేవు. ఎందుకంటే..
  1. నేను వోటెయ్యకపోతే లోక్‌సత్తా గెలవదేమోనన్న భయం నాకుంది. అంచేత నేను తప్పకుండా వోటు వేస్తాను. వేసి తీరతాను.
  2. లోక్‌సత్తా నన్ను ఆకర్షించింది, అంచేత వోటేస్తాను. ఇతరులను ఆకర్షించడం, వోట్లు సాధించడం వాళ్ళ పని - అది వాళ్ళు చూసుకుంటారు. వోటెందుకెయ్యాలో, నేనెందుకేస్తున్నానో ఇదుగో.. ఇలా చెబుతాను.
  3. సమాజంలో ఉన్న కుళ్ళును ఎలా కడుగుతాడో జేపీ చెబుతున్నాడు, వోటు అడుగుతున్నాడు. 'ఇల్లు ఊడ్చిపెడతాను, చీపురివ్వండి' అంటే ఇవ్వడానికేం బాధ, ఇస్తాను. 'మీ ఇల్లూడుస్తాం, అంట్లు తోముతాం, బట్టలుతుకుతాం' అని చెప్పి ఇల్లంతా దోచుకుపోతున్న వెధవలతోటి విసిగిపోయాను నేను. (ఇదివరకు గిన్నెలూ, గరిటెల్లాంటివి ఎత్తుకుపోయేవారు.. ఇప్పుడు ఏకంగా ఇల్లే అమ్మేసుకుపోయే రకాలు తయారయ్యాయి.) అందుకని లోక్‌సత్తాకు వోటేస్తాను.
  4. ఇప్పటికైతే లోక్‌సత్తా బాగానే ఉంది. రేపు సైతాను కావచ్చేమోనని భయపడితే, ఇప్పటి రాబందులూ రక్తపిశాచాల నుండి కాచుకోవడమెలా?
ఇంకా...
  • లోక్‌సత్తా పార్టీ సభ్యుడు ఒక్కరు శాసనసభలో ఉన్నారనుకోండి. అప్పుడు మనకు 293 మందే వెధవలు ఉంటారు. ఆ మేరకు మురికిని శుభ్రపరచినట్టే! రామారావు రాజకీయాల్లోకి రాకముందు, ప్రతిపక్షమనేదే లేదు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని సభలో ప్రశ్నించేందుకు శాసనసభలో జైపాల్ రెడ్డి, ఎమ్.ఓంకార్, వెంకయ్యనాయుడు.. వీళ్ళే ఉండేవారు. కానీ వాళ్ళు ఇప్పటి ప్రతిపక్షాల కంటే ఎంతో సమర్థవంతంగా పనిచేసేవారు.
  • అయ్యో నేను కూడా వోటేసి ఉంటే బావుండేదే అని పశ్చాత్తాపపడటం నాకిష్టం లేదు.
అంచేత నా వోటు లోక్‌సత్తాకే!

20 కామెంట్‌లు:

  1. p takkuva tinnada margadarsi vyavaharam lo atanokkadea balenced gaa matladataadanu konna,

    akkada ayana kooda romaji patla etv lo panichesina “swami baktini”,

    k.c.r,c.b.n,ragavalu laaga “kula bakthi” ni chaatu kontu matladadu.

    margadarsi tappu la gurinchi matlada kunda ituvanti charyala valla indian econamy “atalaakutalam” ayipoddi annattu matlaadadu

    evadaina okatea kotta paarty la valla neeti vantamaina paalana raaddu

    manam raajakeeya naayakulanu ennukonea tappu du

    pancayati member stayi nunti manchi vaalanu ennukovatamea ee samasyaku pariskaaram.

    రిప్లయితొలగించండి
  2. @Subbu gaaru

    enta varaku controversy cheyyagaligite antavaraku cheyyandi.. mee saayasakthula prayatninchandi.. avagaahana unnavaadu, manchivaadu raajakeeyaallo pravesinchagaane burada challandi... raanivvakandi...

    margadarsi vyavahaaramlO lakshala mandito mudipadi madupudaarulato mudipadi unna amsaaniki chaalaa bhaadhyataayutamgaa spandinchaaru...

    chivarlo aa nasugudu enduko... panchaayiti sthaayi nundi manchi vaallu raavaalani...

    రిప్లయితొలగించండి
  3. అయితే ఆదిమ గారూ జయప్రకాష్ నారాయణకు గానీ,లోక్ సత్తాకు గానీ వ్యతిరేకంగా గానీ,అసమ్మతి తెలుపుతూ గాని,వారివారి అభిప్రాయాలు తెలపకుండా నోరు్మూసుకుని కూర్చోవాలంటారు, మీరు?

    రిప్లయితొలగించండి
  4. @Rajendra gaaru
    norumusukommani evarannaaru.. JP margadarsi vyavahaaramloni spandanaku aayana spandana meeda charchinchamanandi.. ante kaanee aa mukhya vishayaanni vadilesi JP swami bhakti ani, kulaala gurinchi maatlaadatam heyamaina spandana.. daanni khandinchaanu... atani migilina vkyaallo avagaahanaaraahityaanni khandinchaanu..

    meeru daaniki vipareetaardham teesesaaru... oka sadvimarsaki buradajalludiki chaalaa tedaa undi..

    రిప్లయితొలగించండి
  5. చదువరి గారు, తాను లోక్ సత్తాకి వోటెంకువేయాలనుకుంటున్నారో చెప్పారు. బాగుంది. మీరెవరైనా వోటెందుకు వేయకూడదో చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. సభలో చర్చలు పక్కదారిపట్టినట్టే మనవ్యాఖ్యలుకూడా కులాలు, మతాలవైపు వెళుతుందేమో?
    రాజేంద్రగారు: అర్ధవంతమైన, సవివరమైన విమర్శలు ఉపయుక్తంగాఉంటాయి.
    నేనింతకుముందు చాలాసార్లన్నాను, మరోసారి: మనుషుల్లో తప్పులు చేయనోడెవడూ వుండడు ఆఖరికీ గాంధీతోసహా. 100 తప్పులు చేసినోడు, 10 తప్పులుచేసినోళ్ళాలో ఎవరుమంచోడంటే నేను 10 తప్పులు చేసినోడికే ఓటేస్తా.

    రిప్లయితొలగించండి
  6. చదువరి గారు

    మీరు చెప్పినదానికి మరికొన్ని పాయింట్లు నేను జతచేస్తున్నా :

    1) రాజకీయాల్లో పడి డబ్బు, పవరు సంపాదించాల్సిన అవసరం లోక్ సత్తా జేపీ గారికి లేదు. ఐ.ఏ.యెస్ లో కలెక్టరు పదవిని చేపట్టిన సమర్థుడాయన. తనంతట తానుగా పైకొచ్చాడు (వారసత్వంతో కాదు). అంత తెలివితేటలతో ఎం.బీ.ఏ చేసి లక్షలు కోట్లు సంపాదించొచ్చు. కానీ, ఊరూ వాడా తిరిగి లోక్ సత్తా ఉద్యమం స్థాపించి ప్రజాస్వామ్యం అంటే ఏంటొ పల్లెప్రజలకు వివరించాడు. ఎందుకు చేసాడంటారు ? తన కులాన్ని, వగైరా రిలేషన్లని అట్టేపెట్టుకుని రాజకీయాలు చేయాల్సి వస్తే ఇలా ఒక కొత్త పార్టీ పెట్టేవాడు కాదు, ప్రజలని చైతన్యవంతులని చెయ్యడానికి ప్రయత్నించేవాడు కాదు.

    మనుషుల్లో అక్కడక్కడా కొంతమంది మంచివాళ్ళుంటారు. ఇలా నమ్మడానికి జంకుతున్నామంటే అది మన దౌర్భాగ్యం.

    2) ఏ కొత్తపార్టీ అయినా ప్రజల నానుడిలోకి రావడానికి కొంత టైము పడుతుంది. ఈ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిస్తే అప్పటికే లోక్ సత్తా గురించి ప్రజలకి ప్రచారం అవుతుంది. తరువాయి ఎన్నికల్లో మరిన్ని గెలుస్తుంది. మార్పు కావాలంటే ధైర్యంగా మనం ఓటు వెయ్యాలి.

    3) ఊరకనే వాగ్ధానాలు దంచి అమాయకప్రజలను మోసగించడం కాక, నిజాయితీ తో ప్రతి పైసా ఎలా ఖర్చుపెడతామో లోక్ సత్తా చెబుతోంది. ఆకాశాన్ని దించుతామని అనట్లేదు, ఇల్లు శుభ్రం చేస్తామంటోంది. అందుకని, విజ్ఞులు దీనికి గౌరవం ఇవ్వాలి.

    రిప్లయితొలగించండి
  7. చదువరి గారు,
    బాగా చెప్పారు. నేను జెపి గారికి వోటు వేస్తానో లేదో తెలీదు కాని, ఆయనలో నాకు నచ్చే అంశం "విషయ స్పష్టత". రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య కి సంబంధించిన ప్రశ్న అయినా ఆయన చెప్పే సమాధానం చాల సాంకేతికంగా (టెక్నికల్ గా) ఉంటుంది. కొంతమంది అవకాశ వాదులు తెలంగాణా కావాలంటారు. కాని వస్తే ఎలా అభివ్రుద్ధి జరుగుతుందో వాళ్లకే తెలీదు. చిరంజీవి లాంటి జనాకర్షణ కలిగిన వాల్లు జెపి లంటి వాల్లథొ పొత్తు పెత్తుకోవాలని నా కోరిక

    రిప్లయితొలగించండి
  8. నాకు తెలిసి లోక్ సత్తా కు వోటేసి గెలిపిస్తే, ఆ పార్టీ అధికారంలో కొస్తే, ఆ పరిపాలనలో రాష్ట్ర పరిస్థితి ఇంత కంటే చండాలమైన పరిస్థితి కి వెల్లడం సాధ్యం కాదు. ఏందుకంటే మన పరిస్థితి ఇప్పటికే అట్టడుగున వుంది కాబట్టి.అటువంటప్పుడు ఒక అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? కొంచం సమర్థవంతంగా పరిపాలించినా మనం ఇంత కంటే మంచిస్థితి కే చేరుకుంటాం కదా. Mr.Perfect కోసం చూస్తూ కూర్చుంటే రాష్ట్రమే మిగలదు. దొరకడం అసంభవం కూడా.

    మనకు కావలసింది చేపల్ని పెట్టడం కాదు, పట్టడం నేర్పించాలి

    రిప్లయితొలగించండి
  9. naakaitE chirajeevilaanTi prajaakarshaka naTulu loksatta ni samardhinchi, loksattaki votlu veyyamani prachaaram chEstE chaalu.. loksatta partylo chEranavasaramlEdu,vaaLLoka party pettanakkaralEdu... alaa cheyyaDam vaLLa raashtraaniki,dEsaaniki manchi chEsina vaaLLugaa charitralO nilichipOtaaru...

    రిప్లయితొలగించండి
  10. అధికారాన్ని రుచిమరిగేదాకా అందరూ మంచివాళ్ళే. కాంగ్రెస్ తో సహా అన్నీ మంచి ఉద్దేశాలతో మొదలైనవే. కాలక్రమంలోనే ఇలా అఘోరించాయి.

    మనం లోక్ సత్తాకి రావాలనుకుంటున్న ప్రజాదరణ నిజంగా వస్తే మిగతా పార్టీలవాళ్ళు లోక్ సత్తాలో దూరిపోయి పాత కథనే కొత్త డైలాగులతో నడిపించగలరు.

    నా మట్టుకు నేను వేఱే పార్టీకే వోటేస్తాననుకోండి.

    ప్రజాస్వామ్యానికి జె.పి. చెప్పే భాష్యం పడమటి దేశాల జీవన వేదాంతం మీద ఆధారపడ్డటువంటిది. మన ప్రజాస్వామ్య సూత్రాలు మన దేశ వాతావరణంలోంచి మన సంస్కృతిలోంచి పుట్టాలి. మన అనుభవాల్ని ప్రాతిపదికగా తీసుకోవాలి. ఆ రకంగా నేను వంశపారంపరిక ప్రజాస్వామ్యాన్ని కూడా పెద్దగా తప్పుపట్టను. పడమటి దేశాల్లో కూడా ప్రజాస్వామ్యం చిలకపచ్చగా ఏమీ లేదు-వట్టి గాలికబుర్లు తప్ప. ఉన్నదంతా కార్పొరేట్ స్వామ్యం.

    జె.పి.కి చాలా విషయాల్లో స్పష్టత లేదు. "ఇలా జరగాలి" అంటారు. ఎలానో అర్థం కాదు. ఎవరు అధికారంలోకి వచ్చినా అదే IAS, అదే IPS, అదే Group-1,2 ఆఫీసర్లతో పరిపాలన చెయ్యక తప్పదు. అయితే నా దృష్టిలో అవినీతికన్నా ముఖ్యమైన సమస్యలున్నాయి. Corruption is a major effect, but not the cause of every thing.

    రిప్లయితొలగించండి
  11. మిత్రులందరికీ,
    విజయశాంతి -తెలుగుతల్లి,కాసాని జ్ఞానెస్వర్ -మన పార్టీ,కిలారి ఆనందపాల్- ప్రజాపార్టీ ఇంకా వస్తుందంటున్న సినీనటుడు చిరంజీవి పార్తీ ఇలా ఇన్నిపార్టీల మధ్య వస్తున్న పార్టీ లోక్ సత్తా.స్వచ్చందసంస్థ నుంచి రాజకీయపక్షం గా పరిణితి చెందుతున్నది.ప్రస్తుతం జరగబోతున్న ఉపఎన్నికలలో కొన్ని చోట్ల పోటీకూడా చేస్తున్నది.స్వచ్చందసంస్థ గా ఉన్నప్పటి పరిస్థితి రాజకీయరంగప్రవేశం చేసాక మారుతుంది.పార్లమెంటరీప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలలో ఓట్లు రాబట్టుకోవటంఅనేది ఎన్ని మార్గాల్లో వీలుంటే అన్ని దారుల్లో ప్రయత్నించటం,అధికారానికి రావటం రాజకీయపక్షాల పరమావధి.ఎన్నికల ప్రణాళికలు,బహిరంగ సభలు,పత్రికా ప్రకటనలు వగైరాలు ఒక దారి,ప్రలోభపెట్టటం,ఇతర అక్రమాలకు పాల్పడటం మరొక మార్గం.మరొక మార్గమని నేను ప్రస్తావించిన దారిలో లోక్ సత్తా నడవదు అన్న సంగతి ఇప్పటికే వెల్లడయ్యింది.అంతవరకూ ఎవరికీ అభ్యంతరాలుండవనుకుంటున్నా.
    జయప్రకాష్ నారాయణకు,ఆమాటకొస్తే చంద్రబాబు,వైయస్ లాంటి వారికి కూడా కులతత్వం అంటకట్తటం కూడదు ఆ స్థాయిలో కులాన్ని నమ్ముకుని వారు రాజకీయాలు చెయ్యరు.
    ఇక ఎన్నికల ప్రణాళికలవద్దకు వస్తే ఏపార్టీ మానిఫెస్టో చూసినా ఆదర్శరాజ్యాలే ఉంటాయి చూడుడు కాంగ్రెస్ వారి ఎన్నికలవాగ్ద్దానపత్రాలు,చంద్రబాబు నాయుడు విజన్ 2020,అలాగే లోక్ సత్తా వారి’నిజాయితీ తో ప్రతి పైసా ఎలా ఖర్చుపెడతామో"అన్నది కాస్త ఇంపుగా ఉన్నా మిగిలిన వారి దారిలోనే తక్కిన అంశాలు చాలా వరకూఉన్నాయి.
    గతంలో నవలారచయితలలో ఒకటి నుంచి పదిస్థానాలు యండమూరి వీరేంద్రనాధ్ వే అని ఒక ప్రచారం,సినిమా నటుల్లో ఒకటి నుంచి పది స్థానాలు చిరంజీవివి అని అన్నట్లు లోక్ సత్తా పార్టీలో ఒకటి నుంచి పది స్థానాలు జయప్రకాష్ నారాయణవే అని నాలాంటి అవగాహన లేని వారు వదరుతున్నారు,కానీ వర్మ గారు అన్న ఒక్కాయన పేరు తప్ప లోక్ సత్తా కు గల మిగిలిన నాయకుల పేర్లు చెప్పి నాలాంటి వాళ్ళకు కాస్త జ్ఞానబోధ చెయ్యగలరు.
    గతంలో అవినీతి ఆరోపణల మీద గుంటూరు జిల్లా లోక్ సత్తా శాఖను రద్దు చేసారు.ఇప్పటికైనా ఆశాఖను పునరుద్ధ్రించారా అని ఆ జిల్లాకు చెందినవాడిగా తెలుసుకోవాలనుకుంటున్నాను,దయచేసి చెప్పగలరు.

    అసంపూర్ణం-మిగిలిన భాగం త్వరలో..

    రిప్లయితొలగించండి
  12. @Rajendra gaaru


    oka udyamamnundi oka nayakuDu pudataadu... atanu samardhudaite tanato paaTu nayakulani edaganistaadu, tana taravaata taraaniki nayakulani tayaaru chestaadu...

    loksatta udyamam ante JP gaari peru vinipistundi, aayana kanapadataadu...

    sarvodaya udyamama ante loknayak jayaprakash narayan kanapadataaru.. aa udyamam jarugutunnappudu atanu party pettinappudu prajalu atani protsahinchaaru, aa udyamam vennanti unnaaru... ante gaanee nirasaavaadamto nuvvu tappite neevenaka nayakuleri ani adagaledu...

    samajaanni maarchadaaniki nibbaram unna oka nayakudu chaalu... ippati varaku charitra manaki ade cheptundi... atani vente nayakulu inko padi mandi tayaaravutaaru...

    JP niyantalaaga, nirankusudigaa pravartinchaledu... vyakti aaradhanani koodaa protsahinchaledu...

    loksatta tarapuna ippudu paalgontunna mugguru abhyardhulu naayakule, janaanni kadilinchina vaalle... JP nayakulani tayaaru cheyyagalaru...

    avineeti aaropana vachindani raddu chesina aa party nibaddhatani manam gouravinchaali, protsahinchaali...

    eppudu punaruddharinchaalo nijamgaa telusukovaalani unte, loksatta ki oka email pampandi... meeku evaraina manchi nayakudu guntur lo unnaarani teliste loksatta vaariki cheppandi...
    JP cheppinattu "devudi pelliki andaru peddale"...

    meeru niraasaavaadamlo nundi bayatapadi manchini protsahinchandi, loksatta daarilokostundi...

    తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం gaaru,
    meeru cheppindi aalochinchadagga vishayam.. loksatta website lo forum unte vaallaki mee pratipaadana teliyacheyyochu kadaa.. mee levanettina vishayam marinta charchani aahvaaninchadaginadi...

    రిప్లయితొలగించండి
  13. అయ్యా ఆదిమ గారు,లోక్ సత్తా తరపున స్పందించాలన్న మీ ఉత్సాహం ఆదుర్దాగా మారనివ్వకండి.కనీసం నా కామెంటు పూర్తిగా రాసే వరకన్నా ఆగండి.గుంటూరు శాఖ గురించి నా సందేహానికి సమాధానం ఇస్తారనుకుంటే మీరు నాకు సలహా ఇచ్చారు,నేను నిరాశావాదంలొ ఉన్నానని,మంచిని ప్రోత్సాహించటం లేదని ఆశ్చర్యకరమైన నిర్ణయానికి మీరు ఎలా రాగలిగారో నాకు ఏమాత్రం అంతుబట్టటం లేదు.
    మీరు లోక్ సత్తా తరపున అధికారికప్రతినిధిగా మాట్లాదుతున్నారా? అలాంటప్పుడు మొదట మీ పేరు తదితర వివరాలతో అందరికీ పరిచయం చేసుకోండి.కాస్త ఓపిక పడితే నా కామెంటు పూర్తి చేస్తాను.

    రిప్లయితొలగించండి
  14. ముందుగా పనికొచ్చే విషయం -
    మన వాదనలెలాగూ మనకుంటాయి. అయితే మనం నిర్ణయించుకోవాల్సింది.. మన వోటెవరికి? మన ప్రాథమ్యాలెక్కడున్నాయి?

    సర్వ సులక్షణ సమన్వితమైన పార్టీ ఒకటి -లోక్‌సత్తా లాగా నైతికతకు ఆలవాలమై, కాంగ్రెసు, తెదేపాల్లోలాగా మనందరికీ తెలిసిన అనేకానేక మంది నాయకులుంటూ, కమ్యూనిస్టుల్లాగా అలాగా, తెరాస లాగా ఇలాగా ఉండే పార్టీ - వచ్చేవరకూ వోటెయ్యకుండా ఆగుదామా? లేక, ఉన్నవాళ్ళలోనే అత్యుత్తమమైన వారిని ఎంచుకుని ఎన్నుకుందామా? ఆగేవారు ఆగొచ్చు. లేదూ అంటే, మన ప్రాథమ్యాలు, ప్రాధాన్యాలు ఎక్కడున్నాయో ఒకసారి సరి చూసుకుని ఎంచుకుందాం! నేను నా ప్రాథమ్యాలు చూసుకున్నాను - అవినీతి, ప్రజల పట్ల నిష్పూచీ కంటే పెద్ద సమస్యలు ప్రస్తుతానికి లేవు అని నా ఉద్దేశ్యం. వీటిని పరిష్కరించే విషయంలో లోక్‌సత్తా నిబద్ధత దుర్నిరీక్ష్యమైనది. అందుకే నా వోటు లోక్‌సత్తాకే!

    ఇహ, వాదన కోసం -
    "...ఆమాటకొస్తే చంద్రబాబు,వైయస్ లాంటి వారికి కూడా కులతత్వం అంటకట్తటం కూడదు ఆ స్థాయిలో కులాన్ని నమ్ముకుని వారు రాజకీయాలు చెయ్యరు." - నాకు ఆశ్చర్యం కలిగించిందిది. డబ్బు, కులం, ప్రాంతం మన రాజకీయాలకు ప్రేరక, చోదక శక్తులని అనుకుంటూ ఉంటాను. వీళ్ళిద్దరూ హఠాత్తుగా కులతత్వం అంటని నేతలెప్పుడైపోయారా అని ఆశ్చర్యం కలిగిస్తోంది.

    నాయకుల సంఖ్య: రెండో అంకె దాటనంత మంది నాయకులున్నారని ఎద్దేవా చేసే ముందు, వందలూ వేలుగా నాయకులు గల పార్టీల్లోని సదరు నాయకులెలాంటి వారో చూద్దాం. అమ్మల దగ్గరి నుండి, కొడకల దాకా తిట్టుకునే నాయకులు, ప్రాంతీయ అభివృద్ధి మండలికి ఎన్నికైనప్పటి నుండీ, "దీనికి నిధుల్లేవు, నాకు కారు లేదు, కూచ్చోడానికి కుర్చీ లేదు, నేనేం చేసేది, ఇదుత్త అలంకారమే" అని రోజూ గునుస్తూ ఉంటూనే, పదవిని మాత్రం వదలని వాళ్ళు, పోలీసులు పట్టుకోకుండా గోడ దూకి పారిపోయే నాయకులు, ఎదటోణ్ణి తిడితే వాడు పరువు నష్టం దావా వేస్తే జైలుకు పోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్న నాయకులు, పోలీసును కొట్టిన కేసులో జైలుకు పోవాల్సి వచ్చిన నాయకులు, చట్టవిరుద్ధంగా ప్రాజెక్టుల గేట్లెత్తేసే నాయకులు, కర్నూలొస్తే కాళ్ళిరగ్గొడతాం, హైదరబాదొస్తే తిరిగి పోలేవు అనే నాయకులు, సాటి ఎంపీని రాజధాని నడిబొడ్డున, ప్రెస్‌క్లబ్బులో కొట్టించే నాయకులు, అలా కొట్టినందుగ్గాను రోడ్డు మీద కూచ్చోని ట్రాఫిక్కునడ్డగించే నాయకులు, సాయంత్రం దాకా కాంగ్రెసులో టిక్కెట్టు కోసం చూసి, రాకపోతే తెదేపాలో చేరి, గెలిచి, నెలల్లోనే వెనక్కిపోయి, రాజీనామా చేసి, మళ్ళీ పోటీ చేసి, ఓడిపోయి.. -ఈ బాపతు నాయకులూ, బినామీ జనంతో ఫ్యాక్టరీలు పెట్టి, బయటపడ్డాక "ఏఁ, నా వాళ్ళను పైకి తీసుకొస్తే తప్పా" అనే నాయకులూ, ఎన్నికల్లో కర్రుచ్చుకుని పాత్రికేయుల వెంటబడ్డ గౌరవనీయ నాయకులూ (ఆ ఫోటోలు పేపర్లలో వచ్చాయి కూడాను) ఏకంగా తుపాకులే పట్టుకు తిరిగిన నాయకులూ, దగాకోరులు, కబ్జాకోరులు, ఖూనీకోరులు, దొంగకోళ్ళు పట్టేవాళ్ళూ, దొంగ పాసుపోర్టులు పెట్టేవాళ్ళూ... అబ్బో...హ్, గొప్ప నాయకులు లెండి! ఒకటి నుండి పదేం ఖర్మ.. పదేల దాకా లెక్కబెట్టొచ్చు.

    ఈ రకం నాయకులేనా, కనీసం పదిమంది కూడా లోక్‌సత్తాకు లేరని ఎత్తి చూపుతున్నారు!?

    గుంటూరు శాఖ - తెలీదు

    రిప్లయితొలగించండి
  15. రాజేంద్ర కుమార్ గారు,

    జేపీ గారి ఉత్తేజ పూరితమైన ప్రసంగాలు విన్నప్పుడు 'ఈయన తప్పక సమాజాన్ని, రాజకీయాన్ని మార్చగలడు ' అనిపించడం సహజం. లోక్ సత్తా పార్టీ 9 ఆగస్ట్, 2006 న అనౌన్స్ చేసినపుడు 'మూడేళ్లలో రాష్ట్ర రాజకీయాన్ని,పదేళ్ళలో దేస రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తామని ప్రతిజ్ఞ చేసారు. రెండేళ్ళు అవుతోంది పార్టీ ఆవిర్భవించి. కనీస ప్రగతి లేదు.

    ఎన్నికల ఎజెండా కూడా ఇతర పార్టీల ఎజెండాలకు భిన్నంగా ఏమీ లేదు(మీరన్నట్టు ఎన్నికల ముందు ప్రతి మానిఫెస్టో ఆదర్శ రాజ్యాన్నే చూపిస్తుంది కాబట్టి).

    ఏ నియోజక వర్గానికి చెందిన వారికి ఆ నియోజకవర్గంలోనే సీటు ఇవ్వడం జరుగుతుందని పార్టీ ఉద్ఘాటన. ఇప్పుడు సికిందరాబాదు లో పోటీ చేస్తున్న ప్రదీప్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 8లో అనుకుంటాను ఉంటాడు. మరి అతడిని సికిందరాబాదులో ఎలా నిలబెట్టారు?

    అంతే కాక, పార్టీలో అంతర్గతంగా ఉన్న అసంతృప్తి ని జేపీ పట్టించుకున్న దాఖలాలు లేవు! పార్టీ కోసం నిజాయితీగా పని చేసిన రషీదుల్లా ఖాన్(పేరు మార్చాను) అనే కార్యకర్త కనీస గుర్తింపు (గుర్తింపంటే సీటు కాదు)ఇప్పుడు చిరంజీవి పెట్టే పార్టీలో చేరాలని అనుకుంటున్నారట.

    గుంటురు జిల్లా శాఖ గురించి విన్నాను కానీ దాని మీద తీసుకున్న చర్య సంగతి తెలియదు(HYDలో లేకపోవడం వల్ల). ఇలాంటిదే మెదక్ జిల్లా కు చెందిన పార్టీ కార్యకర్తలు కూడా ఎవరో చేసారని ,సొంత పనికి పార్టీ పేరు వాడుకున్నారని విన్నాను. అంటె కాక, మహిళా విభాగం లో ఒకళ్ళిద్దరి ప్రమేయం మితిమీరడంతో వారిని నియంత్రించే ప్రయత్నాలు కూడా జరిగాయట.

    వర్మ గారి భార్య శ్రీమతి మనోరమ, ప్రతిభా రావు, సత్యనారాయణ, అంకయ్య, మరో సత్యనారాయణ ..వీరు లోక్ సత్తాలో జేపీ తర్వాత చెప్పుకోదగ్గ పేర్లు.

    ఇల్లు దిద్దుకోలేని వాళ్ళు దేశ ముఖ చిత్రాన్ని మారుస్తాం అని చెప్పడం విడ్డూరం! అయినా జేపీ నాయకత్వం మీద ఒక మూల ఆశ నాకు.

    లోక్ సత్తా ఆదర్శాలు ప్రసంగాలకూ, పార్టీ పత్రిక 'జనం బలం ' కూ, వారు వేసే కరపత్రాలకూ పరిమితం కాకుండా ఉండాలని కోరుకునే వాళ్ళలో ప్రథమురాలిని నేను.

    రిప్లయితొలగించండి
  16. All the same, I am open to new ideas. ఇంతమందికి అవకాశమిచ్చాం. (మనమిచ్చేదేంటిలెండి, నా బొంద, వాళ్ళే మన పేరుచెప్పి పుచ్చేసుకున్నారు) లోక్ సత్తాకి రెండు అవకాశాలు (కనీసం పదేళ్ళు) ఇచ్చి చూస్తే తప్పులేదు. ఏ అర్థవంతమైన మార్పు తేవాలన్నా ఆ మాత్రం వ్యవధానం అవసరం కనుక. నేను వెయ్యకపోయినా ఇతరులు లోక సత్తాకి వోటేస్తామంటే నాకు వివాదం లేదు.

    నేను ఇందాక రాసిన వ్యాఖ్య అందరికీ అర్థమై ఉంటుందని అనుకోను. ఇక్కడి దేశసంస్కృతీ సంప్రదాయాల్లో ఇమడని ఆదర్శాలతో, చట్టాలతో చాలా అభాసుపాలవుతున్నాం. ఉదాహరణకి బహుభార్యాత్వ నిషేధ చట్టం. దానికింద అరెష్టులు చెయ్యాలంటే మిలియన్లాదిమందిని చెయ్యాల్సొస్తుంది. ఉన్న చెఱసాలలు సరిపోవు. పోలిసుల్లో కూడా ఒక మూడోవంతుమందిని అరెస్టు చెయ్యాల్సొస్తుంది.

    మనం చాలాకాలంపాటు విదేశీపాలనలో బతకడం చేత కొన్నికొన్ని సహజపరిణామాలకు దూరమైపోయాం. మన సమాజంలో ఇప్పటిదాకా వచ్చినవి గానీ, వస్తున్నవి గానీ, రాబోతున్నవి గానీ అన్ని మార్పులూ ఎవరో పైవాళ్ళు ఆలోచించి మన మీద రుద్దుతున్నవే తప్ప జనజాగృతి, సంఘసంస్కరణ, క్రమపరిణామం మొదలైనవాటిద్వారా వచ్చినవి కావు. అవన్నీ అందుకే విఫలమూ, లేదా అర్ధసఫలమూ అవుతున్నాయి. మన ప్రజాస్వామ్యం కూడా అలా కాకూడదు.

    రిప్లయితొలగించండి
  17. తాడెపల్లి గారు, అదే ఇప్పుడు చెయ్యాల్సింది! మీరు కూడా ఒక అయిదేళ్ళు వాడేసుకోండి మమ్మల్ని! మీకిష్టమైన ప్రయోగాలు చేసుకోండి మా మీద! అని అందరికీ ఇచ్చినట్టే లోక్ సత్తా కీ అవకాశం ఇచ్చి చూడాలి.(అదే లెండి, వాళ్ళే పుచ్చేసుకుంటుంటే చూడాలి)

    రిప్లయితొలగించండి
  18. చదువరి గారూ.... మీరు చెప్పినట్టు లొక్ సత్తా కు వోట్ వేయడాన్ని నేను సమర్ధిస్తాను. కాని ఇలాగే వుంటే లొక్ సట్ట రాజ్యాధికారం లోకి రావడం అసంభవం అని నా నమ్మకం.
    మన దేశం లో ఎక్కువ శాతం ప్రజలు నిరక్షరాస్యులే. రాజకీయాల గతిని నిర్దేశించేదీ వారే. ఏ రాజకీయ పార్టీ అయినా వారి దాకా చొచ్చుకు వెళ్ళగలిగినప్పుడే అధికారం లోకి రావడం అనేది సాధ్యమవుతుంది.కాని లోక్ సత్తా పార్టీ గురించి విద్యావంతులు కాని వారికి ఎంతమందికి అవగాహన వుంది? అవగాహన కాదు కదా కనీసం లోక్ సత్తా అనే ఒక రాజకీయ పార్టీ వుందని పల్లెల్లొ ఎంతమందికి తెలుసు?కనీసం ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగిన చోట్లయినా, పోనీ లోక్ సత్తా పోటీ చేసిన చోట్లయినా నిరక్షరాస్యులకీ, కూలీ, నాలీ చేసుకునే జనాలకీ ఎంతామందికి లోక్ సత్తా అనే పార్టీ అభ్యర్ధి కూడా బరిలో వున్నాడని తెలుసు?
    కేవలం రాజకీయాల గురించి ఎంతో కొంత అవగాహన వున్న ప్రజలు మాత్రమే లోక్ సత్తా గురించి తెలుసుకుని వోట్ వేసినంత మాత్రాన లోక్ సత్తా కు రాజ్యధికారం సాధ్యమేనా?
    జయ ప్రకాష్ గారు లోక్ సత్తా గురించి ప్రచారం చేయదం లేదని నేనడం లేదు.ఆయన చేస్తున్న ప్రచారం సరిపోదనేదే నా భావన. తరచుగా వార్తా చానళ్ళలో కనిపించి తమ పార్టీ ఆశయాలు చెప్పి, ఎదుటి పార్టీలు చేసే తప్పులను ఖండించినంత మాత్రాన పార్టీ అన్ని వర్గాలను చేరగలదా?ఏ పార్టీ కయినా క్రింది స్థాయి కేడర్ ముఖ్యం. కాని లోక్ సత్తా కేడర్ ఎంత బలంగా వుంది? ముఖ్యంగా పట్నాల కంటే, పల్లెలలోని వోట్లే రాజకీయాలని ప్రభావితం చేస్తాయి. లోక్ సత్తా అధికారం లోకి రావాలంటె ముఖ్యంగా పల్లెల మీద దృష్టి సారించాలి. వారికి పార్టీ మీద అవగాహన కలిగించాలి. నూరు శాతం ప్రజలకీ పార్టి గురించి తెలిస్తే ముఫ్ఫై శాతం వోట్లయినా వస్తాయి అని నా అభిప్రాయం.
    లోక్ సత్తా అదికారంలోకి రాగలిగితే దేశానికి శుభపరిణామమే. కాని ఈ రొజే వార్తా పత్రికలలో చూసాను ............ "తప్ప తాగి పోలింగు బూత్ కి వచ్చిన లోక్ సత్తా పోలింగ్ ఏజెంట్" అని. కేవలం జయ ప్రకాష్ ఒక్కరికీ నిబధ్ధత వుంటే సరిపోతుందా?

    రిప్లయితొలగించండి
  19. Ayya Mahanubhavularaa...meeru cheppinadi antha sababe. Kaani okka vishayam marichi pothunnamemo alochinachakuudaduu?

    Manam mana brathukulni marchu kovali anukuntunnamu. Andhukum manam okkasari alochiste, unna muudu partylu kudaa mana brathukulni marche veyyavu (Emo marchutayamo..maroka vidham gaa..negative..marintha andhvanam gaa)...

    Oka party vallu..mana brthukulni already chidram chesaru..maroka party vallu chestamu antunnaru..

    inlanti paristitilo...ok manchi avagahanathoti vachini vyathini..manam positive gaa chudakunda..kula gajji ni antinchali anukotam ante..manaku entha gajji patti undo telusukovali.. mana gajjini pakka vallaku antinchali ani chudatamlo..mana mentha prathivrathalamo ardham avuthundi..

    1983 kanna mundu paripalinchinivallalo ekkuvamandi oke samajika varganiki chendini valle..kaani 1983 lo..veroka party raagane..kula feeling teesuku vacharu..adi kevalam valla vote banknu kaapdadu kovatanike..lekunte..NTR purthigaa tudhichi pedathademo ane bhayam tho..alage ippudu CPI ki, CPM ku..JP ku..

    ee gajji pattini vallanu marchatam devuni taram kuda kaadu..endhukante..vellaku kallu, kaallu, manasu emi undadu..kulam tappithe..

    alochinchandi..vote veyyandi..

    రిప్లయితొలగించండి
  20. ఇన్నాళ్ళూ మనం రాజకీయాలలో మంచి పార్టీలే లేవని అనుకున్నాం.


    ఇపుడు ఒక పార్టీ మంచి విధానాలు, ఆదర్శాలతో ముందుకు వస్తే ఎంత మంది మద్దతు ఇస్తున్నారు?

    సగటున ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం లో పదివేల వోట్లు తెచ్చుకుంటే లోక్ సత్తా బతికి ఉంటుంది.

    లోక్ సత్తా తన నిజమైన సత్తా వచ్చే మునిసిపల్ ఎన్నికలలో చూపించగలదు.

    అందరికంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవచ్చు.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు