5, మే 2008, సోమవారం

లేటుగా వెలిగిన లైటు

పొద్దు నిర్వహించిన అభినవ భువనవిజయం కవి సమ్మేళనంలో నావీ కొన్ని పద్యాలుండటం నాకెంతో సంతోషం కలిగించింది. ఆ సమ్మేళనానికై సమస్యలను కొత్తపాళీ గారు ఇచ్చారు. ఆయనిచ్చిన సమస్యలలో నాకు బాగా కష్టమనిపించింది - "గ్లోబలు వార్మింగు యనుచు గోముగ పలికెన్".

తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం గారు ఈ సమస్యను అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అన్వయించి చక్కటి పూరణ రాసి పంపించారు. కొన్ని ఘోరమైన తప్పులతో నేనూ ఓ పద్యం రాసి పంపించాను. సహజంగానే అది అనుమతికి నోచుకోలేదు.

అంతా అయిపోయాక, సమ్మేళనం సందడి సద్దుమణిగాక, తీరుబడిగా ఒక పద్యం రాసి కొత్తపాళీ గారికి పంపించాను. బానేవుందన్నారు.. అంచేత దాన్ని ఇక్కడ, ఇలా..

నోబెలు పొందిన గోరును
ఆ బహుమతి ఎట్టులొచ్చె యని ప్రశ్నించన్
నోబులుగా నవ్వి యతడు
గ్లోబలు వార్మింగు యనుచు గోముగ పలికెన్

3 కామెంట్‌లు:

 1. ట్యూబులైటు లేటుగా వెలిగితేనేమి!
  తెల్లని వెన్నెలవెలుగును పంచుతుంది గదా!

  రిప్లయితొలగించండి
 2. బకారప్రాస క్లిష్టప్రాసల వర్గానికి చెందినది. రెండో అక్షరం "బ" గా ఉండే పదాలు మన భాషలో బహు తక్కువ. అందుచేత ప్రాస స్థానంలో హెచ్చుగా అన్యదేశ్యాలే పడే అవకాశం ఉంది.

  పద్యాల్లో వ్యాకరణం పట్ల , శబ్దసాధుత్వం పట్ల కొంత సావధానం తప్పదు. అసలు, ఇచ్చిన సమస్యలోనే ఆ సమస్య ఉంది. తెలుగు పద్యాల్లో సంధి లేకుండా వాక్యం ఉండదు. అది సడలించుకుందామని నేనే ప్రతిపాదించాను. కాని బొత్తిగా పొసగని సంధులు చెయ్యకుండా కూడా జాగ్రత్తపడాలి. ఇచ్చిన సమస్య - గ్లోబలు వార్మింగు యనుచు గోముగ బలికెన్" ఇందులో నుచు అని యడాగమం వచ్చే అవకాశం లేదు. వార్మింగుకీ అనుచు కీ మధ్య ఇంకేదైనా చేర్చాలి. అప్పుడు గణభంగం జరక్కుండా సరిపోతుంది.

  నేను నా పూరణంలో దీనిని "గ్లోబలు వార్మింగ్ అటంచు" అని సవరించాను. ఎవరూ గమనించలేదు.

  మీ ప్రస్తుత పూరణంలో :

  ఎట్టులొచ్చె = ఎట్లు వచ్చె

  రిప్లయితొలగించండి
 3. :) బాగుంది

  తాడేపల్లివారు చేసిన వ్యాఖ్య చదివాక ఇంతకు మించి ఇంకేమీ వ్రాయలేకపోతున్నాను.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు