28, మే 2006, ఆదివారం

టీవీ వాళ్ళకు, సినిమా వాళ్ళకు తగువైతే..

సినిమా వాళ్ళకు, టీవీ వాళ్ళకు గట్టిగా తగువైతే చూడాలనుంది. మా సినిమాలు, పాటలు, క్లిప్పింగులు, మీ టీవీల్లో వెయ్యడానికి వీల్లేదని వాళ్ళూ, అసలు మీ సినిమాల గురించి అన్నీ నిజాలే చెబుతామని వీళ్ళూ పంతం పట్టారనుకోండి, మనకెన్ని ఉపయోగాలో చూడండి..
 1. సినిమాల గురించి కార్యక్రమాలేమీ లేకపోయేసరికి టీవీలు 12 గంటల సేపు మూత పడతాయి. (వేరే కార్యక్రమాలా? సర్లెండి, దానికి బుర్ర కావాలి, ఆషామాషీ కాదు!)
 2. సినిమా సమీక్షల్లో (సమీక్షలను సినిమా వాళ్ళు ఆపలేరు కదా!) అబద్ధాలసలుండవు కాబట్టి మంచి సినిమా ఏదో చప్పున తెలిసిపోతుంది మనకు.
 3. వెకిలి చేష్టల లంగర్లు, భాష రాని లంగర్లకు పని ఉండదు కాబట్టి, మళ్ళీ తమతమ పూర్వ వృత్తుల్లోకి పోతారు, పీడా విరగడై పోతుంది. (వాళ్ళలో కొంతమంది తిరునాళ్ళలోని ప్రభల మీద రికార్డు డ్యాన్సులకు తప్ప మరో దానికి పనికిరారు.)
 4. ఈ మకిలంతా పోయిన తరువాత, కాస్త తేటనీరు, కొత్తనీరు వస్తే అప్పుడు మళ్ళీ మనం మంచి కార్యక్రమాలు చూసే అవకాశం ఉండొచ్చు.
టీవీల భాగోతం పై నా బ్లాగోతం చూడండి. నా మొట్ట మొదటి జాబు అదే!

4 కామెంట్‌లు:

 1. ఈ మకిలంతా పోతే అంతే చాలండీ! ఆ కాలవలు పూర్తిగా ఎండిపోయినా దేశానికి వచ్చే నష్టమేమీ లేదు.

  రిప్లయితొలగించండి
 2. మనం పోవాలి అనుకున్నవన్నీ (కుళ్ళు రాజకీయాలు, చెత్త కాలువలు (ఊ, చానల్లు లెండి), లాంటివి) మరింతగా విజృంభిస్తునట్టున్నాయి.

  రిప్లయితొలగించండి
 3. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 4. Annayaa nuvvu cheppinattu jarigite chaala mandhi kadupu meeda kottinattu avutundhi. Edo atla batiki potunnaru poniddu

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు