15, మే 2006, సోమవారం

పునరంకితం.. పునః పునరంకితం

రాష్ట్ర కాంగ్రెసు పార్టీ పునరంకిత సభలు పెట్టింది. ఈ పునరంకితం అవడం ఏంటి? అధికారం స్వీకరించగానే అంకితమయ్యారుగదా! ఈ రెండేళ్ళలో ఎప్పుడు అనంకితమయ్యారు? ప్రజాసేవ నుండి ఎప్పుడు బయటపడ్డారు? భలే చడీచప్పుడు కాకుండా తప్పుకున్నారే! నేనింకా వీళ్ళు ప్రజాసేవలోనే ఉన్నారనుకుంటున్నా!! మరి.. అప్పటి నుండి వీళ్ళేంచేస్తున్నట్లు?

ఏదేమైనా ఈ పునరంకిత తిరునాళ్ళ సందర్భంగా రాజు, మంత్రులూ, విదూషకులు, భట్రాజులూ అందరికీ ఓ విన్నపం.. ఎప్పుడు అనంకితమౌతున్నారో మాకు చెప్పండి. మళ్ళీ చివరి ఏడాది పునరంకితమప్పుడు ఆశ్చర్యపోయే అగత్యం మాకుండదు. లేదా.., అంకితమైనప్పుడు, అనంకితమైనప్పుడు, పునరంకితమైనప్పుడు పరిస్థితుల్లో కాస్తో కూస్తో తేడా ఉండేలా చూడండి.

3 కామెంట్‌లు:

 1. ఈ పునర్ అంకితం గురించి సగటు పౌరుల మదిలో ఏర్పడిన గందరగోళానికి, అయోమయానికి చక్కటి అక్షర రూపమిచ్చినందుకు మీకు జోహార్లు!

  రిప్లయితొలగించండి
 2. let us forget what some other people say "punaramkitam". I would like to know your opinion on punaramkitam. it is used by many people and sometime back i was thinking what could be reasons behind punaramkitam and I would be happy to know your thoughts on it.

  thanks.

  రిప్లయితొలగించండి
 3. మీరు చెప్పిన తనికెళ్ళ భరణి కవిత పోలిక చాలా బావుంది.
  ఏవుందండీ, వోటర్లకి తిక్కరేగి గద్దె దింపే దాకా ఇలా పునరంకిత మవుతూనే ఉంటారు. ఏముంది నష్టం, రెండు మాటలేగా? సూర్యచంద్రుల సాక్షిగా దుష్యంతుడు శకుంతలని "పెళ్ళి" చేసుకున్నట్టు - గాలికి పోయే మాటలేగా.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు