9, ఏప్రిల్ 2006, ఆదివారం

వీళ్ళు పోలీసులా ?!?

అసలు మనుషులే కాదు.
పశువుల కంటే హీనులు.
రాక్షసుల కంటే క్రూరులు.
హంతకులు.
కిరాతకులు.

వరంగల్లు జిల్లా కుండపర్తి దగ్గర పొరపాటున అమాయకుణ్ణి చంపేసి, తప్పు ఒప్పుకోకపోగా మసిపూసి మారేడుకాయ చేసేందుకు నక్సలైటనే ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేసారట. ఎంత దారుణం! నిండు ప్రాణాలు తీసిందిగాక, బలయిన వారిపైనే నిందలు వేయబోతారా?

ఆ మధ్య గుంటూరు జిల్లాలో పలనాడు ప్రాంతంలో రాత్రివేళ ఓ రోడ్డు ప్రమాదంలో ఓ జీపు మోటారు సైకిల్ను గుద్దగా దాన్ని నడిపిస్తున్న వ్యక్తి బాగా గాయపడి స్పృహ కోల్పోయాడు. వెనక కూర్చున్న వ్యక్తికి కొద్ది దెబ్బలు తగిలాయి. నడిపే అతడు చచ్చిపోయాడనుకున్నారు జీపు డ్రైవరు, క్లీనరు . వెనక కూర్చునిఉన్న వ్యక్తి పోలీసులకు చెబుతాడేమోనని భయపడి, వాళ్ళిద్దరూ కలిసి అతడిని చంపేసారు. తీరా నడిపే వ్యక్తి బతికి బయటపడి పోలీసులకీ విషయం తెలియజేసాడు. నాటి ఆ జీపు డ్రైవరు, క్లీనరు కిరాతకానికి సాటిరాగలిగినది, నేటి కుండపర్తి పోలీసుల ఘాతుకం.

శ్రీశ్రీ అన్నాడు.. దొంగలంజకొడుకులసలే మెసలే ఈ లోకంలో..

1 కామెంట్‌:

  1. ఎంత ఘోరం! అందుకే నేనంటాను దుర్మార్గము, అవినీతి, పక్షపాతము ఇంకా ఏమేమి దుర్లక్షణాలు ఉన్నాయో అవన్నీ మన సమాజములో ఉన్నాయి. అందులోంచి పుట్టుకొచ్చిన వాళ్ళే ఈ పోలీసులు, రాజకీయులూ. మనం మన పురాతన గ్రంధాలనూ వారసత్వాన్ని తత్వ విచారణనూ చూసి గర్వించాల్సిందే గాని ఇప్పటి కుళ్ళిపోయిన సమజాన్ని చూసి గర్వపడాల్సింది ఏమీ లేదు.
    ఏ రైలోకో ప్రమాదం జరిగితే ప్రయాణీకుల్ని రక్షించే వారెందరు, వాళ్ళ సామానుల్ని కాజేసేవారెందరు?
    ప్రమాదాల్లో గాయపడి రోడ్డు పక్కన పడున్న వారిని రక్షించేదెందరు? నిట్టూర్చేదెందరు? వినోదం చూసేదెందరు?
    ఆకలికి అలమిటించే వారికి రూపాయి విదిల్చే వారెందరు? దాభాలకి మిత్రుల్ని తీసుకెల్లి విందుల్ని ఆరగించేవారెందరు?
    నల్లబజార్లో ఎంతైనా పెట్టి అభిమాన హీరో సినిమా చూసే దెందరు? నెలకు రూపాయైనా దానం చెయ్యని ప్రబుద్దులెందరు?
    అత్యధికులు ఇలంటి బోలెడన్ని రుగ్మతలతో బాధపడుతుండడం వల్లే మనకిలాంటి రాజకీయ నాయకులు, పోలీసులూ!!!
    -- ప్రసాద్

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు