మంగళూరు పబ్బు దాడి చేసినది "శ్రీరామ సేన" కాకుండా మరోటేదైనా అయ్యుంటే.. ఏ పీపుల్ ఫర్ రేషనల్, ఎథికల్, మెథొడికల్ లివింగో, డెమోక్రటిక్ సెక్యులర్ లిబర్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియానో, జెనెక్స్ ఇండియానో, ఇలాంటి ఇంగ్లీషు పేర్లు - హిందూ వాసన లేని పేర్లు - పెట్టుకున్న మరో సంస్థ ఏదైనానో చేసుంటే మన మహిళల పబ్బు హక్కుల కార్యకర్తలు ఒక్ఖరైనా నోరు మెదిపేవారా? పేపర్లలో అసలు వార్తలొచ్చేవా? దాడిని ఖండిస్తూ ప్రకటనలుండేవా? బ్లాగుల్లో వ్యాఖ్యలుండేవా? అసలు టపాలుండేవా? -ఇవేవీ ఉండేవి కావు.
29, జనవరి 2009, గురువారం
19, జనవరి 2009, సోమవారం
హద్దులేని అధికార పక్షం - అడ్డలేని ప్రతిపక్షం
ఐదేళ్ళుగా ఈ అధికారపక్షం ఆంధ్రప్రదేశ్‌ను ఎన్ని రకాలుగా దోచుకోవచ్చో అన్ని రకాలుగానూ దోచుకుంటోంది. కుంభకోణాల యజ్ఞాలు చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం వారిని అడ్డుకోలేకపోతోంది. ప్రతిపక్షం ఎలా వ్యవహరిస్తే ప్రభుత్వం తప్పులను బయటపెట్టవచ్చో, ఒకప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షానికి తెలిసే ఉండాలి. కానీ ఈ ప్రతిపక్షం అలా తెలిసినట్టుగా వ్యవహరించడంలేదు.
7, జనవరి 2009, బుధవారం
అసత్యం
లాభాలు అబద్ధం.
చూపెట్టిన అప్పులు అబద్ధం.
రావాల్సి ఉందని చెప్పిన ఆదాయం అబద్ధం.
ఆయన కుటుంబానికే చెందినవి మేటాస్ ఇన్ఫ్రా, మేటాస్ ప్రాపర్టీస్ కంపెనీలు. (వీటినే సత్యంలోకలిపెయ్యబోతే షేరుహోల్డర్లు ఎదురుతిరిగారు.) మేటాస్ ఇన్ఫ్రాయే హై.లో మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టబోతోంది. ఆ ప్రాజెక్టును వాళ్ళకు ఇచ్చినందుకుగాను, ఆశ్చర్యకరమైన రీతిలో 35 ఏళ్ళలో ప్రభుత్వానికే 30 వేల కోట్లు ఎదురు చెల్లిస్తామని ఒప్పుకుంది -ప్రభుత్వం ఇస్తానన్న రెండున్నర వేల కోట్ల రూపాయల డబ్బులు వద్దని మరీ! ఎలా చేస్తారో మరి!!

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
సంబంధిత టపాలు
loading..