22, సెప్టెంబర్ 2008, సోమవారం

వోటరు నమోదు కేంద్రాలను పోస్టాఫీసుల్లో ఏర్పాటు చెయ్యండి!

మీకు వోటు హక్కుందా? ఉండే ఉంటుంది. మరి, వోటరుగా నమోదయ్యారా? అయ్యుండకపోతే, నమోదు చేయించుకోండి. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. మన భవితను నిర్ణయించుకునే అవకాశమది -ఎలాగోలా నమోదు చేయించుకోవాలి మరి. అయితే, ఈ నమోదు వ్యవహారం పెద్ద తతంగంగా కనిపిస్తోంది. కుప్పుసామయ్యర్ మేడ్డిఫికల్టు లాగా వీలైనంత కష్టతరంగా చేసిపెట్టారు ఈ కార్యక్రమాన్ని. నమోదు చేయించుకోడానికి ఎక్కడికెళ్ళాలో తెలీదు, ఎప్పుడు చేయించుకోవాలో తెలీదు, ఏవేం కాగితాలు తీసుకెళ్ళాలో తెలీదు. దీన్ని సులభం చేస్తూ.. 'పోస్టాఫీసుల్లో నమోదు కేంద్రాల నేర్పాటు చెయ్యండి మహప్రభో' అంటూ లోక్‌సత్తా ఎన్నేళ్ళుగానో గోల పెడుతోంది.



హలీము అమ్మడం లాంటి అనేక మంచి పనులను ఈ పోస్టాఫీసుల్లో చేయిస్తున్నారు గదా, వాటితో పాటు ఈ పనిని కూడా చేయించడానికేం ఇబ్బంది? ఎందుకన్నాగానీ ఎన్నికల సంఘం ఇంకా ఈ చర్య తీసుకోలేదు. అంచేత, వారికి ఉత్తరాలు రాసి, ఎన్నికల సంఘంపై వత్తిడి తెచ్చే కార్యక్రమాన్ని లోక్‌సత్తా చేపట్టింది. మనందరం ఎన్నికల ప్రధాన కమిషనరు వారి సమ్ముఖమునకు ఓ మెయిలు పంపాలన్నమాట! ఆ మెయిల్లో ఏం పంపాలన్నది లోక్‌సత్తా వారు తయారు చేసి పంపారు. ఆ మెయిలుకు తెలుగు అనువాదాన్ని కింద ఇస్తున్నాను. మీరూ ఓ మెయిలు కొట్టండి. మెయిలైడీ: gopalaswamin@eci.gov.in

-----------------------------------

ప్రియమైన గోపాలస్వామి గారూ,

వోటరు నమోదు కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో, ఎలా చేసుకోవాలో తెలీకపోవడం వలన ఎందరో యువ భారతీయులు వోటర్లుగా నమోదు చేయించుకోలేక పోతున్నారు.

అంచేత పోస్టాఫీసులను శాశ్వత వోటరు నమోదు కేంద్రాలుగా చెయ్యండి. అప్పుడు సులువుగా నమోదు చేయించుకోవచ్చు, నిర్ధారించుకోవచ్చు, దొంగ వోటర్లను తొలగించడంలో సాయపడనూ వచ్చు.

దీనికవసరమైన చర్యలను ఎన్నికల సంఘం వెంటనే చేపడుతుందని ఆశిస్తాను. కోట్లాది యువ భారతీయుల వోట్లు, ప్రజాస్వామ్యపు భవితా మీ చేతుల్లో ఉన్నాయి.

నమస్కారాలతో,

-----------------------------------

గోపాలస్వామి గారికి తెలుగు అర్థమౌతుందో లేదో తెలీదు కాబట్టి, పై ముక్కలను ఇంగ్లీషులో రాసి పంపించవచ్చు. ఇదిగో ఇలాగ!

------------------------------------
Dear Mr Gopala Swamy,


Most young Indians like me, are not able to register as voters, because we don't know where this (Voter Registration) is happening, when it is Happening and how we can Register.

So, please make POST OFFICES as PERMANENT CENTERS for VOTER REGISTRATION. Then we can Easily verify our vote, get registered as voters if needed and help remove bogus Voters.

We hope Election Commission will take all necessary steps at the earliest. The Votes of Millions of young Indians and the future of democracy are in your hands.

Regards,
--------------------------------------------
నేను పంపించాను. మీరూ పంపించండి. మీరు వోటరుగా నమోదై ఉన్నా సరే పంపించండి. ఎన్నికల సంఘం ఈ పని చేస్తే ఎంతోమందికి ప్రయోజనం కలుగుతుంది. కానీ, ఆ ప్రయోజనం పొందబోయే వారందరికీ ఈ ఉత్తరాల సంగతి తెలుసో లేదో మరి! అంచేత మనం రాద్దాం. వీలైతే ఈ ముక్కలను మీ మీ బ్లాగుల్లో కూడా పెట్టండి.

13 కామెంట్‌లు:

  1. ఒరెమూనా, నెనరులండీ. ఇప్పుడు రాసాను.

    రిప్లయితొలగించండి
  2. మంచి టపా రాసారు చదువరి గారు!ఎన్నారైలకి కుడా వోటు హక్కు ఉంటే బాగుంటుంది.దీని మీద మీరు కొంచెం వివరాలు రాయగలరా?

    రిప్లయితొలగించండి
  3. పంపించాను చదువరి గారు,
    శ్రీ గారు,మీకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాం.మరలా యన్.డి.యే ప్రభుత్వం అధికారములోకి వచ్చి అటు అద్వానీ కానీ,ఇటు వాజపేయి కానీ భారతప్రధాని అయితే తప్ప మీకు ప్రవాసభారతీయులకు ఓటు వినియోగించుకునే అవకాశం రాదు,కావున మీరు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టండి(వారు గతములో ఆ విధమైన హామీ ఇచ్చారు మరి)

    రిప్లయితొలగించండి
  4. శ్రవణ్, శ్రీ, రాజేంద్ర కుమార్ : నెనరులు.
    ఎన్నారైల వోటు హక్కు గురించి ఈ ప్రభుత్వం కూడా గతంలో ఓ మాట చెప్పి ఉంది. మరి దాని గురించి ఏమైనా జరిగిందో లేదో తెలీదు.

    రిప్లయితొలగించండి
  5. నేనూ మెయిలు పంపాను. అవును విదేశాల్లో ఉండే భారతీయులకు కూడా absentee ballot పద్ధతిన అవకాశం కలిగిస్తే జీవితంలో కనీసం ఒక్కసారైనా భారతీయ ఎన్నికల్లో ఓటేసి తరించాలని నా కోరిక

    రిప్లయితొలగించండి
  6. ఈ విషయం లేవనెత్తి చాలా మంచి పని చేశారు చదువరి గారూ.
    భారతంలో కూడా త్వరలో ఎన్నికల భేరీలు మోగబోతున్న నేపథ్యంలో, పౌరులకి ముఖ్యమైన సమస్యల్ని హైలైట్ చేస్తూ తెలుగు బ్లాగర్లు ఒక ఆలోచనతో కూడిన కార్యాచరణ ప్రణాళికతో ఒక ముఖ్యమైన శక్తిగా ఎదగాలని నా ఆకాంక్ష. గత రెండు పెద్ద ఎన్నికల్లోనూ ఇక్కడ (అమెరికాలో) బ్లాగర్లు సమస్యల్ని హైలైట్ చెయ్యడంలోనూ, అభ్యర్ధుల్ని విశ్లేషించడంలోనూ ప్రముఖ పాత్ర వహించారు.

    రిప్లయితొలగించండి
  7. ఇది వరలో తెలుగు బ్లాగులలోనే ఆన్‌లైన్ అర్జీ పత్రం ఒకటి చూసిన గుర్తు. అలాంటి అవకాశం లేదా!

    రిప్లయితొలగించండి
  8. చదువరి: ఇలాంటివి పనిచెయ్యవా?
    http://www.ipetitions.com/start-petition/
    http://www.petitiononline.com/

    రిప్లయితొలగించండి
  9. నెటిజెన్: ఈ ఈమెయిళ్ళ ఉద్దేశ్యం ప్రజల్లో అవగాహన కలిగించడం, సంబంధితులపై వత్తిడి పెంచడం లాంటివే కాబట్టి, ఆన్‌లైను పిటిషన్లు కూడా అందుకు పనిచేస్తాయనే అనుకుంటున్నాను. అన్నట్టు, ఈ ప్రతిపాదనకు ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఒప్పుకున్న వార్త వచ్చింది, చూసే ఉంటారు.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు