5, సెప్టెంబర్ 2008, శుక్రవారం

ప్రభుత్వ భూ కబ్జాను ఎదుర్కోవడం ఎలా?

ప్రత్యేక ఆర్ధిక మండలాలు, కోస్టల్ కారిడార్, ఇంకా ఇతర ప్రాజెక్టుల కొరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా రైతుల భూములు సేకరిస్తోంది. ఒక పద్ధతీ పాడూ లేకుండా జరుగుతున్న ఈ భూసేకరణ వల్ల రైతులు దారుణంగా మోసపోయి రోడ్డున పడుతున్నారు. 
ఇక ముందైనా అలా జరగకూడదనే సదుద్దేశ్యంతో మానవ హక్కుల వేదిక (HRF) వారు ఇటీవల "ప్రభుత్వం మీ భూమి కోసం వస్తే..." అనే ఒక చక్కని పుస్తకాన్ని ప్రచురించారు. పోలేపల్లి సెజ్ వ్యతిరేక ఐక్య సంఘటన వారు తమ బ్లాగులో కూడా దీన్ని ప్రచురించారు.

3 కామెంట్‌లు:

  1. I am impressed. భారతదేశం బాగుపడుతుందని ఎప్పుడో గాని అనిపించదు నాకు (రోజూ మాల్ కి వెళ్ళివచ్చినా) కానీ ఈ సమాచారం వినడానికి బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు. ఇది ఒక కరదీపిక కాగలదు.

    రిప్లయితొలగించండి
  3. మన జనాలు, తమ మంచికోసం జరిగే మార్పు కోరుకోవాలి, తెలుసుకోవాలి, అది వచ్చే దిశగా ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం వైపు వేసే అడుగులు ఏవయినా అభినందించదగ్గవే. ఈ పుస్తకం పరిచయం చేసినందుకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు