పొద్దు నిర్వహించిన
అభినవ భువనవిజయం కవి సమ్మేళనంలో నావీ కొన్ని పద్యాలుండటం నాకెంతో సంతోషం కలిగించింది. ఆ సమ్మేళనానికై సమస్యలను కొత్తపాళీ గారు ఇచ్చారు. ఆయనిచ్చిన సమస్యలలో నాకు బాగా కష్టమనిపించింది - "
గ్లోబలు వార్మింగు యనుచు గోముగ పలికెన్".
తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం గారు ఈ సమస్యను అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అన్వయించి
చక్కటి పూరణ రాసి పంపించారు. కొన్ని ఘోరమైన తప్పులతో నేనూ ఓ పద్యం రాసి పంపించాను. సహజంగానే అది అనుమతికి నోచుకోలేదు.
అంతా అయిపోయాక, సమ్మేళనం సందడి సద్దుమణిగాక, తీరుబడిగా ఒక పద్యం రాసి కొత్తపాళీ గారికి పంపించాను. బానేవుందన్నారు.. అంచేత దాన్ని ఇక్కడ, ఇలా..
నోబెలు పొందిన గోరును
ఆ బహుమతి ఎట్టులొచ్చె యని ప్రశ్నించన్
నోబులుగా నవ్వి యతడు
గ్లోబలు వార్మింగు యనుచు గోముగ పలికెన్