15, ఫిబ్రవరి 2010, సోమవారం

శ్రీకృష్ణ కమిటీ - సరైన మధ్యవర్తి!

7 కామెంట్‌లు
రెండు పక్షాల వారు తమలో తాము సంప్రదింపులు చేసుకుని ఒక అంగీకారానికి వచ్చే అవకాశం కోల్పోయిన ప్రస్తుత పరిస్థితిలో మూడో పార్టీ రంగ ప్రవేశం చేసి మధ్యవర్తిత్వానికి శ్రీకృష్ణ కమిటీని సిద్ధం చేసింది. ’ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమస్యపై సమాజంలోని వివిధ పార్టీలు, వర్గాలతో విస్తృత స్థాయి చర్చలు జరిపేందుకు గాను’ ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దాని పనులేమేంటో కూడా తేల్చింది. కమిటీ విధుల జాబితా మూడు భాగాలుగా ఉంది..

25, జనవరి 2010, సోమవారం

హెచ్చెమ్ టీవీ వరంగల్లు సమావేశం

4 కామెంట్‌లు
రాష్ట్ర విభజనపై హెచ్చెమ్ టీవీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాల్లో తరువాతిది వరంగల్లులో జనవరి 24, ఆదివారంనాడు జరిగింది. సమావేశం బాగా జరిగింది. కొందరు మాట్టాడుతున్నపుడు గోల జరిగిందిగానీ, పెద్దలు శాంతపరచడంతో వెంటనే సద్దుమణిగింది. మిగతా సమావేశాల్లో లాగానే, ఇక్కడ కూడా సరుకున్న ప్రసంగాలు కొన్నే! ఎక్కువ ప్రసంగాలు బాగా నలిగిన పాత సంగతులే చెప్పగా, కొద్ది మంది చేసిన ప్రసంగాలు ఉత్త ఊకదంపుడే!

23, జనవరి 2010, శనివారం

శాస్త్రీయ పుకారు

8 కామెంట్‌లు
నేను మొదటి ఉద్యోగంలో చేరినపుడు ఇండక్షన్ కార్యక్రమం ఒకటి వారంపాటు జరిగింది. మొత్తం ఒక యాభై మందిమి. ఓరోజున ఓ గదిలో కూలేసి కమ్యూనికేషన్స్ నిపుణుడొకాయన క్లాసు పీకుతున్నాడు. కాసేపయ్యాక, ఒక సరదా ఆట ఆడదామని చెప్పాడు. మొదటి వరసలో కూచ్చున్న మొదటి వాడి దగ్గరికెళ్ళి, 'ఇదుగో ఇతని చెవిలో రహస్యంగా ఒక కబురు చెబుతాను. అతడు తన పక్కవాడి చెవిలో ఆ సంగతిని ఊదుతాడు. ఆతడు తన పక్కవాడి చెవిలో చెబుతాడు. అలా చెప్పుకుంటూ వెళ్ళగా, చిట్టచివరి వాడు తనకు చేరిన సమాచారమేంటో బోర్డు మిద రాస్తాడు.' అని చెప్పి, మొదటివాడి చెవిలో ఏదో కబురు చెప్పాడు. దాన్నీ, చిట్టచివరివాడు బోర్డు మీద రాసేదాన్నీ పోల్చి చూస్తాడన్నమాట, ఇదీ ఆట!

21, జనవరి 2010, గురువారం

2010 జనవరి 18 - తెలంగాణ ఉద్యమంలో కంచె అయిలయ్య రోజు!

24 కామెంట్‌లు
తెలంగాణ ఉద్యమంలో 2010 జనవరి 18 న హఠాత్తుగా కులం ప్రసక్తి తలెత్తింది. ఉద్యమ నేతల కులాలను ఎత్తిచూపి, ఎందుకు వాళ్లకింత ప్రాముఖ్యత, దళిత బహుజనులకు ప్రాముఖ్యత ఎందుకు లేదు అంటూ కంచె అయిలయ్య ప్రశ్నిస్తూంటే చర్చలో పాల్గొన్న ఇతర నాయకులు, విశ్లేషక శేఖరులూ కొండొకచో మాటల కోసం తడుముకోవాల్సి వచ్చింది.

19, జనవరి 2010, మంగళవారం

తెలంగాణపై విజయవాడ చర్చ

14 కామెంట్‌లు
రాష్ట్ర విభజనపై హెచ్చెమ్ టీవీ వాళ్ళు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ జరుపుతున్న సమావేశాల వరసలోని మరో సమావేశం విజయవాడలో జరిగింది. జనవరి 17 ఆదివారం సాయంత్రం నుండి అర్థరాత్రి దాకా జరిగిన ఈ సమావేశంలో  మొత్తమ్మీద ఎక్కువమంది సమైక్యాంధ్రనే బలపరచారు. ఇద్దరు ముగ్గురు మాత్రం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలన్నారు.

13, జనవరి 2010, బుధవారం

ది ఫౌంటెన్ హెడ్ - ఎ కొయ్యగుర్రం రైడ్!

25 కామెంట్‌లు
ఆమధ్య, అదేదో ఇంగ్లీషు పుస్తకాలమ్మే కొట్టుకెళ్ళాం. అక్కడ తెలుగు పుస్తకాలు పెద్దగా దొరకవ్. దాని పేరు క్రాస్‌వర్డు అనుకుంటా.  పిల్లలు వెళ్దామన్నారు గదాని వెళ్ళాం. అక్కడ  అయన్ ర్యాండ్  (ఐన్ ర్యాండ్?) రాసిన పుస్తకాలు చూస్తున్నా. అయన్ ర్యాండ్ అని చనువుగా పేరు రాసాను గదా అని నేను ఆవిడ రాసిన పుస్తకాలన్నీ చదివేసి ఉంటానని అనుకునేరు.  ఒక్కటి కూడా చదవలేదు. కానీ నాకావిడ పేరు బాగా తెలుసు -యండమూరి  మనందరికీ ఆవిణ్ణి బాగా పరిచయం చేసాడు గదా! ఆయన రాసిన  కథ ఒకదానిలో  ఒక పాత్ర మరో పాత్రతో అంటుంది.. 'అయాన్ రాండా.. ఆడి కథలు నేను చాలానే చదివాను, నాకు భలే నచ్చుతాయవి' అని అంటాడు. అవతలోడు పెదాలు కాదుగదా, కనీసం ఒంట్లోని ఒక్క అణువు కూడా కదిలించకుండా 'అయన్ రాండంటే ఆడు కాదు, ఆవిడ ' అని అంటాడు. అలా నాకు అయన్ ర్యాండు పరిచయం!

సంబంధిత టపాలు