చిన్నప్పుడు మనం నేర్చుకున్న తప్పులను తరువాత్తరువాత సరిదిద్దుకుంటాం. కానీ ఆ తప్పులు మన మనసులనలాగే అంటి పెట్టుకుని ఉంటాయి, పుట్టుమచ్చల్లాగా. నేను నేర్చుకున్న అలాంటి కొన్ని తప్పులు ఇక్కడ వివరిస్తాను. ఫెయిల్యూరు కథల్లాగా ఇది నా తప్పుల చిట్టా!
20, ఫిబ్రవరి 2007, మంగళవారం
5, ఫిబ్రవరి 2007, సోమవారం
సైంధవులు, శిశుపాలురు, మన పాలిట గుదిబండలు - రాజకీయులు
రాజకీయుల పేకాట, ప్రజల జీవితాలతో చెలగాటం. ఒక దృష్టాంతమిది.
పై ఫోటోలు రెంటినీ ఈనాడు నుండి సేకరించాను.
మొదటి దాన్లో ఏం జరుగుతుందో చూసారుగా. పేకాటాడుతున్నారు ఈ నేతలు -నడిరోడ్డున ! వాహనాలేమీ కదలనీయకుండా దిగ్బంధనం చేసారు. ఈనాడులో వార్త చూడండి.
ఇక రెండో ఫోటో: అనారోగ్యంగా ఉన్న బిడ్డను ఆసుపత్రికి తీసుకు వెళ్ళే తొందర్లో ఉన్న వీరిని పై రకం రాజకీయులు, వారి అంతేవాసులు అడ్డుకుంటే.. నిస్సహాయంగా విలపిస్తున్న దృశ్యం! ఈనాడులో వార్త .
ఇలా రోడ్డును ఆక్రమించి ప్రజల్ని కదలా మెదలనీయక చేసే సైంధవులు ఎక్కువైపోయారీ రోజుల్లో. రాజకీయులు ప్రజలను హింసించడం బాగా పెరిగిపోయింది. ప్రశాంత వాతావరణం లేకుండా చేస్తున్నారు. ఎన్నికలలో టిక్కెట్లు ఇవ్వలేదని, ఎదటి వాడికి ఇచ్చారని ప్రస్తుతం విశాఖలో జరుగుతున్న అల్లరి చూస్తూనే ఉన్నాం. తమ సొంత పార్టీ ఎమ్మెల్యేనే చెంప మీద లాగి ఒక్కటిచ్చాడట ఒకడు (భలే, భలే!!).
ఆ మధ్య శంషాబాదు లోని ఒక స్థలాన్ని అమ్మమంటూ ఆ స్థలం యజమానిని బెదిరించి కిడ్నాపు చెయ్యబూనిన ఒక ఎమ్మెల్యే నిర్వాకాన్ని టీవీలో చూసాం. కానీ ఆ తర్వాత ఇక ఆ సంఘటన ప్రస్తావనే రాలేదంటే దానికి కారణం అర్థం చేసుకోలేనంత పిల్లకాయలమేం కాదు మనం.
గతంలో ఓ అధికారిని చెంప మీద కొట్టిన కేసులో వేణుగోపాలాచారికి కోర్టు శిక్ష కూడ విధించింది, ఈ మధ్య.
తెలంగాణా అంశంపై హద్దులు మీరి మాట్లాడ్డం అందరికీ పరిపాటి అయిపోయింది. లగడపాటి రాజగోపాల్, సర్వే సత్యనారాయణలు తిట్టుకోడం చూసాం. హైదరాబాదులో తిరగలేవని ఒకరంటే, ఏంచేస్తావో చూస్తానని మరొకరు. చివరికి అది తోపులాట దాకా పోతే.., రాజగోపాలు రోడ్డు మీద కూచ్చుని ట్రాఫిక్కును అడ్డగించాడు. తిట్టుకునేది వీళ్ళు, కష్టాలు మాత్రం మనకు!!
రాయలసీమకు వస్తే తిరిగిపోవని పీజేయార్ ను ఆయన పార్టీ నాయకులే బెదిరించడం విన్నాం.
మెదక్ లోనే ఐఐటీ పెట్టాలంటూ నిరాహారదీక్ష చేసిన తెరాస అసమ్మతి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. "తెరాస నాయకత్వానికి దమ్ముంటే బాసరలోనే ఐఐటీ పెట్టాలన్న మాటను ఇక్కడి కొచ్చి చెప్పమనండి" అంటూ సవాలు చేసాడు. అలా చెబితే బహుశా తన అనుయాయుల చేత కొట్టించేవాడు కామోసు!
నాలుగైదు రోజుల కిందట విజయనగరం జిల్లాపరిషత్తు సమావేశంలో అధ్యక్ష స్థానం పైకి మంచి నీళ్ళ సీసాను విసిరేసిన కళావెంకటరావు ఫోటోను యాక్షను సహితంగా ఈనాడులో చూసాం. (ఆయన గారి మనవడో మనవరాలో "అదేంటి తాతా, అది తప్పు కదా?" అని అడిగుంటే ఏమని సమాధానం చెప్పేవాడో మరి!!?)
ఈ రాజకీయుల వలన మనకు ప్రయోజనమేమో గానీ, నష్టాలు మాత్రం బోలెడున్నాయి. మనుషులను, మనసులను విడగొట్టడంలో ముత్యాలముగ్గు రావుగోపాలరావు వీళ్ళకు చాలడు. బూతులు తిట్టుకోడం, చట్టసభల్లో తిట్టుకోడాలు, కొట్టుకోడాలు.. ఇవన్నీ చూస్తే శిశుపాలుడు కూడా వీళ్ళ ముందు బలాదూరే అని అనిపిస్తుంది! మనం వీళ్ళ తప్పులను ఎన్నిటిని క్షమించాలో!?
(రాజకీయుల దుష్ప్రవర్తనలపై గతంలో నే రాసిన జాబు - ఏమిటీ ధోరణి కూడా చూడండి.)

4, ఫిబ్రవరి 2007, ఆదివారం
మానవత!
ముక్కు పెరిగిపోయిన బాలుడి గురించి ఈనాడులో చదివి మనసు చివుక్కుమంది. ఆ మరుసటి రోజే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, అన్ని ఖర్చులూ భరించి వైద్యం చేయించడానికి ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వపు మానవీయ కోణమిది.
ఈనాడులో ఇస్కాన్ వారి అక్షయపాత్ర కార్యక్రమం గురించి చదివాను. ఎంతో సంతోషం కలిగింది. చాలా ఉదాత్తమైన కార్యక్రమం. ఇస్కాన్ నిర్వహిస్తున్న బృహత్తర యజ్ఞమిది.
రాష్ట్ర ప్రభుత్వానికీ, ఇస్కాన్ కూ అభినందనలు!

31, జనవరి 2007, బుధవారం
ఊరు బడి చెబుతుంది ఏలుబడి తీరు!
ఆంధ్రజ్యోతి లో జనవరి 31 న ఓ వ్యాసం వచ్చింది. ప్రభుత్వ బడుల గురించి లోక్‌సత్తా నాయకుడు వర్మ రాసిన వ్యాసమిది. పైనున్న శీర్షిక పేరు కూడా ఆయన పెట్టిందే. ప్రభుత్వ బడుల గురించిన గణాంకాలను రాసారీ వ్యాసంలో. అందులోంచి ఒక్క విషయాన్ని నేనిక్కడ రాస్తాను. "రాష్ట్రంలో 20 శాతం ఉపాధ్యా యులు తక్కువగా ఉన్నారు. అదనంగా 54, 730 మంది ఉపా ధ్యాయుల అవసరం ఉందని 'కాగ్' నివేదిక పేర్కొంది. వీరికి బదులుగా 46,544 మంది విద్యా వాలంటీర్లు నెలకు 1000 రూపాయల వేతనంపై బోధనా విధులు నిర్వర్తిస్తున్నారు. " వెయ్యి రూపాయల జీతంతో బడి పంతుళ్ళట.. హవ్వ!
ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వారు చదివేది ఈ బడులలోనే! ఈ వర్గాల పట్ల ప్రభుత్వ ఆపేక్ష ఈ స్థాయిలో ఉంది. అందరికీ చదువు, సరైన చదువు చెప్పించే విషయంలో మన ప్రభుత్వాలకేమాత్రం ఆసక్తి ఉందో ఈ గణాంకాలు చెబుతాయి. ప్రస్తుత ప్రభుత్వం సంగతి మాత్రమే కాదు, వరసగా అన్నిటి తీరూ అంతే!
బడులూ, పంతుళ్ళు, భవనాలు, సదుపాయాల విషయంలో ప్రభుత్వ నిర్వాకం ఇలా ఉంది. ఓపక్క ఇంత అధ్వాన్నంగా పనిచేస్తూ, ఎడాపెడా రిజర్వేషన్లు పెంచుకుంటూ పోతూ ఉంటే వాటి వలన ఆశించిన ఉపయోగం కలుగుతుందా?
ఈ చేతకానితనానికి తోడు, ఇప్పుడు ప్రభుత్వం, ప్రైవేటు వాళ్ళతో కలిసి కాన్సెప్టు బళ్ళేవో పెడతుందట. ఈ సంకర బడులు వద్దని పెద్దలు చెబుతున్నారు.
ఊరు బడి చెబుతుంది ఏలుబడి తీరు - ఎంత చక్కటి మాట!

29, జనవరి 2007, సోమవారం
తెలుగు సినిమా - 75 ఏళ్ళ పండుగ
మొదటి తెలుగు సినిమా నిర్మించి 75 ఏళ్ళయిన సందర్భంగా పడుగ చేసారు. బాగానే చేసారు. మూడు రోజుల పాటు అట్టహాసంగా జరిగిన పండుగలో మూడోనాడు వాళ్ళలో వాళ్ళకి ఉన్న విభేదాలు వికటాట్టహాసం చేసాయి.
పండుగలో కొన్ని విశేషాలు:
కాలనాళిక: మరో పాతికేళ్ళ తరువాత, తెలుగు సినిమా ఎలా ఉండబోతోందన్నది ఎవరి ఊహకు తగినట్లుగా వాళ్ళు ఓ కాగితంపై రాసి ఓ పెట్టెలో వేస్తారు. అలా అందరూ రాసాక, ఆ పెట్టెకు సీలేసి, పాతికేళ్ళ తరువాత, అంటే తెలుగు సినిమా వందేళ్ళ పండుగ రోజున తీస్తారు. ఆనాటి పరిస్థితిని ఇప్పటి వాళ్ళు ఎంతవరకు ఊహించగలిగారు అనేదాన్ని అంచనా వేస్తారన్నమాట. చక్కటి ఆలోచన! ఈ కాలనాళికను ఓ పదిహేను రోజుల పాటు చాంబరులో ఉంచి సినిమా వాళ్ళందరి ఊహలను సేకరించి ఆపై పదిలపరుస్తారు.
సన్మానాలు: పాత తరం నటులను సన్మానించే కార్యక్రమం. నిర్మలమ్మ, అంజలీదేవి, కాంతారావు వంటి వారిని గౌరవించడం సముచితంగా ఉంది. ఆ జాబితాలో ఉండాల్సిన వారు కొందరు కనిపించలేదు, ఎంచేతో? రావి కొండలరావును మిస్సయ్యారు. (లేక నేను మిస్సయ్యానా?)
వేదిక నిర్వాహకులు: మూడోరోజు కార్యక్రమాన్ని రాజేంద్రప్రసాదు సరిగ్గా నిర్వహించలేదు. సన్మానం జరిగేదొకరికైతే ఈయన చెప్పేదింకొకరి పేరు. మధ్యలో అక్కడక్కడా వెకిలి చేష్టలు కూడా జోడించి వీలయినంతగా చెడగొట్టాడు. చప్పట్లు కొట్టమంటూ బతిమిలాట్టం ఈయనకో అలవాటులా ఉంది.
ఆటాపాటా: వెకిలి పాటలని కాస్త తగ్గించి మంచి పాటలను మరిన్ని కూర్చాల్సింది.
హుందాతనం: - అనగా జయసుధ! తనకు సన్మానం జరిగాక మాట్లాడమంటే ఆమె మాట్లాడింది మూడే మాటలు. నన్ను పరిచయం చేసిన కృష్ణ, విజయనిర్మలలకు, దర్శకులు దాసరి, రాఘవేంద్రరావులకు, తోటి నటీనటులు, దర్శకులు, సాంకేతికులు అందరికీ నా ధన్యవాదాలు.- ఇంతే! కొందరు మాట్లాడిన సోది విన్న తరువాత ఇది చాలా హాయిగా అనిపించింది.
మెరుపులు:
(యాంటీ) క్లైమాక్సు: తెలుగు సినిమా ప్రముఖులను, లెజెండ్లను సన్మానించే కార్యక్రమాన్ని గొప్ప ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక, పరిశీలనాత్మక కార్యక్రమంగా మార్చేసారు మన తెర వేల్పులు. అసలు లెజండు, సెలెబ్రిటీ అనగానేమి అంటూ అర్థాలు అడగడం మొదలు పెట్టి ప్రేక్షకులకు ఎంతో విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేసారు. ఎంతో ఉద్వేగాన్ని అభినయించారు. కళ్ళనీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఆపై కాలనాళికలో శాలువాలు, జ్ఞాపికలనూ వేసి మొత్తం నాటకాన్నంతటినీ రక్తి కట్టించారు. మొత్తమ్మీద సరదాగా సంతోషకరంగా జరగాల్సిన కార్యక్రమంలో మెలోడ్రామాను చొప్పించి, కార్యక్రమాన్ని తమ సినిమాల స్థాయికి దిగజార్చారు.
పంపిణీదారు: మాటీవీ బాగానే డబ్బులు చేసుకుని ఉండాలి. దురదృష్టవశాత్తూ ప్రకటనల మధ్య అప్పుడప్పుడు కార్యక్రమాన్ని చూపించాల్సి వచ్చింది గానీ లేకపోతే డబ్బుతో దిబ్బేసుకు పోయేవారే!
పండుగ డైలాగు: "ఇంత పెద్ద ఏర్పాట్లలో కొన్ని లోపాలు దొర్లడం సహజం" (చట్టం తనపని తాను చేసుకు పోతుంది అనే డైలాగు పదే పదే గుర్తొచ్చింది.)

- పద్మనాభం పాడిన పాట. పాట విడిగా విని తరువాత వ్యక్తిని చూస్తే "పాడిన వ్యక్తి ఇంత ముసలివారా" అని అనుకోక మానరు. చాలా చక్కగా పాడారు.
- నిర్మలమ్మ చక్కగా మాట్లాడింది.
- సునీల్ చేసిన మైము. చక్కగా చేసాడు.
- తలకు మాసిన సన్మానం స్కిట్: ఇందులో గుండు హనుమంతరావు హావభావాలు బాగున్నాయి.
- సుమ కబుర్లు: ప్రేక్షకుల్లో కూర్చున్న సినిమా వాళ్ళతో మాట్లాడుతూ సుమ కొన్ని మంచి కబుర్లు చెప్పించింది.
(యాంటీ) క్లైమాక్సు: తెలుగు సినిమా ప్రముఖులను, లెజెండ్లను సన్మానించే కార్యక్రమాన్ని గొప్ప ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక, పరిశీలనాత్మక కార్యక్రమంగా మార్చేసారు మన తెర వేల్పులు. అసలు లెజండు, సెలెబ్రిటీ అనగానేమి అంటూ అర్థాలు అడగడం మొదలు పెట్టి ప్రేక్షకులకు ఎంతో విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేసారు. ఎంతో ఉద్వేగాన్ని అభినయించారు. కళ్ళనీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఆపై కాలనాళికలో శాలువాలు, జ్ఞాపికలనూ వేసి మొత్తం నాటకాన్నంతటినీ రక్తి కట్టించారు. మొత్తమ్మీద సరదాగా సంతోషకరంగా జరగాల్సిన కార్యక్రమంలో మెలోడ్రామాను చొప్పించి, కార్యక్రమాన్ని తమ సినిమాల స్థాయికి దిగజార్చారు.
పంపిణీదారు: మాటీవీ బాగానే డబ్బులు చేసుకుని ఉండాలి. దురదృష్టవశాత్తూ ప్రకటనల మధ్య అప్పుడప్పుడు కార్యక్రమాన్ని చూపించాల్సి వచ్చింది గానీ లేకపోతే డబ్బుతో దిబ్బేసుకు పోయేవారే!
పండుగ డైలాగు: "ఇంత పెద్ద ఏర్పాట్లలో కొన్ని లోపాలు దొర్లడం సహజం" (చట్టం తనపని తాను చేసుకు పోతుంది అనే డైలాగు పదే పదే గుర్తొచ్చింది.)
24, జనవరి 2007, బుధవారం
కార్పొరేటు చిల్లర కొట్లు
దేశంలో చిల్లర కొట్ల విప్లవం వస్తూంది. రిలయన్సులూ, టాటాలు చిల్లర కొట్లు పెట్టేస్తున్నారు. ఎక్కడ చూసినా సూపరు బజార్లే! కూరగాయలను కూడా వదలడం లేదు. ఇలా కార్పొరేటు చిల్లర కొట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి, సాధారణ కొట్లు తాళాలేసుకునే పరిస్థితికి వస్తాయేమోననిపిస్తోంది.
కార్పొరేటు కొట్లలో ధరలు తక్కువగా ఉన్నాయంటున్నారు. ఇదే మొదలు కాబట్టి అలా ఉండొచ్చు. కానీ అవి తామరతంపరగా పెరిగిపోయి, సన్నకారు దుకాణాలు మూలన పడ్డాక, అప్పుడు ఈ కార్పొరేట్లు తమ అసలు రంగును బయట పెడితే మన పరిస్థితి ఏమిటి? ప్రభుత్వాన్నే అదుపు చెయ్యగల సంస్థలవి. మనం ఎదుర్కోగలమా!? సిమెంటు రేట్లు తగ్గిపోయినపుడు కంపెనీలన్నీ కలిసి ఉత్పత్తి తగ్గించి రేట్లను పెంచాయలాగే!
ఈ కార్పొరేటు చిల్లరకొట్లు మనలనెక్కడికి తీసుకెళతాయో!! టోకు దుకాణాలకు మాత్రమే కార్పొరేట్లను పరిమితం చేసి, చిల్లర రంగంలోకి వాళ్ళను అనుమతించకపోతే మంచిదనిపిస్తోంది.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
సంబంధిత టపాలు
loading..