ఒక విషయం గమనించారా? బ్లాగుస్పాటులో పైన లింకుల పట్టీలో చివరన ఉన్న NEXT BLOG అనే లింకును చూసారా? అది నొక్కితే అప్పుడే తాజాకరించిన బ్లాగు మనకు కనిపిస్తుంది. నేను స్టాటుకౌంటరు గణాంకాల్లో చూస్తూ ఉంటాను, ఏ సంబంధమూ లేని బ్లాగుల నుండి నా బ్లాగుకు లింకులు వస్తూ ఉంటాయి. గమనించగా తేలిందిది.. నా బ్లాగులో నేను కొత్త జాబు పెట్టీ పెట్టగానే వచ్చిన ఈ అనుకోని అతిథులు (తిథి లేకుండా వచ్చేవారే కదా అతిథులు) ఆ లింకు ద్వారానే వచ్చారని! వాళ్ళు తమ బ్లాగుల్లో NEXT BLOG నొక్కిన సమయానికి నేను నా బ్లాగును తాజాకరించి ఉంటాను. ఏదేమైనా మన బ్లాగుకు ట్రాఫిక్కు పెరుగుతోంది, సంతోషమే కదా!
అనుకోని అతిథీ! స్వాగతం!!
ఏంటి, మీకీ సంగతి తెలుసా!? అయినా పర్లేదు, నే రాస్తాను. నేను వికీపీడియా వాడిని.. ఏదీ చిన్న విషయం కాదు, తెలుసు కాబట్టి మనకది చిన్నది, తెలియని వారికి.. అది పెద్దదే, తెలుసుకోవలసిన విషయమే.
23, ఆగస్టు 2006, బుధవారం
22, ఆగస్టు 2006, మంగళవారం
రాజీనామా ఎందుకు చేసారబ్బా!?
తెరాస కేంద్ర ప్రభుత్వం నుండి బయటికి వచ్చేసింది
ఏదో ఒక రోజున జరగాల్సిందే! కాస్త ముందు జరిగినట్లు అనిపిస్తోంది. ఇప్పుడెందుకు రాజీనామా చెయ్యాల్సి వచ్చింది? కారణాలు వెతకగలమా!?.
1. ప్రజల్లో సన్నగిల్లుతున్న నమ్మకం: ఇది కారణం అని అనిపించడం లేదు. నమ్మకం సడలుతున్న మాట వాస్తవమే గానీ అది కేవలం తాత్కాలికం. తెలంగాణను కాగితాల మీద నుండి వాస్తవ రూపానికి తెచ్చే క్రమంలో విజయానికి అతి చేరువగా వచ్చింది, తెరాస. పైగా తెలంగాణ కోరుతున్న నాయకుల్లో కె.సి.ఆర్ అంతటి వాగ్ధాటి, ప్రజాదరణ, రాజకీయ చాతుర్యం ఉన్న నాయకుడు మరొకరు లేరు. ఈ ఎరుక ప్రజలకు ఉంది.
2. మేథోవర్గం వత్తిడి: కేసీఆర్కు ఇప్పటి వరకు వెన్నుదన్నుగా ఉన్న మేథోవర్గం ఆయన్ను వీడి, ప్రత్యేకంగా ఉద్యమించే అవకాశాలు కనిపించి ఉండొచ్చు. వాళ్ళు ప్రజానాయకులు కాకపోవచ్చు గానీ, ప్రజల్లో గౌరవం ఉన్నవారు! మధ్యతరగతి, ఉన్నత వర్గాల్లోనూ, ఎన్నారైలలోను మద్దతు కూడాగట్టడంలో వీరు ప్రముఖ పాత్రే పోషించారు. ఈ సైద్ధాంతిక బలాన్ని తెరాస వదులుకోజాలదు. ఇది ఒక కారణం కావచ్చు.
3. కాంగ్రెసు తెరాసను వదిలించుకునే సూచనలు: దీనికి అవకాశం లేదు. బలహీనపడిన తెరాసను వదిలించుకోవాల్సిన అవసరం లేదు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెసుకు ఇలాంటి పనులు ఆత్మహత్యా సదృశమే!
4. కేంద్రానికి మధ్యంతర ఎన్నికల సూచనలు: ఒకవేళ అటువంటి సూచనలే గనక కనిపించి ఉంటే, కేసీఆర్ ప్రాప్తకాలజ్ఞతతో ఈ పని చేసినట్లే! ఇప్పటికే స్థానిక ఎన్నికలలో తగిలిన దెబ్బలకు బొప్పి కట్టిన తెరాస మరో ఎన్నికలకు కాంగ్రెసుతో కలిసి పోజాలదు. తప్పనిసరిగా సొంత బలంపైనే ప్రజల్లోకి వెళ్ళాలి. కానీ.. 'మధ్యంతర' సూచనలు ఏమీ కనిపించలేదే! ఒక్క ఆ సర్వే తప్ప (మధ్యంతర ఎన్నికలు పెడితే కాంగ్రెసు లాభపడుతుందని ఓ సర్వే తెలిపింది)
5. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో తెరాస మద్దతుకు గండి కొడుతోంది: "తెలంగాణ ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేసి, కాంగ్రెసు ప్రజల అభిమానాన్ని పొంది ప్రజలను పూర్తిగా తనవైపు తిప్పుకుంటోంది. దాంతో తెరాస ప్రాబల్యం తీవ్రంగా దెబ్బతింటోంది." ఈ వాదనను కాంగ్రెసు వాళ్ళు కూడా నమ్మరు. కేసీఆర్ నమ్మే ప్రశ్నే లేదు.
6. తెలుగు దేశం బలపడుతోంది: నిజమే, ఆందోళన చెందవలసిన విషయమే! ఆందోళన చెందాల్సింది ఇప్పటికే జరిగిన దాని గురించి కాదు, ముందు ముందు దేశం మరింత బలపడటం గురించి. ముందే మేలుకుని ఉద్యమాన్ని మళ్ళీ నిర్మించుకోక పోతే దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఇది ఒక కారణం కావచ్చు.
7. ఎన్నికల సమాయత్తం: మధ్యంతర ఎన్నికలు వచ్చి ఎన్నికలు ముందుకు జరిగితే తప్ప, హడావుడి పడాల్సిన పనిలేదు. మరో రెండున్నర ఏళ్ళ పాటు ఉద్యమాన్ని నడపాలంటే మాటలు కాదు. మధ్యంతర ఎన్నికలు వస్తాయనే నమ్మకం ఉంటే తప్ప ఇది కారణం కాబోదు.
8. జయప్రకాశ్ నారాయణ కొత్త పార్టీ: ప్రస్తుతానికి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. పైగా అది తెలంగాణేతరుల పార్టీ కాదని ప్రజలు నమ్మాలంటే ప్రముఖ తెలంగాణా వాదులు అందులో చేరాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడప్పుడే దాని గురించిన భయం లేదు.
ఇప్పుడేం చేస్తారు: మరి తెరాస ఇప్పుడేం చెయ్యబోతోంది? హింసాత్మక ఉద్యమమా? లేక ఇదివరకటిలా శాంతియుతంగా ఉద్యమాన్ని నిర్మించుకు రావడమా? రెండోదే చేస్తారని అనిపిస్తోంది. హింసాత్మక ఉద్యమం తాటాకు మంట లాంటిదే ననీ, ఎక్కువ కాలం మనజాలదనీ కేసీఆర్ కు తెలియనిది కాదు.
సవాళ్ళు:
ఏదేమైనా రాబోయేది కేసీఆర్ కే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు కూడా గడ్డుకాలమే! మాధ్యమాలకు బోల్డంత సరుకు!

- రాబోయే మూడు నాలుగు నెలలు కేసీఆర్కు చాలా కీలకం. ప్రజల్లో తనకున్న ఆదరణను మళ్ళీ ఈ కాలంలో నిరూపించుకోలేకపోతే, పార్టీ నాయకులను తన వెనక నడిపించుకోవడం చాలా కష్టం. పైగా తెరాసను ముక్కలు చేసేందుకు కాంగ్రెసుకు ఇక ఏ అడ్డూ లేదు. ఇది కేసీఆర్ కు అతిపెద్ద సవాలు.
- ఎన్నికలు మామూలు సమయానికే జరిగితే, అప్పటి దాకా ఉద్యమాన్ని నిర్వహించడం మరో సవాలు.
- తమకూ కాంగ్రెసుకూ మధ్య ఒప్పందం వివరాలేమిటో చెప్పి కాంగ్రెసు మోసం చేసిందని, తన తప్పేమీ లేదనీ, ప్రజలకు తెలియజెప్పాలి. ఇది ఒక చిన్న సవాలు.
- ప్రస్తుతం కేసీఆర్ బలం తగ్గింది, నరేంద్ర బలం పెరిగింది (సాపేక్షికంగా). నరేంద్రను జాగ్రత్తగా సమర్ధించుకుంటూ వెళ్ళాలి... మరీ ముఖ్యంగా పార్టీలోని అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో! అదీ ఓ సవాలే! అధికారం లేని వేళ అది పెద్ద సవాలు!! అయితే ప్రజల్లో తనకున్న ఆదరణను నిరూపించుకుంటే అదోపెద్ద సమస్య కాకపోవచ్చు.
ఏదేమైనా రాబోయేది కేసీఆర్ కే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు కూడా గడ్డుకాలమే! మాధ్యమాలకు బోల్డంత సరుకు!
20, ఆగస్టు 2006, ఆదివారం
వికీపీడియా ఎందుకు చూడాలి?
అష్టవిధ వివాహాలు ఏమేంటో మీకు తెలుసా?
దశావతారాలేమేంటి?
"చూపితివట నీనోటను.., బాపురే! పదునాల్గు భువనభాండంబుల.." పాట వినని తెలుగువాడుండడు. ఏమిటా 14 భువనాలు?
పంచభక్ష్యాలతో, షడ్రసోపేతమైన భోజనం గురించి విన్నాం, తిన్నాం. ఏమిటా పంచ భక్ష్యాలు, షడ్రసాలు?
వీటన్నిటి గురించి తెలుసుకోవడం ఇప్పుడిక బహు తేలిక! తెలుగు వికీపీడియా చూడండి. ఏకోనారాయణ దగ్గరనుండి, అష్టాదశపురాణాల దాకా, ఎనలేనివి ఎన్నదగినవీ అయిన వ్యాసాలెన్నో ఉన్నాయి అక్కడ. ఆ వ్యాసాలు చూడండి, మీకు తెలిసిన విషయాలు రాయండి. వికీ యజ్ఞంలో పాలుపంచుకోండి.
ఈ వ్యాసాలకు కర్తలు త్రివిక్రమ్ , వైఙాసత్య , కాసుబాబు లకు అభినందనలు. ఓ చెయ్యేసిన ఇతర వికీజీవులకూ అభినందనలు. వీరంతా వికీపీడియా ప్రాముఖ్యతను మరో మెట్టు ఎక్కించారు. శభాష్!

పదాలు, దపాలు
ఓ పదం.. ఆ పదంలోని హల్లులను అటూఇటూ మారిస్తే మరో అర్థవంతమైన పదం. హల్లులు స్థానాలు మారతాయి గానీ, గుణింతం మాత్రం యథాస్థానంలోనే ఉంటుంది. దాంతో ఆ రెండు పదాలను పలికే తీరు (శబ్దం) ఒకే రకంగా ఉంటుంది. ఉదాహరణకు మోహము, హోమము. రెండింటిలోని హల్లులు - మ, హ, మ - అటూ ఇటూ అయ్యాయి. గుణింతం మాత్రం స్థానం మారలేదు. (ఇంగ్లీషులో అనాగ్రం అనే పదముంది. ఒక పదంలోని అక్షరాలన్నిటితో కూర్చిన మరో పదం లేదా పదబంధాన్ని అనాగ్రం అంటారు.) కానీ ఈ పదాల్లో హల్లుకు ఉండే గుణింతం మారిపోతుంది. అంచేత ఇవి అనాగ్రం లు కావు. వీటినేమనాలో!!? (అనాగ్రంలు కానివి - అగ్రంలు :-) ) అయితే ఈ పదాల RTS స్పెల్లింగు (hOmamu - mOhamu) మాత్రం అనాగ్రమే!
15, ఆగస్టు 2006, మంగళవారం
వెంటాడే జ్ఞాపకాలు
కొన్ని విషయాలుంటాయి. ఎప్పుడో ఓసారి యథాలాపంగా వాటి గురించి తెలుసుకుంటాం. అప్పటికి వాటిని వదిలేస్తాం. కానీ, తరువాత ఆ విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. మళ్ళీ ఓసారి వాటి గురించి తెలుసుకుందామని అనుకుంటాం గానీ తెలుసుకోలేం. ఎక్కడా వాటి గురించిన సమాచారం దొరకదు. దాంతో అవి తెలుసుకోవాలన్న యావ పెరిగిపోతుంది. అలాంటిది నాకు ఒకటుంది.
ఎప్పుడో కనీసం ఓ పాతికేళ్ళ కిందటి విషయమై ఉంటుంది. రేడియోలో ఓ పాట విన్నాను. సినిమా పాట కాదు. ముసలి , నిరుపేద దంపతులు తమ కొడుకును తలుచుకుంటూ అతన్ని ఉద్దేశించి పాడే పాట అది. ఆరుగాలం శ్రమించి కొడుకును పెద్ద చదువులు చదివిస్తే, అతడు 'పెద్దవాడై' వీళ్ళను పట్టించుకోడు. ఆ బాధతో వాళ్ళు పాడే పాట అది. గుండెను మెలిదిప్పే పాట. ఓ రెండు వాక్యాలు మాత్రం గుర్తున్నాయి -
"కళ్ళజోడూ పెట్టుకోనీ నల్ల బూడుసు తొడుక్కోని,
కొడుకో బంగారు తండ్రీ... నిను కలకటేరు అనుకుంటిరో"
ఇలా సాగుతుంది, ఆపాట.
ఇలాంటిదే ఇంకో పాటుంది.. తన సొంత ఊరి గురించి ఒకతను పాడుకునే పాట అది.. చాలా బాగుంటుంది. అక్కడక్కడా ఓ రెండు పాదాలు గుర్తున్నాయి.
ఏటి గట్టు మీద ఉంది మాఊరు..
...
...
మాఊరు ఒకసారి వెళ్ళి రావాలి.
ఈ పాటలు ఎక్కడ దొరుకుతాయో మీకు తెలిస్తే నాకో ముక్క రాయండి, నేనూ కొనుక్కుంటాను. నాకు తెలిస్తే ఇక్కడ రాస్తాను. (ఎప్పుడో ఒకప్పుడు దొరక్కపోవు.)
మీకూ ఇలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా?

14, ఆగస్టు 2006, సోమవారం
నేడే స్వాతంత్ర్య దినం.. వీరుల త్యాగఫలం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
సంబంధిత టపాలు
loading..