12, జులై 2011, మంగళవారం

నూరు గొడ్లను తిన్న రాబందు..

జగను అక్రమంగా ఆస్తులను సంపాదించాడని మంత్రి శంకర్రావు రాసిన లేఖనే ఫిర్యాదుగా తీసుకుని, రాష్ట్ర హైకోర్టు విచారించి, సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని ఆదేశించింది.

రాశేరె ముఖ్యమంత్రిగా ఉండగా తన అధికారాన్ని వాడుకుని, కొడుకుతో కలిసి వేల కోట్లు నొక్కేసాడని ఆరోపణలున్నాయి. కోర్టు ఇచ్చిన ఆదేశం జగను సంపాదనపై విచారణ కోసమే అయినప్పటికీ, నిజానికిది రాశేరెపై వచ్చిన దోపిడీ ఆరోపణలపై విచారణ. జగను కట్టిన పన్నులు, అతడు కట్టించిన ఇళ్ళు, అతడు మొదలెట్టిన వ్యాపారాల వంటి దృష్టాంతాలను గమనిస్తే, ఈ ఆరోపణల్లో నిజం ఉండే ఉంటుందని అనిపిస్తుంది. మేళ్ళు చేస్తాం, మేళ్ళు చేస్తాం అంటూ ఊళ్ళు మేసేసారని, బతికుండగానే జనాన్ని పీక్కుతిన్నారనీ అనుమానం కలక్క మానదు.

ఐదారేళ్ళలో అఖండ ఐశ్వర్యాన్ని ఎట్టా సంపాదించారనేది ఈ విచారణలో తెలుస్తుందని, బాబూ కొడుకులు కలిసి రాష్ట్రాన్ని దోచేసుంటే, ఏమేరకు దోచుకున్నారో బయటపడుద్దనీ కోరుకుందాం.

నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకుపోతుంది అని మనకో సామెత ఉంది. కోర్టు ఇచ్చిన ఇటువంటి ఆదేశాలే గాలివానలుగా మారి, మనల్ని పీక్కుతినే రాబందుల ఆట కడుతుందని, దోపిడీ దొంగల నిజస్వరూపాలు బైటికొస్తాయనీ ఆశిద్దాం.

11 కామెంట్‌లు:

 1. Don't decide yourslf!!
  Do you know Jagan is guilty???
  నూరు గొడ్లు అంటూ మొదలెట్టకు శిరీష్ !!! ఇంకోటి గుర్తుపెట్టుకో " ఏనుగు వెళ్తుంటే కుక్కలు ఎన్నో అరుస్తాయి "

  రిప్లయితొలగించండి
 2. నూరు గొడ్లంటే కచ్చితంగా నూరని కాదులే శ్రీనివాసూ, నువ్వు మరీ బాధ పడిపోకు. ఓ పది అటూ ఇటూగా కావచ్చులే! ఇహపోతే.., విమర్శించేవాళ్ళ మీదబడి కరిచెయ్యడానికి నీబోంట్లు జగను గేటు దగ్గరే కాచుకుని ఉండగా జగనుకు దిగులేముందిలే!

  రిప్లయితొలగించండి
 3. శ్రీనివాసు,

  2G కేసు సుప్రీం కోర్ట్ మొదెలెట్టకముందు కూడా, మా తమిళ మిత్రుడు ఇదే అన్నాడు, మా తమిళ తంబిల మీద ఏడుపుతో అంటున్నారు కాని, మా రాజా నిజమయిన రాజా, ఎదో ఇది అంతా పిచ్చి సుబ్రహ్మణ్య స్వామి అరుపులు అని :)

  అయినా, శంకర్రావు ఎమీ సుబ్రహ్మణ్యస్వామి కాదు కదా, మన కాంగీ వాడేగా, పెద్దగా కంగారు పడాల్సింది ఏమీ లేదులే!!

  మడమ తిప్పని మన మహా నాయకుడు అల్లుడును బయటపడేయటం కోసమో, ఇంకోదానికోసమో చంద్రబాబు మీద కేసును మధ్యలో వదులేసుకొన్నట్లు, శంకర్రావు వదిలేసుకోలేడా?

  రిప్లయితొలగించండి
 4. మన దగ్గర నీతిమంతులు, మడిగట్టుకు కూర్చున్న వాళ్ళూ ఎవ్వరూ లేరు. అందరూ ఆతానులో ముక్కలే. కనీసం ఒకరి మీద ఒకరు బురదజల్లుకొనే ఈ కార్యక్రమములో నన్నా .. నిజాలు వెలుగు చూసి, అవినీతి రాబందులకు శిక్షలు పడితే బావున్ను. కనీసం, కొంతలో కొంతైనా .. మంచి జరుగుతుంది.

  జూ.మహానాయకా .. హమారే పాస్ అసల్ది ఉంది హై..!!

  నేనూ దీని మీదే నాకు నచ్చినట్టు ఒక టపా బ్లాగాను చూడండి..!!

  రిప్లయితొలగించండి
 5. ఇప్పుడు తుఫానులు అంతా కూడా గ్రాఫిక్సేమోనని కొద్ది అనుమానం

  రిప్లయితొలగించండి
 6. మంచి పరిణామమే గానీ జగన్ ని పట్టుకోవడం ఎవఱి తరమూ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే అది ఏకముఖీనంగా జఱిగిన అవినీతి కాదు. బహుముఖీన అవినీతి.. అదొక కో-ఆపరేటివ్ అవినీతి మహాయజ్ఞం.

  జగన్ తండ్రి ద్వారా తెలుగుప్రజల డబ్బు అనేక వేలకోట్లుగా (అక్షరాలా మొత్తం 25,000 కోట్లంటున్నారు రాజకీయ పండితులు) కాంగ్రెస్ అధిష్ఠానానికి ప్రతినెలా అందింది. ఆ అధిష్ఠానం తన దగ్గఱ ఎప్పుడెప్పుడు, ఎంతెంత డబ్బు, ఏయే మార్గాల్లో దోచిందీ అన్నిటికీ పక్కా లెక్కలు వ్రాసిపోయాడట చచ్చిపోయిన మహాపీత. ఆ లెక్కలన్నీ జగన్ దగ్గఱున్నాయని వినికిడి. అందుచేత వాళ్ళు జగన్ వెంట్రుకల్లో ఒక్కటి కూడా పీకలేరు. అందుకనే ఈరోజు దాకా ఏమీ పీకలేకపోయారు. అతన్ని బయటికి లాగుదామనుకుంటే అనేక వందలమంది బయటికి రావాల్సి వస్తుంది. వాళ్ళల్లో సోనియాగాంధీతో సహా ఇప్పటి కేంద్ర మంత్రివర్గంలో సగం మందైనా ఖచ్చితంగా బుక్కవుతారు. కాబట్టి ఈ విచారణ అంతులేని శవజాగరణగానే మిగిలిపోయే అవకాశాలు హెచ్చు.

  రిప్లయితొలగించండి
 7. అవినీతి సొమ్మును బయటకు లాగడం కన్నా జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయడమే లక్ష్యంగా కనపడుతుంది. తాడేపల్లివారన్నట్టు శవజాగరణ జరిగినా దాచిపెట్టుకున్న సొమ్ములు లాగేసుకొని జగన్‌ను ఒంటరి చేసినా చాలు పెద్దతలకాయలు అనుకున్నది సాధించడానికి

  రిప్లయితొలగించండి
 8. నూరు గొడ్లేమిటండీ.. మందలు మందలు టోకుగా తినేశారు. ఏ ఎంక్వయిరీకైనా సిద్ధమే అనేవాళ్ళు CBIతో ప్రాథమిక ఎంక్వయిరీని ఆపడాని శతవిధాల ప్రయత్నించి, విఫలురై, చివరకు 'స్వాగతిస్తున్నాము' అనక తప్పింది కాదు. :)

  LBSగారు, మీరన్నది వాస్తవమే కావచ్చు, ఏదో ఎంతో కొంత ఆ దిశగా పడ్డ అడుగు.

  'వేలకొద్ది నన్ను చేరువారిలో ఏ ఒక్కరినే అనుగ్రహిస్తున్నాను' - తిహార్ జైలు :))

  రిప్లయితొలగించండి
 9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 10. jagan bhakthula ku andaru avineethi parule. Jagan thinte thappemundi jagan chala manchi vadu nammukunnodiki emaina cheshadu ane abhiprayam undi. Kani andaru avineethi parulanu engili methukulu nake kukkala lage chusetappudu Jagan mathram enduku manchi avuthadu?. Nammina vadiki edaina cheyatam manchide. Kakapothe adi evari sommutho ani chudali. Valla sommu tho enni mellu chesina parvaledu kani rastranni tokuga corporate laku doche vaalllanu samarthisthe mundu tharala vallu thittedi Jagan lanu kadu Motham andarini

  రిప్లయితొలగించండి
 11. జగన్ వందల కోట్లు ఎలా సంపాదించాడో శ్రీనివాస్ గారి లాంటి విధేయులకి తెలీదంటారా మన పిచ్చి కాకపోతే. ఏ నాయకుడు ఎంత డబ్బు ఎలా కూడబెట్టి ఎక్కడ దాచిపెట్టాడో ఆ నాయకుణ్ణి విమర్శించేవాళ్ల కంటే అనుసరించేవాళ్ళకే బాగా తెలుస్తుంది. ఇక జగన్ పై విచారణ నుంచి ఎక్కువ ఆశించడం సరి కాదని నా అభిప్రాయం. 2జీ కేసుని, దీన్ని పోల్చడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక కుంభకోణం ఒకే దిశలో విచారించుకుంటూ పోతే సరిపోతుంది. కానీ ఇది అలా కాదు ఆ ఆస్తులు ఎంత ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో, వాటి లావాదేవీలు, పుట్టుపూర్వోత్తరాలు, అందులో భాగస్వాములు... ఇదంతా పెద్ద తలనొప్పి. ఇందులో మళ్ళీ అధికారులకి వ్యాపారవేత్తల నుంచి తాయిలాలు ఉంటాయి. రాజకీయనాయకుల నుంచి ఒత్తిడులు ఉంటాయి. గుమ్మడికాయల దొంగల నుంచి భుజాలు తడుముకుంటూ బెదిరింపులు ఉంటాయి. ఇన్ని అరిష్టాలు దాటి సీబీఐ ఒక నివేదికతో కోర్టు మెట్లెక్కేనాటికి జగన్ పదవిలో ఉండొచ్చు. లేదా పదవిని కాపడుతూ ఉండొచ్చు. ఈ రెండూ జరక్కపోయినా కాంగ్రెస్ అధికారం నుంచి జారిపోవచ్చు.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు