7, ఏప్రిల్ 2011, గురువారం

ఈ ఇన్స్యూరెన్సు మనకు కావాల్సిందే !

గాలివానలు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు మొదలైనవాటిల్లో జరిగే నష్టాన్ని కొంతైనా భర్తీ చేసుకునేందుకు మనకు ఇన్స్యూరెన్సు లున్నై. కానీ మన నాయకులు చేస్తున్న అవినీతి, అరాచకాల కారణంగా జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసుకోడానికి మనకు ఇన్స్యూరెన్సుల్లేవు. వీళ్ళ వలన కలుగుతున్న నష్టం  పైవాటి వలన కలిగే నష్టం కంటే వందల రెట్లు ఎక్కువ. అంచేత మనకు ఇప్పుడు అర్జెంటుగా ఒక అవినీతి ఇన్స్యూరెన్సు కావాలి. భవిష్యత్తులో అలాంటి ఇన్స్యూరెన్సులు వస్తే వివిధ కంపెనీల పాలసీలు, వాళ్ల యాడులూ ఇలా ఉండొచ్చు:

ఎల్లైఎల్లైసీ వారి పాలసీ: రాజా బీమా పాలసీ. ప్రభుత్వం వారి లైసెన్సులను అప్పనంగా  అమ్మేసుకుంటే మీకు జరిగే నష్టానికి మా గ్యారంటీ.

సీఐసీఐసీ కంపెనీ వారి  మాస్టర్ ఇన్స్యూరెన్స్: రాజా ఆఫ్ కరప్షన్ పాలసీ. ఇది మాస్టర్ పాలసీ. ఈ భూమ్మీద ఇప్పటిదాకా జరిగిన అన్ని రకాల అవినీతి దోపిడీలు ఇందులో కవర్ చేస్తాం.ఇక్కడ మేం కవర్ చేసే దోపిడీలు కాకుండా ఈ లోకంలో మరో రకమైన  దోపిడీ ఉండదని మా నమ్మకం.

ఎఫ్ హెచ్ డీసీ వారి పృథ్వీ భంజన్ పాలసీ: హఠాత్తుగా మీ భూమి మాయమైపోతే అప్పుడెలా? మా పాలసీ తీసుకోండి.. మేం మీ భూమి మీకు ఇవ్వలేకపోవచ్చు. కానీ మీ తదనంతరం మీ అంత్యక్రియల కోసం సరిపడే భూమిని మాత్రం మీకు గ్యారంటీ ఇస్తాం. ఆ భూమి పైగల మీ హక్కును ఎవ్వరూ లాక్కోలేరు. ’కనీసం ఆ మాత్రం భూమి మిగలకపోతుందా, ఈ ఇన్స్యూరెన్సు అక్కర్లేదులే’ అనే నమ్మకం మీకుంటే మీ ఇష్టం.  (ఆనక మీ ఖర్మ!)

హజాజ్ వారి పోరంబోక్ ప్రాజెక్ట్ పాలసీ: ప్రాజెక్టుల పేరుతో చేసే ధనయజ్ఞాల వలన కలిగే నష్టానికి విరుగుడు మా పీపీపీ (పోరంబోక్ ప్రాజెక్ట్ పాలసీ)

మ్యాక్స్ న్యూ ఢిల్లీ వారి గుడిని మింగ్ పాలసీ: దేవాలయాల స్థలాలను, కొండలనూ మింగితే కలిగే నష్టానికి మా భరోసా.

నాన్-రిలయన్స్ వారి  లింగం మింగ్ పాలసీ: దేవుడి నగలను, సొమ్మును, ఇతర ఆస్తులనూ మింగేస్తే దానికి మా భరోసా.
...............................................
పై పాలసీలు సామాన్య జనానికి పనికొచ్చే కామన్ మ్యాన్ ఇన్స్యూరెన్సులు. కానీ వీటి బాబులాంటి పాలసీని ఒక కొత్త కంపెనీ మార్కెట్లో పెట్టింది.  దాని పేరు కాన్ మ్యాన్ ఇన్స్యూరెన్స్ (కీమ్యాన్ ఇన్స్యూరెన్స్ లాగా నన్నమాట). ఇది దోచుకునే వాడి కోసం పెట్టిన ఇన్స్యూరెన్సు. దీనికి బహిరంగ మార్కెట్లో ప్రచారం ఉండదు. రాజకీయ నాయకుల మధ్య అంతర్గతంగా మౌత్ పబ్లిసిటీ ఉంటుంది.

పాలసీ పేరు:  మనీప్యులేషన్ ప్రో పాలసీ (Moneypulation Pro Policy)
దీని యాడు ఇలా ఉంటది..
ఇకపై పట్టుబడిపోతానేమోననే భయం మీకు అక్కర్లేదు. పట్టుబడినా దిగులక్కర్లేదు. మీ కండగా మేముంటాం. మీరు దోచేసే ప్రతీ రూపాయినీ దాచేసే మార్గం మేం చూపిస్తాం. ఒకవేళ మీరు దొరికినా మీ అవినీతి దొరకదు.
మిమ్మల్ని పట్టుకోవచ్చు - కానీ మీ అవినీతిని, మీ డబ్బును పట్టుకోలేరు.
మీ తనివి తీరా దోచేసుకోండి. మా దగ్గర దాచేసుకోండి.
మరిన్ని వివరాలకు మీ మీ రాష్ట్రాల ముఖ్యులను గాని, మీ ప్రతిపక్షీయులను గానీ కలవండి. వారి అనుభవం మీకు పనికొస్తుంది.
-----------------------------
అవినీతిని ఎదుర్కొనేందుకు ఏమీ చెయ్యలేం, కనీసం ఇలా బ్లాగులోనైనా రాసుకుందాం, అని రాసాను. ఎదుర్కొనే మార్గం తెలవకే, ఎదుర్కోవడం చేతకాకే ఇలాంటి ఏడుపులు! అయితే అందరూ నాలా ఉండరు, అన్నా హజారే లాంటి హీరోలూ ఉంటారు.
============================
 అన్నా హజారే తిట్టుకోలేదు, అలాగని ఊరుకోనూ లేదు. రాలెగావ్ సిద్ధి నుంచి ఢిల్లీకి వెళ్ళాడు. అవినీతికి వ్యతిరేకంగా చట్టం చేస్తా చెయ్యవా అని గద్దించాడు. చట్టం నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు, మాకు ఉపయోగపడేలా కావాలి అని గర్జించాడు. సత్యాగ్రహం చేపట్టాడు. ధర్మాగ్రహం ఆయనది.  అవినీతిపై ఆయన చేస్తున్న పోరాటమిది. ఇది మన పోరాటం. మన భవిష్యత్తు కోసం మనం చేసుకునే ఇన్స్యూరెన్సు -జన లోక్‍పాల్ బిల్లు. రండి ఆయనకు మద్దతు ఇద్దాం. మనకు తోచిన రీతిలో మద్దతు ఇద్దాం. జన లోక్‍పాల్ బిల్లు తెచ్చుకుందాం.

హై. ఇందిరా పార్కు వద్ద రిలే నిరాహారదీక్షలు జరుగుతున్నై. అక్కడ మనమూ పాల్గొనవచ్చు.
పిటిషన్లు పెట్టొచ్చు:
http://www.petitiononline.com/2rp8n1k6/petition.html
http://www.thepetitionsite.com/1/SUPPORT-ANNA-HAZARE/
ప్రధానమంత్రికి ఉత్తరాలు రాయొచ్చు.

11 కామెంట్‌లు:

 1. చదువరి గారూ .. నాకో డవుటు,
  ఏదో విపత్తు నుంచి ఆదు కోవటానికి ఇన్స్యురన్స్ పాలసీలు చెప్పారు, మరి పెట్టిన సంవత్సరం నుంచి నష్టాల ఊబి లో ఉంటూ, పూర్తిగా విదేశీ పెట్టుబడుల మీద ఆధార పడ్డ చిల్లు కుండ లాంటి ఇన్స్యూరన్స్ కంపనీల లో పెట్టుబడులు నష్ట పోకుండా ఎక్కడ పాలసీ తీస్కోవాలి? ప్లీస్ చెప్పరూ...

  రిప్లయితొలగించండి
 2. "నాన్-రిలయన్స్ వారి లింగం మింగ్ పాలసీ:"
  BRILLIANT!!

  Yes, we need to do something.

  రిప్లయితొలగించండి
 3. Fantastic! :)
  నవ్వుతూనే బాగా వాతలు పెట్టారు. నవ్వులోనే చాలా ఆవేదన వెలిబుచ్చారు.
  శారద

  రిప్లయితొలగించండి
 4. ఈ పాలసీలన్నీ ఇప్పుడు యమర్జెంటు!

  మ్యాక్స్ న్యూ ఢిల్లీ వారి గుడిని మింగ్ పాలసీ:

  నాన్-రిలయన్స్ వారి లింగం మింగ్ పాలసీ_______:-))

  రిప్లయితొలగించండి
 5. The dramatically over-hyped faith in the Jan Lokpal Bill

  http://sabhlokcity.com/2011/04/the-dramatically-over-hyped-faith-in-the-jan-lokpal-bill/

  Jan Lok Pal – Caveat Emptor
  http://realitycheck.wordpress.com/2011/04/06/jan-lok-pal-caveat-emptor/

  http://www.vijayvaani.com/FrmPublicDisplayArticle.aspx?id=1716

  రిప్లయితొలగించండి
 6. నాది కూడా ఆత్రేయ గారి డౌటే నండి ;)

  రిప్లయితొలగించండి
 7. చదువరి గారు,
  టపాకి సంబంధం లేని వ్యాఖ్య రాస్తునందుకు ఎమీ అనుకోవద్దు. Thanks for understanding.
  మీరు ఈ పుస్తకం తప్పకుండా చదవండి. మీ స్నేహితులతో చదివించండి. చాలా బాగుంది. ఎంతో అథంటిక్ గా ఉంది అంటె 200 పేజిలు రేఫెరెన్స్ లు ఇచ్చారు. చదివితే అనందరి బాగ వతాలు తెలుస్తాయి. రాజీవ్ గారు అందరి సంగత్తి ఆధారలతో సహా బయట పెట్టారు. ఈ పుస్తకాన్ని గురుమూర్తి, చో రామస్వామి, స్వామి దయానంద, రాంజేత్మలాని, డిల్లి యునివర్సిటి మాజివై చాన్స్లర్ ఉపేంద్ర బక్షి మొదలైన వారు విడుదల చేశారు.

  http://breakingindia.com/
  by Rajiv Malhotra. He serves on the Board of Governors of the India Studies program at the University of Massachusetts, and served as a Chairman for the Asian Studies Education Committee of the State of New Jersey

  India's integrity is being undermined by three global networks that have well-established operating bases inside India: (i) Islamic radicalism linked with Pakistan, (ii) Maoists and Marxist radicals supported by China via intermediaries such as Nepal, and (iii) Dravidian and Dalit identity separatism being fostered by the West in the name of human rights. This book focuses on the third: the role of U.S. and European churches, academics, think-tanks, foundations, government and human rights groups in fostering separation of the identities of Dravidian and Dalit communities from the rest of India. The book is the result of five years of research, and uses information obtained in the West about foreign funding of these Indian-based activities. The research tracked the money trails that start out claiming to be for "education," "human rights," "empowerment training," and "leadership training," but end up in programs designed to produce angry youths who feel disenfranchised from Indian identity. The book reveals how outdated racial theories continue to provide academic frameworks and fuel the rhetoric that can trigger civil wars and genocides in developing countries. The Dravidian movement's 200-year history has such origins. Its latest manifestation is the "Dravidian Christianity" movement that fabricates a political and cultural history to exploit old faultlines. The book explicitly names individuals and institutions, including prominent Western ones and their Indian affiliates. Its goal is to spark an honest debate on the extent to which human rights and other "empowerment" projects are cover-ups for these nefarious activities. For more information, or to view videos about this book, visit www.breakingindia.com
  Visit this website also
  -----------------------------
  http://www.flipkart.com/breaking-india-rajiv-malhotra-arvindan-book-8191067374?ref=0c111290-a027-4157-bb13-5939f5e167a6

  రిప్లయితొలగించండి
 8. ఆత్రేయ, Sravya Vattikuti: :) దైవాధీనం ఇన్స్యూరెన్సు కంపెనీ అనేదేమైనా ఉందేమో చూడాలిక.
  కొత్త పాళీ, sbmurali2007, సుజాత: నెనరులు
  మొదటి అజ్ఞాత: లింకులు చూస్తానండి. నెనరులు.
  రెండో అజ్ఞాత: పుస్తకం చదూతానండి. నెనరులు.

  రిప్లయితొలగించండి
 9. మీ టపా బావుంది కానీ, చాలా లేటుగా రాసేరు. ఇటువంటి టపా ఒక నాలుగు రోజులముందుగానే ఎదురు చూసేను.

  కాముధ

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు