1, జులై 2008, మంగళవారం

బ్లాగరులో కొత్త అంశాలుబ్లాగరు కొన్ని కొత్త అంశాలను ప్రవేశపెట్టింది. draft.blogger.com చూస్తున్నవారికి ఈసంగతి తెలిసే ఉంటుంది. కొత్త కొత్త అంశాలను ప్రవేశపెట్టడం బ్లాగరుకు మామూలే. ఈ సారి ప్రవేశపెట్టిన అంశాల్లో నాకు బాగా నచ్చినదొకటుంది. - వ్యాఖ్యలపెట్టె. బ్లాగరులో వ్యాఖ్యలు రాసేందుకు అంతగా వీలు ఉండదు. వ్యాఖ్య రాయాలంటే ఓ లింకు నొక్కాలి, అప్పుడు వేరే పేజీ తెరుచుకుంటుంది - అందులో రాయాల్సుంటుంది. అదొక తలనెప్పి వ్యవహారం. ఈ పద్ధతిని సంస్కరించి, వ్యాఖ్యలపెట్టె కూడా జాబు పేజీ (ఇన్‌లైను) లోనే వచ్చే ఏర్పాటు చేసారు. ఇప్పుడు వర్డ్‌ప్రెస్‌లో ఉండే వీలు బ్లాగరులో కూడా చేరింది. అయితే దీనికి కాస్త హంగు చెయ్యాల్సి ఉన్నట్టుంది. ఏదేమైనా ఇప్పుడున్న స్థితిలోనైనా ఇది బానే ఉంది. కొత్త అంశాలను చూసేందుకు draft.blogger.com లో లాగినయి, డ్యాష్‌బోర్డులో ఈ కొత్త అంశాలను చూడవచ్చు.ఈ అంశాన్ని వాడటంలో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. నాకెదురైంది. అప్పుడు ఇక్కడిచ్చిన సూచనలను అనుసరించి, సాధించాను.

8 కామెంట్‌లు:

  1. ఈ కొత్త ఫీచరు చాలా బాగుంది...

    రిప్లయితొలగించండి
  2. థాంక్స్ అండి.. నేను మార్చేసా.. అలాగే వ్యాఖ్యలలో కూడా నేరుగా తెలుగులో రాసే పద్దతి ( ఈమాటలో లాగా) కూడా చేర్చాలనే ఆలోచన బ్లాగరు వాడికి రావాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  3. విలువైన చిర-నిరీక్షిత సమాచారాన్ని (much-awaited info) అందించారు. హృదయ పూర్వక నెనర్లు.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు